కార్ల కస్టమర్లు మేల్కోండి: రిజిస్ట్రేషన్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారా...?

మారుతి సుజుకి షోరూమ్ నిర్వాహకులు కస్టమర్ కారు రిజిస్ట్రేషన్ అనంతరం హ్యాండ్లింగ్ మరియు రిపేరీ ఛార్జీలంటూ బిల్లులో అదనపు మొత్తాన్ని కలిపారు.

By Anil

మారుతి సుజుకి షోరూమ్ నిర్వాహకులు కస్టమర్ కారు రిజిస్ట్రేషన్ అనంతరం హ్యాండ్లింగ్ మరియు రిపేరీ ఛార్జీలంటూ బిల్లులో అదనపు మొత్తాన్ని కలిపారు. చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీతో మొత్తంతో పాటు అదనంగా మరింత సొమ్మును చెల్లించడానికి ఆ కస్టమర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించడం జరిగింది.

మరి అదనపు ఛార్జీలు మరియు రిపేరీ ఖర్చులు వసూలు చేయడం చట్టపరంగా సరైనదేనా....? కాదా...? ఈ కేసులో కోర్టు ఏమని తీర్పునిచ్చిందో చూద్దాం రండి...

మారుతి డీలరుకు జరిమానా

2015 వ సంవత్సరంలో చెన్నైలోని మారుతి సుజుకి డీలర్ మరియు కస్టమర్ మధ్య అదనపు ఛార్జీలు మరియు రిపేరీ ఖర్చుల విషయంలో చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా వినియోగదారుల ఫిర్యాదు ద్వారా వినియోగదారుల కోర్టును చేరింది. దానికి చెందిన తీర్పే ఇవాళ్టి కథనం...

Recommended Video

[Telugu] Toyota Etios Safety Experiential Drive in Bengaluru - DriveSpark
మారుతి డీలరుకు జరిమానా

వివరాల్లోకి వెళితే... చెన్నైలోని మారుతి సుజుకి షోరూమ్‌లో సి దుర్గాదేవి అనే మహిళ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూర్ కారును కొనుగోలు చేసింది. దీని మొత్తం ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,20,244 లలో రూ. 2,77,500 చెల్లించి మిగతా మొత్తాన్ని కారు లోన్ ద్వారా చెల్లించింది.

మారుతి డీలరుకు జరిమానా

కారు డెలివరీ అనంతరం దుర్గాదేవి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందుకున్నారు. అందులో రూ. 61,796 లుగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జ్ రూ. 80,428 లుగా ఉంది. ఇందులో ఇరవైవేల రుపాయలు అదనంగా చేర్చారు.

మారుతి డీలరుకు జరిమానా

ఇదే విశయమై కస్టమర్ డీలర్‌ను సంప్రదించగా సర్వీసింగ్ మరియు రిపేరీ ఖర్చుల క్రింది చేర్చామని వివరణ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో అసంతృప్తి చెందిన కస్టమర్ దుర్గాదేవి దక్షిణ చెన్నైలో ఉన్న వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది.

మారుతి డీలరుకు జరిమానా

ఈ కేసులో ఇరువురి వాదనలు ఆలకించిన కోర్టు కొత్త కారును కొంటున్నపుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలలో భాగంగా సర్వీసింగ్, రిపేరీ మరియు అదనపు ఖర్చుల పేరుతో అదనంగా డబ్బును వసూలు చేయడం అనధికారికం. ఇందుకుగాను మారుతి సుజుకి డీలర్ దుర్గాదేవికి లక్ష రుపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

మారుతి డీలరుకు జరిమానా

కాబట్టి ఇక మీదట మీరు కొత్త కారు కొంటున్నపుడు అన్ని బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించండి. బిల్లులో వేసిన మొత్తాన్ని కస్టమర్లు గుడ్డిగా చెల్లిస్తారనే నమ్మకంతో డీలర్లు అదనపు చార్జీలు వేస్తున్నారు. ప్రతి ఖర్చును పరిశీలించి అడిగి మరీ తెలుసుకోండి.

Most Read Articles

English summary
Read In Telugu: Consumer Court says handling charges are illegal – Orders Maruti dealer to pay Rs 1 lakh fine
Story first published: Friday, November 24, 2017, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X