పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. కోటిన్నర

By Anil

జర్మనీకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియన్ మార్కెట్లోకి పోర్షే 911 శ్రేణిలో ఫేస్‌లిఫ్ట్ కారును విడుదలచేసింది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ పోర్షే 911 కారును మొదటి సారిగా 2015 సెప్టెంబరులో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో లో ప్రదర్శించారు. దీనిని ఇండియన్ మార్కెట్లోకి 1.42 కోట్లు ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇది లభించు వేరియంట్లు మరియు పూర్తి విడుదల వివరాల క్రింది కథనంలో....

 పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ధర వివరాలు

పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ధర వివరాలు

  • క్యారేరా ధర రూ. 1,42,33,000
  • క్యారేరా క్యాబ్రియోలెట్ ధర రూ. 1,57,50,000
  • క్యారేరా ఎస్ ధర రూ. 1,63,49,000
  • క్యారేరా ఎస్ క్యాబ్రియెలెట్ ధర రూ. 1,76,39,000
  • టుర్బో ధర రూ. 2,25,92,000
  • టుర్బో క్యాబ్రియెలెట్ ధర రూ. 2,39,34,000
  • టుర్బో ఎస్ ధర రూ. 2,66,17,000
  • టుర్బో ఎస్ క్యాబ్రియోలెట్ ధర రూ. 2,81,64,000

    అన్ని ధరలు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

  •  పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ సాంకేతిక వివరాలు

    పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ సాంకేతిక వివరాలు

    పోర్షే సంస్థ తమ 911 ఫేస్‌లిఫ్ట్‌లోని క్యారేరా మరియు క్యారేరా ఎస్‌లో 2,981 సీసీ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో ఫ్లాట్ ఆరు సిలిండర్ల ఇంజన్‌ను అందించింది. దీనికి 7-స్పీడ్ పికిడె డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

     టుర్బో మరియు టుర్బో ఎస్‌ పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్‌లోని ఇంజన్ వివరాలు

    టుర్బో మరియు టుర్బో ఎస్‌ పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్‌లోని ఇంజన్ వివరాలు

    ఈ రెండు వేరియంట్లలో కూడా 3,800 సీసీ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో ఫ్లాట్ ఆరు సిలిండర్ల ఇంజన్ కలదు. ఈ ఇంజన్‌కు 7-స్పీడ్ పికిడె డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

     క్యారేరా పవర్ మరియు ఇతర వివరాలు

    క్యారేరా పవర్ మరియు ఇతర వివరాలు

    • పవర్: 365బిహెచ్‌పి
    • టార్క్: 450ఎన్ఎమ్
    • గంటకు 0-100 కిమీల వేగం: 4.2 సెకండ్లకాలంలో
    • గరిష్ట వేగం గంటకు: 290 కిమీలు
    • మైలేజ్: 13.3 కిమీ/లీ
    • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 64 లీటర్లు
    •  క్యారేరా ఎస్ పవర్ మరియు ఇతర వివరాలు

      క్యారేరా ఎస్ పవర్ మరియు ఇతర వివరాలు

      • పవర్: 414బిహెచ్‌పి
      • టార్క్: 500ఎన్ఎమ్
      • గంటకు 0-100 కిమీల వేగం: 3.9 సెకండ్లకాలంలో
      • గరిష్ట వేగం గంటకు: 306 కిమీలు
      • మైలేజ్: 13 కిమీ/లీ
      • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 64 లీటర్లు
      •  టుర్బో పవర్ మరియు ఇతర వివరాలు

        టుర్బో పవర్ మరియు ఇతర వివరాలు

        • పవర్: 533బిహెచ్‌పి
        • టార్క్: 60ఎన్ఎమ్
        • గంటకు 0-100 కిమీల వేగం: 3.0 సెకండ్లకాలంలో
        • గరిష్ట వేగం గంటకు: 320 కిమీలు
        • మైలేజ్: 11 కిమీ/లీ
        • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 68 లీటర్లు
        • టుర్బో ఎస్

