ఇండియా కోసం షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లో నూతన ఉత్పత్తుల విడుదల బీట్ అమ్మకాలను తినేస్తున్న కారణంగా షెవర్లే విపణిలోకి బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

By Anil

దేశీయ చిన్న కార్ల సెగ్మెంట్లో పట్టును చేజిక్కించుకోవడానికి షెవర్లే మోటార్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో మళ్లీ విడుదల చేయనుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బీట్ ను రహస్యంగా పరీక్షలకు తీసుకొచ్చింది. తాజా ఫోటోల ద్వారా ఇది ప్రొడక్షన్ రెడీ మోడల్ అని స్పష్టమవుతోంది.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

జనరల్ మోటార్స్ గత ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద బీట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రదర్శించింది. అయితే ఇప్పుడు ప్రొడక్షన్ దశకు చేరుకున్న వేరియంట్‌ను రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

ఈ నూతన బీట్‌ను మునుపటి బీట్ ఫ్లాట్‌ఫామ్ ఆధారం చేసుకుని ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌ను అభివృద్ది చేసింది. అయితే నూతన బీట్ యొక్క సాంకేతిక వివరాలు గురించి షెవర్లే నుండి ఎలాంటి సమాచారం లేదు.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

ఎక్ట్సీరియర్ పరంగా సంభించిన మార్పులను స్పష్టంగా గుర్తించవచ్చు, అవి, రెండు వరుసలో ఉన్న డోర్ హ్యాండిల్స్‌ను ప్రక్క వైపున (నల్లగా ఉన్న ప్రదేశంలో) అందివ్వడం జరిగింది, ముందు వైపు డ్యూయల్ పోర్డ్ ఫ్రంట్ గ్రిల్, నల్లటి తొడుగులున్న రీ డిజైన్డ్ హెడ్ ల్యాంప్స్ కలవు.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త బీట్ హ్యాచ్‌బ్యాక్ రియర్ ప్రొఫైల్‌లో కూడా కొన్ని మార్పులు గుర్తించవచ్చు, ప్రధానంగా, రీ లొకేట్ చేయబడిన రిజిస్ట్రేషన్ ప్లేట్, స్వల్పంగా మార్పులు జరిగిన బంపర్ మరియు టెయిల్ ల్యాంప్ సెక్షన్ కలదు.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్‌లో మైలింక్ సపోర్ట్ గల 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ కలర్ థీమ్‌లో రానున్న డ్యాష్ బోర్డ్, మోటార్ సైకిల్ ప్రేరిత ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ రానున్నాయి.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా ప్రస్తుతం జనరల్ మోటార్స్ వద్ద ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లతో రానుంది. నూతన ఉద్గార నియమాలను పాటించేందుకు ఈ ఇంజన్‌లకు స్వల్ప అప్‌‌గ్రేడ్స్ నిర్వహించనున్నారు.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

జనరల్ మోటార్స్ ఇండియా విభాగం షెవర్లే ఈ ఫేస్‌లిఫ్ట్ బీట్ హ్యాచ్‌బ్యాక్ ను జూన్ లేదా జూలై 2017 మధ్యలో విడుదల చేయనున్నట్లు సమాచారం.a Overdrive

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్

మార్చి 5 న టాటా నుండి మరో విడుదల

ఇండియాలో ఆ టైర్లను కలిగి ఉన్న ఏకైక కారు

విదేశీ కార్ల తయారీ సంస్థలకు చుక్కలు చూపించనున్న టాటా మోటార్స్

Most Read Articles

English summary
Chevrolet Beat Facelift Spied Testing In India; Launch Imminent?
Story first published: Tuesday, January 31, 2017, 13:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X