నూతన రంగుల్లో విడుదలైన మహీంద్రా మోజో: ధర మరియు ఇతర వివరాల కోసం

మహీంద్రా టూ వీలర్స్ తమ మోజో బైకును నూతన కలర్ ఆప్షన్‌లో విడుదల చేసింది. దీనితో మహీంద్రా మోజో మొత్తం నాలుగు విభిన్నమైన రంగుల్లో అందుబాటులో ఉంది, పూర్తి వివరాల కోసం..

By Anil

మహీంద్రా టూ వీలర్స్ తమ మోజో బైకును సరికొత్త కలర్ ఆప్షన్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది. మహీంద్రా మోజోను ఎక్కువ ప్రేమించే ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకుని మరో నూతన రంగులో దీనిని పరిచయం చేసింది మహీంద్రా. సన్‌బరస్ట్ ఎల్లో రంగులో విడుదలైన మోజో బైకు ప్రారంభ ధర రూ. 1.70 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

నూతన రంగుల్లో మహీంద్రా మోజో

నూతన పెయింట్ స్కీమ్‌లో విడుదల చేసిన మోజోలో సాంకేతికంగా మరే ఇతర మార్పులు చోటు చేసుకోలేదు. గతంలో మహీంద్రా మోజో మూడు విభిన్న రంగుల్లో లభించేది, నూతన కలర్ ఆప్షన్‌తో ఆ సంఖ్య నాలుగుకు చేరింది.

మహీంద్రా మోజో లభించు రంగులు

మహీంద్రా మోజో లభించు రంగులు

  • వోల్కానో రెడ్,
  • ఛార్ కోల్ బ్లాక్,
  • గ్లేసియర్ వైట్ మరియు
  • సన్‌బరస్ట్ యెల్లో
  • నూతన రంగుల్లో మహీంద్రా మోజో

    ఈ నూతన కలర్ ఆప్షన్ మోజో విడుదల కన్నా గతంలో మోజోను టూరర్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఈ లిమిటెడ్ టూరర్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 1.93 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉండేది. ఇందులో అదనపు టూరర్ ఎడిషన్ ఫీచర్లు ఉన్నాయి.

    నూతన రంగుల్లో మహీంద్రా మోజో

    సాంకేతికంగా మహీంద్రా మోజో లో 295సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 26.45బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

    నూతన రంగుల్లో మహీంద్రా మోజో

    ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు. అయితే మహీంద్రా ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందివ్వలేకపోయింది.

    నూతన రంగుల్లో మహీంద్రా మోజో

    ప్రస్తుతం మహీంద్రా మోజో దేశీయంగా ఉన్న హోండా సిబిఆర్250ఆర్, కెటిఎమ్ ఆర్‌సి390 మరియు రాయల్ ఎన్పీల్డ్ లోని 300సీసీ సామర్థ్యం ఉన్న ఉత్పత్తులకు పోటీగా నిలిచింది.

Most Read Articles

English summary
Mahindra Mojo Now Available In An All-New Colour Option
Story first published: Monday, November 14, 2016, 18:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X