          టుర్బో ఎస్

          • పవర్: 572బిహెచ్‌పి
          • టార్క్: 700ఎన్ఎమ్
          • గంటకు 0-100 కిమీల వేగం: 2.9 సెకండ్లకాలంలో
          • గరిష్ట వేగం గంటకు: 330 కిమీలు
          • మైలేజ్: 10.75 కిమీ/లీ
          • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 68 లీటర్లు
          • డ్రైవింగ్ మోడ్స్

            డ్రైవింగ్ మోడ్స్

            ప్రస్తుతం విడుదలైన అన్ని పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్‌లలో డ్రైవర్లకు ఎంతో అనువుగా ఉండేందుకు అన్ని డ్రైవింగ్ మోడ్‌లను అనుసంధానం చేసారు. అవి నార్మల్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ మరియు ఇండివిడ్యువల్ అనేవి ఉన్నాయి.

            పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. కోటిన్నర

            అంతే కాకుండా ఇందులో స్పోర్ట్ రెస్పాన్స్ బటన్‌ను అందించారు. దీని ద్వారా ఇంజన్ 20 నిమిషాల ముందు నుండే మండటం మొదలవుతుంది అందుకోసం గరిష్ట యాక్సిలరేషన్ అనేది జరుగుతుంది. టుర్బో మరియు టుర్బో ఎస్ అదే విధంగా క్యాబ్రియెలెట్ వంటి వాటిలో చూస్తే ఈ బటన్ ను ప్రెస్ చేయడం సాధారణం కన్నా 50ఎన్ఎమ్ అధిక టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

            వెనుక చక్రాలకు స్టీరింగ్

            వెనుక చక్రాలకు స్టీరింగ్

            పోర్షే ఈ నూతన 911 మోడళ్లలో వెనుక చక్రాలకు స్టీరింగ్‌ను అనుసందానం చేశారు. తద్వారా ముందు చక్రాలు తిరిగే క్రమాన్ని బట్టి కొద్ది మేర వ్యతిరేక దిశలో కదులుతుంది. అది కూడా కారు వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉన్నపుడు మాత్రమే.

            పోర్షే 911 డిజైన్

            పోర్షే 911 డిజైన్

            పోర్షే 911 ఫేస్‌‌లిఫ్ట్‌ ను చూసిన తరువాత ముందు దానితో పోల్చితే ఎలాంటి మార్పు లేదనిపిస్తుంది. ఇక సర్వసాధారణమైన ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లను అదే ప్రదేశంలో అందించారు.

            పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. కోటిన్నర

            ముందు వైపున గరిష్ట గాలిని గ్రహించే విధంగా ఎయిర్ ఇంటేకర్‌ను డిజైన్ చేశారు. దీని ద్వారా గ్రహింపబడే గాలి వెనుక వైపున ఇంజన్‌ను చల్లబరుస్తుంది అందుకోసం ముందు నుండి వెనుక వైపు వరకు ప్రత్యేక వెంట్‌లను ఏర్పాటు చేశారు.

            పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. కోటిన్నర

            హెడ్ లైట్ల విషయంలో అవుట్ డేటెడ్ అనే మాట రాకుండా పగచి పూట వెలిగే లైట్ల జోడింపుతో సరికొత్త హెడ్‌లైట్లను అందించారు. అలాగే వెనుక వైపున ఉన్న టెయిల్ ల్యాంప్స్ మరియు నూతన రంగులో ఉన్న ఇంజన్ కలర్ కొంత ప్రత్యేకంగా ఉంది.

            పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. కోటిన్నర

            ఇంటీరియర్‌లో పోర్షే కమ్యునికేషన్ మేనేజ్‌మెంట్ గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. దీనిని ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి యాప్‌లతో వినియోగించుకోవచ్చు.

            పోటీ

            పోటీ

            పోర్షే 911 కారు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి, జాగ్వార్ ఎఫ్-టైప్, ఫెరారి 488 జిటిబి మరియు ల్యాంబోర్గిని హురాకాన్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.

            పోర్షే 911 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. కోటిన్నర

            ఇండియా నుండి 10 ఇతర దేశాలకు ఉన్న రైలు మార్గాలు

Most Read Articles

English summary
Porsche 911 Roars Into India, Prices Start At Rs. 1.42 Crore
Story first published: Thursday, June 30, 2016, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X