ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి ? వివరంగా...!!

Written By:

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వాహనాలు నడవడానికి వినియోగించే సాంకేతికత ఒకటే అయినా, ఆ వాహనాలను నడిపే పద్దతులు వేరుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో వాహనంలో ఎడమవైపు స్టీరింగ్ వీల్‌తో రోడ్డుకు కుడివైపు నడుపుతుంటారు. మరికొన్ని దేశాల్లో కుడివైపు స్టీరింగ్ వీల్‌తో రోడ్డుకు ఎడమవైపున డ్రైవింగ్ చేస్తుంటారు. అంతర్జాతీయంగా వాహనాలు డ్రైవింగ్ చేసే వారు మొదట్లో కాస్త తికమక పడటం ఖాయం, అయితే రాను రాను అలవాటయిపోతుంది.

ఒక్కో దేశం విభిన్న డ్రైవింగ్ పద్దతులను ఫాలో అవడం వెనుకున్న కారణాల కోసం చరిత్రను తిరగేస్తే వాటి వెనుకున్న సీక్రెట్స్ కొన్ని లభించాయి. ఇవాళ్టి కథనంలో వాటి గురించి చూద్దాం రండి.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

ప్రపంచంలోని చాలా దేశాల్లో రోడ్డుకు కుడివైపున మాత్రమే వాహనాలను నడుపుతుంటారు. మరియు వారి వాహనాలలో ఎడమవైపున స్టీరింగ్ వీల్ ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఈజీగా అర్థం అవుతుంది.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

కొన్ని దేశాల్లో రోడ్డుకు ఎడమ వైపున మాత్రమే వాహనాలను నడుపుతారు. మరియు వారి వాహనాల్లో స్టీరింగ్ వీల్ కుడివైపున ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో ఈ డ్రైవింగ్ విధానం అమలులో ఉంది.

ఎడమవైపు స్టీరింగ్ వీల్‌కు కారణం...?

ఎడమవైపు స్టీరింగ్ వీల్‌కు కారణం...?

దీని గురించి తెలుసుకోవాలంటే వాహనాల స్థానంలో గుర్రాలను ఉపయోగించే కాలానికి వెళ్లాల్సిందే. అప్పట్లో గుర్రాన్ని ఎడమ వైపు నుండి ఎక్కేవాళ్లు. మరియు కత్తిని ఎడమవైపు ఉంచుకునే వాళ్లు.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

అత్యవసర సమయాల్లో త్వరితగతిన స్పందించే చెయ్యి కుడి చేయి. కాబట్టి కుడి చేతి వాటం ఎక్కువగా ఉండటం వలన కత్తిని ఎడమవైపున ఉంచుకునే వాళ్లు. మరియు కుడి వైపు నుండి గుర్రాన్ని ఎక్కితే కత్తి తగులుతుంది కాబట్టి ఎడమ వైపు నుండి గుర్రాన్ని ఎక్కే వాళ్లు.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

ఆ తరువాత కాలంలో గుర్రపు సవారీ కాస్త గుర్రపు బగ్గీల మీద ప్రయాణానికి రూపాంతరం చెందింది. ఎప్పటిలాగే ఎడమవైపు నుండి గుర్రాన్ని ఎక్కడం అలవాటు చేసుకున్న పాశ్చ్యాతులు ఎడమవైపు నుండే గుర్రపు బళ్లను ఎక్కేవారు.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

తరువాత తరానికి వాహనాలు పరిచయం అయ్యాయి. హెన్రీ పోర్డ్ ప్రవేశపెట్టిన మొదటి కారులో కూడా ఎడమవైపు డ్రైవింగ్ సీటును ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి వాహనంలో ఎడమవైపు స్టీరింగ్ ఉండే విధానం అందుబాటులోకి వచ్చింది.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

డబులు రోడ్ల మీద రోడ్డుకు కుడి వైపు ప్రయాణిస్తూ, డ్రైవింగ్ సీట్ ఎడమవైపు ఉండేది. కాబట్టి ప్యాసింజర్లు కుడివైపు నుండి వాహనాలను ఎక్కుతున్నారు.

కుడి వైపు స్టీరింగ్ వీల్ కు కారణం....?

కుడి వైపు స్టీరింగ్ వీల్ కు కారణం....?

ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్ది దేశాలు మాత్రమే కుడి వైపు స్టీరింగ్ వీల్ ఉన్న వాహనాలతో రోడ్డుకు ఎడమ వైపు డ్రైవింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఎత్తున వాహన పరిశ్రమలు ఉన్న ఇండియా ఈ విధానాన్నే అనుసరిస్తోంది.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

ఇండియాకు వాహనాల తాకిడి జరిగింది బ్రిటీషర్ల ద్వారానే అని చెప్పాలి. బ్రిటిషర్లు ఇండియాలో వాహనాలను ఉపయోగించింది ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ పద్దతిలోనే.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

కాబట్టి భారతీయులు అదే విధానాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.

ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి

భారత ప్రభుత్వంలో రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభమైన తరువాత రవాణాపరమైన నిభందనలు కఠినతరమైపోయాయి. కాబట్టి అమెరికా స్టైల్లో డ్రైవ్ చేస్తాం అంటే అంతే సంగతులు...

 
English summary
Why Does India Drive On The Left Side Of The Road? The Real Reason Revealed
Please Wait while comments are loading...

Latest Photos