మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు ఇప్పటకీ లేవు

By Anil

మీరు చదివింది నిజమే, ఇండియాలోని జార్ఖండ్‌లో ఇప్పటకీ అత్యవసర 108 వైద్య సేవలు లేవు. ఇందుకు చాలా పెద్ద కారణమే ఉంది. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా దేశ వ్యాప్తంగా కేవలం 19 రాష్ట్రాల్లోనే 108 సేవలు సరిగ్గా అందుబాటులో ఉన్నాయి.

అయితే అన్నింటికి భిన్నంగా జార్ఖండ్‌లో 108 వాహనాలు రోడ్డెక్కపోవడానికి కారణం ఎంతో ఆసక్తికరంగా ఉంది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

2015 అక్టోబర్‌లో జార్ఖండ్ ప్రభుత్వం టాటా మోటార్స్ మరియు ఫోర్స్ మోటార్స్‌కు సుమారుగా 329 అంబులెన్స్‌లు కావాలని ఆర్డర్లిచ్చింది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

అయితే అనుకున్న సమయానికన్నా ముందుగానే రెండు తయారీ సంస్థలు కోరినన్ని అంబులెన్స్ వాహనాలను ఉత్పత్తి చేసి సిద్దం చేసింది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

జార్ఖండ్‌కు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ వాటిని స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఈ కారణం చేత మొత్తం అంబులెన్స్‌లు ఇప్పటి వరకు డీలర్ల వద్దనే ఉన్నాయి.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

అబులెన్స్‌లలో పరికరాల ఏర్పాటుకు, ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌లకు కాంట్రాక్టర్లను 2016 జూన్‌లో టెండర్లకు పిలిచింది. ఇలా ఒక సారి కాదు మూడు సార్లు టెండర్లకు పిలవడం ఏవో కారణాల చేత రద్దు చేయడం చేస్తూ వచ్చింది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పుడు నాలుగవసారి ఈ పనులకు సంభందించి కాంట్రాక్టర్లకు టెండర్లను ఆహ్వానించింది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

ఉన్నత వర్గాల సమాచారం మేరకు, మొత్తం ఆర్డర్లో టాటా మోటార్స్‌కు 289 మరియు ఫోర్స్ మోటార్స్‌కు 40 వాహనాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

ఇందులో ఫోర్స్ మోటార్స్‌కు చెందిన 40 వాహనాలను అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కోసం మరియు 289 వాహనాలను బేసిక్ లైఫ్ సపోర్ట్ కోసం అని తెలిసింది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

అయితే ఇప్పటి వరకు జాతీయ ఆరోగ్య మిషన్ ఫోర్స్ మోటార్స్ నుండి ఒక్క వాహనాన్ని మరియు టాటా మోటార్స్ నుండి 289 కి గాను 40 వాహనాలను తీసుకున్నట్లు తెలిసింది.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

అయితే టాటా మరియు ఫోర్స్ మోటార్స్ ప్రతినిధలు దీని గురించి స్పందిస్తూ, ఇంత వరకు జార్ఖండ్ ప్రభుతం కోరిన ఆర్డర్ మేరకు ఉత్పత్తి చేసిన వాహనాలు డెలివరీ తీసుకోవడం లేదు. ఒక్క సంవత్సరం పాటు డీలర్ల వద్ద ఉండటం వలన పెట్టుబడితో పాటు వాహనాల పనికిరాకుండే పోయే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు

ఇక జార్ఖండ్ ప్రజలు కూడా అత్యవసర సేవలకు దూరంగా ఉన్నారు. జార్ఖండ్‌లో 108 అత్యవసర సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ... ఏమో..

మన దేశంలోని ఆ రాష్ట్రంలో 108 సేవలు లేవు
  • చైనా నుండి ఎనిమిది సబ్‌మెరైన్‌లను కొంటున్న పాక్; ముప్పులో భారత్...!!
  • ఆగష్టు అమ్మకాల్లో సంచనాలు సృష్టించిన బైకులు ఇవే
  • క్రూయిజ్ షిప్స్ గురించి మానవాళికి తెలియని భయంకరమైన రహస్యాలు
 
Most Read Articles

English summary
Read In Telugu: The Curious Story Of How You Can’t Dial 108 For An Ambulance In Jharkhand
Story first published: Tuesday, September 27, 2016, 18:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X