2018 మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్ లాంచ్: ధర రూ. 2.7 కోట్లు

By Anil

2018 మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్ విపణిలోకి లాంచ్ అయ్యింది. సరికొత్త 2018 మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్ ప్రారంభ ధర రూ. 2.7 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

నాలుగు డోర్ల స్పోర్ట్స్ సెడాన్‌ను నూతన స్టైలింగ్ అప్‌గ్రేడ్స్ మరియు ఫీచర్లతో 2018 మోడల్‌గా మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్ వచ్చింది. ఇది గ్రాన్‌లుస్సో మరియు గ్రాన్‌స్పోర్ట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

సరికొత్త 2018 క్వాట్రోపోర్తే జిటిఎస్ కారులో రివైజ్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్, నూతన అడాప్టివ్ ఎల్ఇడి హెడ్ లైట్లు, హీ బీమ్ లైట్లున్నాయి. క్వాట్రోపోర్తే జిటిఎస్ గ్రాన్‌లుస్సో వేరియంట్లో ఫ్రంట్ స్పాయిలర్, క్రోమ్ బంపర్ తొడుగులు, బాడీ కలర్‌లో ఉన్న సైడ్ స్కర్ట్స్, గ్రాన్‌లుస్సో బ్యాడ్జ్ మరియు బ్లాక్ కలర్ కాలిపర్స్ గల 20-అంగుళాల మెర్క్యురి అల్లాయ్ వీల్స్ వంటి ప్రత్యకతలు ఉన్నాయి.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

అదే విధంగా క్వాట్రోపోర్తే జిటిఎస్ గ్రాన్‌స్పోర్ట్ వేరియంట్లో ఏరోడైనమిక్ స్ల్పిటర్లు, కండలు తిరిగిన ఎడ్జెస్, సెంటర్ స్పాయిలర్ మరియు పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ వంటివి అదనంగా ఉన్నాయి. అంతే కాకుండా ఆప్షనల్ ఎక్ట్సీరియర్ కార్బన్ ప్యాకేజ్, కార్బన్ ఫినిషింగ్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్, బి-పిల్లర్ కవర్ మరియు ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

2018 మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్ ఇంటీరియర్‌లో లెథర్ అప్‌హోల్‌స్ట్రే ఉంది. క్యాబిన్‌లో 8.4-అంగుళాల పరిమాణం ఉన్న మాసేరటి టచ్ కంట్రోల్ ప్లస్(MTC+) సిస్టమ్ సెంటర్ కన్సోల్ మీద ఉంది.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మల్టీ టచ్ స్రీన్ ద్వారా ఆపరే‌ట్ చేయవచ్చు. రోటరీ కంట్రోల్ గల సెంటర్ కన్సోల్ మరియు వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఫోన్ మిర్రర్ ఆప్షన్ వంటివి సపోర్ట్ చేస్తుంది.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ రెండు ఆప్షనల్ ఆడియో సిస్టమ్‌లతో లభిస్తోంది. 900-వాట్ సామర్థ్యం గల 10-స్పీకర్ హార్మన్ కార్డన్ ప్రీమియమ్ సౌండ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా లభిస్తోంది. దీని స్థానంలో ఆప్షనల్‌గా న్యూ జనరేషన్ బౌయర్స్ అండ్ విల్కిన్స్ 1,280-వాట్ సామర్థ్యం గల 15-స్పీకర్ల సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను ఎంచుకోవచ్చు.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

భద్రత పరంగా 2018 మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్ లగ్జరీ సెడాన్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, యాక్టివ్ హెడ్ రెస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఆక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ట్రాఫిక్ సిగ్నల్స్ గుర్తించే టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

క్వాట్రోపోర్తే జిటిఎస్ కేవలం 4.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 310కిలోమీటర్లుగా ఉంది. మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్ మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, త్వరలో డెలివరీలు కూడా ఇవ్వనుంది. విపణిలో ఉన్న ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ మరియు పోర్షే ప్యానమెరా వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

మాసేరటి క్వాట్రోపోర్తే జిటిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 మాసేరటి క్వాట్రోపోర్తే అధునాతన లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్. ఇక జిటిఎస్ వెర్షన్‌లో రావడంతో చూడటానికి మరింత ఆకర్షణీయంగా స్పోర్టివ్ స్టైల్లో ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maserati Quattroporte GTS Launched In India; Prices Starts At Rs 2.7 Crore
Story first published: Wednesday, December 13, 2017, 22:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X