ఆంధ్ర రాజధానిలో మానవ రహిత విద్యుత్ బస్సు సేవలు!

Written By:

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో మానవ రహిత విద్యుత్ బస్సులు మాత్రమే నడుస్తాయని, ఇక మీదట ఎలక్ట్రిక్ పవర్ ద్వారా నడిచే బస్సులు మరియు వాహనాలను మాత్రమే నగరంలోనికి అనుమతిస్తామని పేర్కొన్నాడు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
అమరావతిలో విద్యుత్ బస్సులు

ప్రభుత్వ కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టిన దిగ్గజ నిర్మాణ సంస్థ ఫాస్టర్స్ మరియు భాగస్వాములు అదే విధంగా కాంట్రాక్టర్ హఫీజ్ నేతృత్వంలో అమరావతిలో ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారు.

అమరావతిలో విద్యుత్ బస్సులు

గత భేటీలో ఇచ్చిన సలహాలు మరియు సూచనలను పరిగణలోకి తీసుకుని, ఈ బృందం నూతన ప్రణాళికతో ముందుకొచ్చింది.కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో వెహికల్ ఫ్రీ జోన్లను ఏర్పాటు చేయాలని భావించారు.

అమరావతిలో విద్యుత్ బస్సులు

అయితే ఈ నిర్ణయానికి ప్రత్యామ్నాయంగా తప్పనిసరి ఎలక్ట్రికల్ వాహనాలు, తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకునే హైబ్రిడ్ వాహనాలు ప్రోత్సహిస్తూనే పాదచారులు మరియు సైకిల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ట్రాక్‌లను నిర్మించాలని నిర్ణయించారు.

అమరావతిలో విద్యుత్ బస్సులు

ఫాస్టర్స్ మరియు భాగస్వాములు ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో అంతర్గత ఆకుపచ్చ మరియు నీలి రంగుతో కూడిన సుందరమైన నగరంగా తీర్చిదిద్దే ఆలోచనను ముందుంచారు. ఈ బృందం తెలిపిన వివరాలు మేరకు, 51 శాతం పచ్చదనం, 10 శాతం నీరు, 14 శాతం రోడ్లు మరియు 25 శాతం భవంతులు ఉండనున్నాయి.

అమరావతిలో విద్యుత్ బస్సులు

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానిలో ప్రారంభించబడే సాంస్కృతిక భవంతులన్నీ పచ్చదనంతో నిండి ఉండాలని సూచించారు. మొదట్లో పర్యావరణానికి ఇచ్చిన ప్రాధాన్యతను అలాగే కొనసాగించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఆ తరువాత భవిష్యత్తులో మానవ రహిత ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపాడు.

 
Read more on: #బస్సు #bus
English summary
Also Read In Telugu: An Amaravati of the future: Unmanned electric buses to ply in Andhra capital
Story first published: Friday, March 24, 2017, 11:05 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark