రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

By Anil

జపనీస్ బ్యూటీ ఏంటి ? ఆర్డర్ ఏంటి ? రెండు కోట్లు రుపాయలేంటి ? అని అయోమయంలో ఉన్నారా... జపాన్‌కు చెందిన నిస్సాన్ గాడ్జిల్లా కారును ముద్దుగా జపనీస్ బ్యూటీని సంభోదించాము. ఈ కారును ఎంచుకునే వారు చాలా చాలా తక్కువ. ఈ జపనీస్ బ్యూటీని ఆర్డర్ చేసి ఆ జాబితా సరసన మన బాలీవుడ్ కథానాయకుడు జాన్ ఆబ్రహాం చేరాడు.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్‌ యాక్టర్ జాన్ ఆబ్రహాం నిస్సాన్‌కు చెందిన బ్లాక్ ఎడిషన్ జిటి-ఆర్ కారును, (దీనినే గాడ్జిల్లా అని కూడా పిలుస్తారు) ఆర్డర్ చేశాడు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌కు అద్బుతు రూపంగా చెప్పుకునే దీని ధర సుమారుగా రెండు కోట్ల రుపాయలు పైమాటే.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

జాన్ అబ్రహాం అభిమానులందరికీ బాగా తెలిసిన విషయం ఏమిటంటే అబ్రహాంకు బైకులంటే విపరీతమైన ఇష్టం. విభిన్న మోటార్ సైకిళ్లను ఎంచుకోవడంలో అబ్రహాం దిట్ట అని చెప్పవచ్చు.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

తన గ్యారేజిలోకి బైకులతో పాటు అత్యంత ఖరీదైన గాడ్జల్లాను కూడా తీసుకెళుతున్నాడు. ఇందుకోసం గాడ్జిల్లాకు తగ్గట్టుగా గ్యారేజిని డిజైన్ చేయిస్తున్నాడు ఈ నటుడు. దీనిని డెలివరీ తీసుకోవడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

జపాన్‌కు చెందిన నిస్సాన్ ఈ జిటి-ఆర్ కారును ఇండియన్ మార్కెట్లో నవంబర్ 9, 2016 న విడుదల చేసింది. మొదటి నిస్సాన్ జిటి-ఆర్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

తరువాత 2016 న్యూ యార్క్ ఆటో షో వేదిక మీద అప్‌డేటెడ్ మోడల్‌గా 2017 నిస్సాన్ జిటి-ఆర్ ను ప్రదర్శించారు. జాన్ ఇప్పుడు ఈ అప్‌డేటెడ్ వేరియంట్‌ను ఎంచుకుంటున్నాడు.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

సాంకేతికంగా ఈ నిస్సాన్ గాడ్జిల్లాలో 3.8-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ వి6 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 562బిహెచ్‌పి పవర్ మరియు 637ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

కేవలం 3 సెకండ్ల కాలంలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 307 కిలోమీటర్లుగా ఉంది.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

ఈ జిటి-ఆర్ లో ముందువైపున ఆరు పిస్టన్ల కాలిపర్ అనుసంధానం గల 390ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున నాలుగు పిస్టన్ కాలిపర్ల అనుసంధానం గల 380ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు

ఈ ఏడాది ప్రారంభంలో జాన్ అబ్రహాం మాట్లాడుతూ, జర్మనీ ఎస్‌యువిల తో విసుగెత్తి పోయాను ఇప్పుడు నిస్సాన్ గాడ్జిల్లా మీద ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు తెలిపాడు.

రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు
  • జాన్ అబ్రహాం లైఫ్ లోకి మరో పార్ట్ నర్
  • ఫెరారి కార్లను కలిగి ఉన్న పది ఇండియన్ సెలబ్రిటీలు
  • అక్కినేని ఫ్యామిలీ కార్ కలెక్షన్
 
Most Read Articles

English summary
Bollywood Star John Abraham Orders A ‘Godzilla’ For Rs. 2 Crore
Story first published: Monday, November 14, 2016, 18:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X