మినీ క్లబ్‌మ్యాన్ విడుదల చేసిన మినీ: ధర రూ. 37.9 లక్షలు

బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియన్ మార్కెట్లోకి క్లబ్‌మ్యాన్ కారును విడుదల చేసింది. ధర మరియు ఇతర వివరాల కోసం...

By Anil

ఇండియన్ మార్కెట్లోకి బ్రిటీష్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మినీ నేడు (డిసెంబర్ 15, 2016) తమ క్లబ్‌మ్యాన్ సెకండ్ జనరేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37.90 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు మినీ ప్రకటించింది.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

క్లబ్‌మ్యాన్ సెకండ్ జనరేషన్‌గా విడుదలైన ఈ వేరియంట్ ఇండియన్ మార్కెట్లోకి కూపర్ ఎస్ అనే కేవలం ఒకే ఒక ట్రిమ్ లెవల్‌లో అందుబాటులో ఉండనుంది.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్ లో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 189బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

మినీ సంస్థ ఈ కూపర్ ఎస్ క్లబ్‌మ్యాన్ లోని ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసింది. ఈ వేరియంట్ లీటర్‌కు 13.8 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్ కేవలం 7.2 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 228కిలోమీటర్లుగా ఉంది.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

కొలతల పరంగా ఈ కూపర్ ఎస్ క్లబ్‌మ్యాన్ పొడవు 4,523ఎమ్ఎమ్, వెడల్పు 1,800ఎమ్ఎమ్, ఎత్తు 1,441ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,670ఎమ్ఎమ్‌గా ఉంది. ఇందులో 360 లీటర్ల బూట్ స్పేస్ కలదు, వెనుక సీట్లను మడిపివేయడం ద్వారా దీనిని 1,250 లీటర్ల పరిమాణానికి పెంచుకోవచ్చు (డిక్కీలోని ఖాళీ ప్రదేశాన్ని బూట్ స్పేస్ అని అంటారు).

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

డిజైన్ పరంగా క్లబ్‌మ్యాన్ సాధారణ మినీ కన్నా స్వల్పంగా విస్తరించినట్లు కనిపిస్తుంది. దీనికమైన గుండ్రటి హెడ్ ల్యాంప్స్ మరియు క్రింద వైపు ఫ్రంట్ గ్రిల్ స్వల్ప మార్పులకు గురయ్యాయి. 17-అంగుళాల వెంట్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఇందులో కలవు.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

వెనుక వైపు డిజైన్‌లో పాత కాలం నాటి రెండు డోర్ల నమూనా ఇందులో మిస్ చేయలేదు పెద్ద పరిమాణంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్‌ను గుర్తించవచ్చు.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

ఇంటీరియర్‌లో స్పోర్ట్స్ ఫీచర్డ్ సీట్లను అందించారు. లెథర్ తొడుగులున్న స్టీరింగ్ వీల్‌లో విభిన్న నియంత్రికల గల వ్యవస్థను అందించారు. 8.8-అంగుళాల పరిమాణం గల గుండ్రటి ఆకారంలో ఉన్న తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తన స్థానాన్ని ఈ క్లబ‌మ్యాన్‌లో భర్తీ చేసుకుంది.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

ఇంటీరియర్‌ను తెలుపు లేదా నలుపు కలర్ ఆప్షన్‌లో అందిస్తుంది. మరియు కారు ఇంటీరియర్‌లోని పై బాగాన్ని రూపొందించేందుకు మూడు ఆప్షన్లను ఇచ్చింది. అవి, లెథర్/క్లాత్ కాంబినేషన్, లెథరెట్టీ/క్లాత్ కాంబినేషన్ మరియు లెథరెట్టీ.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

సరికొత్త మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్ వేరియంట్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, మరియు రన్ ఫ్లాట్ టైర్లు వంటి భద్రత ఫీచర్లను ఇందులో ప్రవేశపెట్టింది.

మినీ క్లబ్‌మ్యాన్ కూపర్ ఎస్

  • బజాజ్ డామినర్ 400 విడుదల: ప్రారంభ ధర రూ. 1.36 లక్షలు

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
Mini Clubman Launched In India; Priced At Rs 37.9 Lakh
Story first published: Thursday, December 15, 2016, 19:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X