జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఉపయోగం, మరియు బెస్ట్ జిపిఎస్ డివైజ్‌ల కోసం...?

By Anil

జిపిఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఇప్పుడు అన్ని రంగాల్లో ఎంతో కీలకమైపోయింది. అన్నింటికన్నా ఆటోమొబైల్స్ రంగంలో వీటి పాత్ర మరీ ఎక్కువగా ఉంది. ఒక కొత్త ప్రాంతానికి వెళ్లినపుడు మీరు చేరుకోవాల్సిన అడ్రస్ కోసం ప్రతి సారి ఇతరులను సంప్రదిస్తుంటారు. ఒక వేళ ఆ ప్రాంతంలో భాషతో సమస్య అయితే..? అచ్చం అలాంటి సందర్బంలో జిపిఎస్ ఎంతో అవసరం అవుతుంది. గమ్యాన్ని చేరుకోవడంలో జిపిఎస్ వ్యవస్థ ఎంతగానో సహకరిస్తుంది.

జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది

ఇప్పుడు జిపిఎస్ అందుబాటులోకి వచ్చాక మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన జిపిఎస్ వ్యవస్థలు మార్కెట్లో పోటీపడుతున్నాయి. ధ్వనిని గ్రహించి మరియు టెక్ట్స్ ద్వారా మనకు కావాల్సిన ప్రదేశానికి మార్గనిర్దేశకం చేయడంలో నూతన జిపిఎస్ పాత్ర అద్బుతం అని చెప్పాలి.

జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది

తెలియని ప్రాంతంలో మనకు కావాల్సిన హోటళ్లు, హాస్పిటల్స్, రెస్టారెంట్లు మరియు పెంట్రోల్ బంకులతో పాటు ఇతర ప్రదేశాల్ని జిపిఎస్ పరిజ్ఞానంతో గుర్చించవచ్చు. అంతే కాదండోయ్ ఒక వేళ వాహనం చోరీకి గురైతే ఆ వాహనం ఎక్కడుందో కూడా జిపిఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించవచ్చు.

జిపిఎస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి

జిపిఎస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి

కారులో ఉండే ఓ చిన్న పరికరం (జిపిఎస్ డివైజ్) మరియు విశ్వంలో ఉండే ఉపగ్రహాలకు (శాటిలైట్) మధ్య అనుసంధాన వ్యవస్థ ఉంటుంది. కారులోని జిపిఎస్ డివైజ్ ఈ శాటిలైట్ సాయంతో పనిచేస్తుంది. విశ్వంలో ఉండే ఈ శాటిలైట్ కారులోని జిపిఎస్ డివైజ్‌ను ట్రాక్ చేస్తుంటుంది.

జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది

భూ ఉపరితలం పైనుంచి 11 వేల నాటికల్ మైళ్ళ దూరంలో మొత్తం 24 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తూ రేడియో తరంగాలను వెదజల్లుతూంటాయి. ఈ 24 ఉపగ్రహాలలో భూమి చుట్టూ 6 కక్ష్యలలో ఉండే 4 ఉపగ్రహాలతో ఈ జిపిఎస్ డివైజ్ అనుసంధానమై ఉంటుంది.

జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది

కారులోని జిపిఎస్ డివైజ్ ఎలాంటి వాతావరణంలో అయినా సిగ్నల్స్‌ను (మబ్బులు, ప్లాస్టిక్ గుండా సిగ్నల్స్ పాస్ అవుతాయి) సమర్థవంతంగా గ్రహించగలదు. కానీ, బిల్డింగ్స్ వంటి ధృడమైన/ఘనమైన వస్తువుల గుండా ఈ సిగ్నల్స్ పాస్ కావు.

జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది

శాటిలైట్ కారులోని జిపిఎస్ డివైజ్‌ను యాక్సెస్ చేసుకొని, అది ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే సమాచారాన్ని భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. జిపిఎస్ డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసుకున్న మ్యాప్స్ ఆధారంగా ఇది సాధ్యమవుతుంది.

జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది

కేవలం జిపిఎస్ డివైజ్‌ల ద్వారానే కాకుండా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ఖరీదైన ఫోన్లలో కూడా జిపిఎస్ సిస్టమ్ అందుబాటులో ఉంటోంది. ఫోన్‌లోని జిపిఎస్ సాయంతో సదరు వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసుకోవచ్చు.

