మ్యాన్యువల్ కార్ల కన్నా అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఎన్నో ఆటోమేటిక్ కార్లు మ్యాన్యువల్ కార్ల కన్నా అధిక మైలేజ్ ఇవ్వగలవని నిరూపించబడ్డాయి.

By Anil

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్ల కంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్ల మైలేజ్ తక్కువ అనుకునే కాలం పోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఎన్నో ఆటోమేటిక్ కార్లు మ్యాన్యువల్ కార్ల కన్నా అధిక మైలేజ్ ఇవ్వగలవని నిరూపించబడ్డాయి. మ్యాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్ల గురించి నేటి కథనంలో చూద్దాం రండి....

అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

రెనో క్విడ్

రెనో గత ఏడాది తమ క్విడ్‌ను 1.0 లీటర్ వెర్షన్‌లో విడుదల చేసి, మరికొంత కాలానికి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల చేసింది. క్విడ్ 1.0-లీటర్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది.

Recommended Video

Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

క్విడ్‌లో ఉన్న 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

  • క్విడ్ 1.0-లీటర్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్: 23.01 కిమీ/లీ
  • క్విడ్ 1.0-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్: 24.04 కిమీ/లీ
  • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

    హోండా జాజ్

    సెగ్మెంట్లో మ్యాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్ ఇవ్వగల ఏకైక ఆటోమేటిక్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారు హోండా. హోండా జాజ్ పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇంజన్ వేరియంట్లో లభిస్తోంది.

    అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

    1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    • జాజ్ పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్: 18.7 కిమీ/లీ
    • జాజ్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 19 కిమీ/లీ
    • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

      వోక్స్‌వ్యాగన్ అమియో

      కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వోక్స్‌వ్యాగన్ అమియో మాత్రమే మ్యాన్యువల్‌తో పోల్చుకుంటే అధిక మైలేజ్ ఇవ్వగల ఆటోమేటిక్ వేరియంట్‌ కలిగి ఉంది. వోక్స్‌వ్యాగన్ అమియో కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది.

      అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

      ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

      • వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ మ్యాన్యువల్ మైలేజ్: 21.66 కిమీ/లీ
      • వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ ఆటోమేటిక్ మైలేజ్: 21.77 కిమీ/లీ
      • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

        స్కోడా ర్యాపిడ్

        స్కోడా ర్యాపిడ్ కూడా అమియో తరహా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. స్కోడా ర్యాపిడ్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ కంటే స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ ఎక్కువగా ఉంది. స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తోంది.

        అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

        స్కోడా ర్యాపిడ్ సెడాన్ లోని 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

        • స్కోడా ర్యాపిడ్ డీజల్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్: 21.13 కిమీ/లీ
        • స్కోడా ర్యాపిడ్ డీజల్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్: 21.72 కిమీ/లీ
        • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

          వోక్స్‌వ్యాగన్ వెంటో

          మ్యాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్ల జాబితాలో వోక్స్‌వ్యాగన్ నుండి అమియో తరువాత వెంటో చోటు దక్కించుకుంది. అయితే ఇందులో వోక్స్‌వ్యాగన్ వారి డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండటం విశేషం.

          అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

          వోక్స్‌వ్యాగన్ వెంటోలో ఉన్న 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

          • వోక్స్‌వ్యాగన్ వెంటో డీజల్ మ్యాన్యువల్ మైలేజ్: 20.64 కిమీ/లీ
          • వోక్స్‌వ్యాగన్ వెంటో డీజల్ ఆటోమేటిక్ మైలేజ్: 21.5 కిమీ/లీ
          • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

            నిస్సాన్ సన్నీ

            నిస్సాన్ లైనప్‌లో పాపులర్ మిడ్ సైజ్ సెడాన్ సన్నీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని పెట్రోల్ వేరియంట్‌ను మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోగలరు.

            అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

            నిస్సాన్ సన్నీ కారులో 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 98బిహెచ్‌పి పవర్ మరియు 134ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నిస్సాన్ దీనికి సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం చేసింది.

            • నిస్సాన్ సన్నీ పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్: 16.95 కిమీ/లీ
            • నిస్సాన్ సన్నీ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 17.97 కిమీ/లీ
            • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

              హోండా సిటి

              2003 కాలంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి సెడాన్ హోండా సిటి. హోండా సిటిలోని మ్యాన్యువల్‌తో పోల్చితే అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల ఆటోమేటిక్ వేరియంట్‌గా నిలిచింది. హోండా సిటి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

              అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

              హోండా సిటిలోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

              • హోండా సిటి పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్: 17.4 కిమీ/లీ
              • హోండా సిటి పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 18 కిమీ/లీ
              • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

                హోండా బిఆర్‌-వి

                మూడు వరుసల సీటింగ్ సామర్థ్యంతో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీని అందుబాటులోకి తెచ్చింది. ఎమ్‌పీవీ మరియు ఎస్‌యూవీ లక్షణాలతో వచ్చిన బిఆర్‌-వి సేల్స్ పరంగా హోండాను నిరాశపరిచిందనే చెప్పాలి.

                అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

                హోండా బిఆర్-వి లోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 118బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఆర్-వి పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ కంటే ఆటోమేటిక్ వేరియంట్ మంచి మైలేజ్ ఇస్తుంది.

                • హోండా బిఆర్-వి పెట్రోల్ మ్యాన్యువల్: 15.4 కిమీ/లీ
                • హోండా బిఆర్-వి పెట్రోల్ ఆటోమేటిక్: 16 కిమీ/లీ
                • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

                  టయోటా ఫార్చ్యూనర్

                  ఈ లిస్టులో ఫార్చ్యూనర్ ఏంటని ఆశ్చర్యపోయారా...? నిజమే, భారీ పరిమాణంలో ఉన్న ప్రీమియమ్ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ భారీ ఎస్‍‌యూవీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు పెట్రోల్ ఇంజన్‌ను కూడా కలిగి ఉంది.

                  అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

                  టయోటా ఫార్చ్యూనర్ లోని 2.7-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 164 బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

                  • ఫార్చ్యూనర్ పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్: 10.01 కిమీ/లీ
                  • ఫార్చ్యూనర్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 10.26 కిమీ/లీ
                  • అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

                    స్కోడా సూపర్బ్

                    మ్యాన్యువలర్ వేరియంట్‌తో పోల్చుకుంటే అధిక మైలేజ్ ఇవ్వగల మరో ఆటోమేటిక్ వేరియంట్ కారు స్కోడా సూపర్బ్ ఈ టాప్ 10 జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. స్కోడా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభించును.

                    అధిక మైలేజ్ ఇవ్వగల పది ఆటోమేటిక్ కార్లు

                    స్కోడా సూపర్బ్ లోని 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్ సూపర్బ్ 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

                    • స్కోడా సూపర్బ్ పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్: 14.12 కిమీ/లీ
                    • స్కోడా సూపర్బ్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్: 14.67 కిమీ/లీ
                    • ఈ కథనంలోని అన్ని మైలేజ్ వివరాలు, ఆయా కార్ల సంస్థలు ఏఆర్ఏఐ కి పొందుపరిచిన వివరాల ఆధారంగా ఆధారంగా ఇవ్వబడ్డాయి.

Most Read Articles

English summary
Read In Telugu: 10 Affordable Automatic Cars With More Mileage Than Manual Variants
Story first published: Friday, August 18, 2017, 17:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X