శాంగ్‌యాంగ్ నుండి రెండవ ఎస్‌యువి టివోలి

By Anil

సౌత్ కొరియకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ శాంగ్‌యాంగ్ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వారి సమక్షంలో దేశీయ ఎస్‌యువి మార్కెట్లోకి తమ రెండవ ఉత్పత్తిగా టిలోవి ఎస్‌యువిని ప్రదర్శించింది. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద మహీంద్రా వారి స్టాల్‌ నందు దీనిని ప్రదర్శనకు ఉంచారు.

శాంగ్‌యాంగ్ నుండి రెండవ ఉత్పత్తిగా మార్కెట్లోకి విడుదల అయిన టివోలి ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

శాంగ్‌యాంగ్ మోటార్స్ తమ సరికొత్త టివోలి ఎస్‌యువిని రెండు ఇంజన్ ఆప్షన్‌‌లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

  • 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్
  • 1.6-లీటర్ డీజల్ ఇంజన్
  •  పవర్

    పవర్

    పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్‌‌పిఎమ్ వద్ద 126 బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ ఇంజన్ 3,400 నుండి 4,000 ఆర్‌పిఎమ్ మధ్య దాదాపుగా 113 బిహెచ్‌పి పవర్ ను విడుదల చేయును.

     టార్క్‌

    టార్క్‌

    పెట్రోల్ ఇంజన్ 4,600 ఆర్‌పిఎమ్ వద్ద 160 ఎన్ఎమ్ మరియు డీజల్ ఇంజన్ 1,500 నుండి 2,500 ఆర్‌పిఎమ్ మధ్య ఉన్నప్పుడు 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

     మైలేజ్

    మైలేజ్

    • పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 15.6 కిలోమీటర్లు
    • డీజల్ ఇంజన్ లీటర్‌కు 23.2 కిలోమీటర్లు
    • ట్రాన్స్‌మిషన్

      ట్రాన్స్‌మిషన్

      రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

      డిజైన్

      డిజైన్

      శాంగ్‌యాంగ్ వారి టివోలి ఎస్‌యువి చూడటానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ముందు వైపున పదునైన ఆకారాన్ని గల హెడ్ లైట్లు వీటితో పాటు పగటి పూట వెలిగే లైట్లు , చిన్నగా సింపుల్‌గా గల ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్దగా గల ఎయిర్ ఇంటేకర్ కలదు.

      వెనుక మరియు ప్రక్క వైపున డిజైన్

      వెనుక మరియు ప్రక్క వైపున డిజైన్

      ప్రక్క వైపుల ప్లేన్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కలవు. వెనుకవైపునకు దృష్టి మళ్లించినట్లయితే కర్వ్‌డ్ టెయిల్ ల్యాంప్స్ మనకు కనువిందు చేస్తాయి.

      ఇంటీరియర్

      ఇంటీరియర్

      టివోలి ఇంటీరియర్‌లో మూడు విభిన్న రంగుల్లో గల హెడ్ లెథర్ సీట్లు (బ్లాక్, రెడ్ మరియు బీజి ) మరియు 3.5-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ తాకే తెర మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కలవు.

       భద్రత ఫీచర్లు

      భద్రత ఫీచర్లు

      • ఏడు ఎయిర్ బ్యాగులు
      • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్
      • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
      • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
      • పోటి

        పోటి

        ఇది మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ క్రెటా మరియు మారుతి సుజుకి వారి ఎస్-క్రాస్ ఎస్‌యువి లకు పోటీని ఇవ్వనుంది.

        శాంగ్‌యాంగ్ నుండి రెండవ ఎస్‌యువి టివోలి
        • నిస్సాన్ నుండి ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి
        • గో క్రాస్ క్రాసోవర్ కారును ప్రదర్శించిన డాట్సన్ ఇండియా

Most Read Articles

English summary
Mahindra Owned Ssangyong Showcases Tivoli SUV At 2016 Auto Expo
Story first published: Friday, February 12, 2016, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X