** 1978లో తొలి జిపిఎస్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వరసగా 1994 వరకు మొత్తం 24 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.

జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది

ప్రస్తుతం ఇండియన్ ఆటో మోటివ్ ఇండస్ట్రీలో ఉన్న ఐదు అత్యుత్తమ జిపిఎస్ న్యావిగేషన్‌ డివైజ్‌ల గురించి ఇవాళ్టి స్టోరీలో అందిస్తున్నాము. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఎక్కువగా అమ్ముడుపోతున్న వంటి అంశాల ద్వారా ఈ ఐదింటిని ఎంచుకోవడం జరిగింది.

1. మ్యాప్‌మైఇండియా ఎల్ఎక్స్140 డబ్ల్యూఎస్ జిపిఎస్ న్యావిగేటర్

1. మ్యాప్‌మైఇండియా ఎల్ఎక్స్140 డబ్ల్యూఎస్ జిపిఎస్ న్యావిగేటర్

దేశీయంగా ఉన్న జిపిఎస్ మార్కెట్లో మ్యాప్‌మైఇండియా వారి న్యావిగేషన్ సిస్టమ్ సంచలనం సృష్టించింది. జిపిఎస్ వ్యవస్థకు కావాల్సిన అధనాతన పరిజ్ఞాన్ని ఎప్పుటికప్పుడు అందిపుచ్చుకుని తమ ఎల్ఎక్స్140డబ్ల్యూఎస్ లో జిపిఎస్ న్యావిగేటర్‌లో అందిస్తోంది.

ఫీచర్లు

ఫీచర్లు

 • సులభతరమైన న్యావిగేషన్ మరియు అన్ని కోణాల నుండి చూడటానికి వీలుండే విధంగా 10.9 సెం.మీల టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ కలదు.
 • ఆల్ ఇండియా స్ట్రీట్ లెవల్ ఆఫ్ లైన్ మ్యాప్స్ ముందుగా లోడ్ చేయబడ్డాయి.
 • ప్రతి మలుపు వద్ద ప్రాంతీయ భాషతో పాటు హిందీ మరియు ఇంగ్లీష్‌లో వాయిస్ ద్వారా సమాచారాన్ని అందిస్తుంది.
 • ఇన్-బిల్ట్ వీడియో ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్, ఫోటో బ్రౌజర్, గేమ్స్, ఇ-బుక్ రీడర్ వంటివి కలవు.

దీని ధర రూ. 4,899 లు

2. ప్రిమొ జిపిఎస్ పిజి723జి - 7 అంగుళాల జిపిఎస్ న్యావిగేటర్

2. ప్రిమొ జిపిఎస్ పిజి723జి - 7 అంగుళాల జిపిఎస్ న్యావిగేటర్

పెద్ద స్క్రీన్ గల జిపిఎస్ సిస్టమ్ కావాలనుకునే వారికి ఈ ప్రిమొ జిపిఎస్ పిజి723జి, 7-అంగుళాల జిపిఎస్ న్యావిగేటర్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

ఫీచర్లు

ఫీచర్లు

 • 17.8 సెం.మీల (7-అంగుళాల) తాకే తెర గల జిపిఎస్ కార్ న్యావిగేటర్
 • సుమారుగా 7000 నగరాలు మరియు పట్టణాలకు సంభందించిన మ్యాప్‌మైఇండియా మ్యాప్స్‌ వివరాలను తెలిపే టర్న్ బై టర్న్ న్యావిగేటర్ కలదు.
 • హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ కోసం బ్లూటూత్ మరియు రివర్స్ కెమెరా కోసం ఏవిఐఎమ్ పోర్ట్ కలదు.
 • బిల్ట్ ఇన్ వీడియో ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్, పిక్చర్ వ్యూయర్ మరియు ఎఫ్ఎమ్ ట్రాన్స్‌మిట్టర్ కలదు.
 • ఎమ్‌పి3, డబ్ల్యూఎవి, ఎమ్‌పి4, ఏవిఐ మరియు జెపిఇజి లను ప్లే చేయగల మెమొరీ కార్డ్ స్లాట్ కలదు.
 • ఒక ఏడాది వాటరంటీ కలదు

ధర రూ. 12,999 లు (అమెజాన్‌)

3. గార్మిన్ నువి 40 ఎల్ఎమ్ జిపిఎస్ న్యావిగేటర్

3. గార్మిన్ నువి 40 ఎల్ఎమ్ జిపిఎస్ న్యావిగేటర్

గార్మిన్ నువి 40 ఎల్ఎమ్ జిపిఎస్ న్యావిగేటర్ చిన్నగా ఉన్న పోర్టబుల్ డివైస్, ఆధునిక టెక్నాలజీతో సులభంగా దీనిని ఆపరేట్ చేయవచ్చు.

ఫీచర్లు

ఫీచర్లు

 • 10.9సెం.మీల (4.3-అంగుళాల) టిఎఫ్‌టి టచ్‌ స్క్రీన్ జిపిఎస్ న్యావిగేటర్
 • జక్షన్ వ్యూవ్ మరియు లాంగ్వేజ్ అసిస్ట్ కలదు
 • జీవిత కాలం అప్‌డేట్స్ ఉండే ప్రీ లోడెడ్ మ్యాప్స్
 • స్పీడ్ లిమిట్ ఇండికేటర్
 • వీధి పేర్లను వాయిస్ పద్దతిలో తెలిపే ఫీచర్
 • మైక్రో ఎస్‌డి కార్డ్ సపోర్ట్

ధర రూ. 8,750 లు (అమెజాన్‌)

4. గార్మిన్ నువి 65 ఎల్ఎమ్ జిపిఎస్ సిస్టమ్ (బ్లాక్)

4. గార్మిన్ నువి 65 ఎల్ఎమ్ జిపిఎస్ సిస్టమ్ (బ్లాక్)

గార్మిన్ సంస్థకు చెందిన మరో జిపిఎస్ సిస్టమ్ 65 ఎల్ఎమ్. ఇది పరిమాణం పరంగా పెద్దగా ఉండి నిలువు మరియు అడ్డంగా రొటేట్ చేసుకుని వినియోగించుకునే వీలును కలిగి ఉంది.

ఫీచర్లు

ఫీచర్లు

 • 15.4 సెం.మీల (6-అంగుళాల) టిఎఫ్‌టి టచ్‌ స్క్రీన్ జిపిఎస్ న్యావిగేటర్
 • జంక్షన్ వ్యూవ్ మరియు లేన్ అసిస్ట్
 • జీవిత కాలం అప్‌డేట్స్ ఉండే ప్రీ లోడెడ్ మ్యాప్స్
 • వీధి పేర్లను వాయిస్ పద్దతిలో తెలిపే ఫీచర్
 • మైక్రో ఎస్‌డి కార్డ్ సపోర్ట్
 • ఎకో రూటు
 • ట్రిప్ ప్లానర్

ధర రూ. 11,215 లు (అమెజాన్)

5. టామ్‌టామ్ స్టార్ట్-25 5-అంగుళాల జిపిఎస్ న్యావిగేషన్ సిస్టమ్

5. టామ్‌టామ్ స్టార్ట్-25 5-అంగుళాల జిపిఎస్ న్యావిగేషన్ సిస్టమ్

మంచి ఫీచర్లతో నిండిన మరొక జిపిఎస్ సిస్టమ్ టామ్‌టామ్ స్టార్ట్-25, 5-అంగుళాల జిపిఎస్ న్యావిగేషన్ సిస్టమ్. ఇది అత్యంత సరసమైన ధరలో లభిస్తోంది.

ఫీచర్లు

ఫీచర్లు

 • 12.7 సెం.మీల (5-అంగుళాల) టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ల్పే కలదు
 • వాయిస్ గైడ్ ద్వారా టర్న్ బై టర్న్ డైరెక్షన్, (13 ఇండియన్ భాషలలో సపోర్ట్)
 • పది లక్షలకు పైగా ప్రి లోడెడ్ చేయబడిన పాయింట్లు (రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాలు వంటివెన్నో)
 • ల్యాండ్ మార్క్ ద్వారా న్యావిగేషన్
 • లేన్ గైడెన్స్
 • బ్లూటూత్

ధర రూ. 5,774 లు

 
Most Read Articles

English summary
The Working Of A Portable GPS Navigation Device And Top 5 Best GPS Navigation System In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X