మొత్తం డబ్బు చెల్లించి నాలుగు నెలలైనా కారు డెలివరీకి ససేమిరా అంటున్న డీలర్

పూనేలోని సాయి సాక్షి ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్ విరాజ్ ఇసుజు డీలర్‌కు వి-క్రాస్ వెహికల్ ధరను ఏకమొత్తం మీద చెల్లించాడు. అయితే, డెలివరీ ఇవ్వకుండా మోసం చేశాడు.

By Anil

2017 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది, మరియు కొన్ని కార్ల కంపెనీలు సంవత్సరాంతపు ఆఫర్లలో భాగంగా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నచ్చిన కారును ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లండి, 2019లో చెల్లించండి అనే స్కీముని పరిచయం చేశాయి.

ఇసుజు వి-క్రాస్

అయితే, ఈ కథనంలో మీరు చదవబోతున్న సంఘటన దీనికి పూర్తి వ్యతిరేకం. ఓ కస్టమర్ ఇసుజు వి-క్రాస్ వెహికల్ కోసం ఆగష్టు 2017లో మొత్తం డబ్బును చెల్లించగా ఇప్పటికీ ఆ వెహికల్ డెలివరీ కోసం ఎదురుచూస్తున్నాడు. బహుశా ఇది ఇసుజు వారి కొత్త ఆఫరేమో... 'ఇప్పుడు చెల్లించండి వచ్చే ఏడాదిలో డెలివరీ తీసుకోండి'!

Recommended Video

High Mileage Cars In India - DriveSpark
ఇసుజు వి-క్రాస్

జోక్స్ ప్రక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే, ఒక వ్యక్తి ఈ సంఘటన వివరాలను ఓ ఆటోమొబైల్ ఫోరంలో పోస్ట్ చేశాడు. ఆ వివరాల మేరకు, శ్రీవర్ధన్ తపస్వి అనే ఇసుజు కస్టమర్ డి-మ్యాక్స్ వి-క్రాస్ వెహికల్ కోసం 15.30 లక్షల రుపాయలు డీలర్‌కు పేమెంట్ చేశాడు.

ఇసుజు వి-క్రాస్

ఆగష్టు 4, 2017న పూనేలోని సాయి సాక్షి ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్ విరాజ్ ఇసుజు డీలర్‌కు వి-క్రాస్ వెహికల్ ధరను ఏకమొత్తం మీద చెల్లించాడు. అయితే, డెలివరీ ఇవ్వకుండా మోసం చేశాడు.

ఇసుజు వి-క్రాస్

ఇసుజు వి-క్రాస్ వెహికల్ పేమెంట్ కోసం తపస్వి యాక్సిస్ బ్యాంకులో లోన్ తీసుకుని, వాహనాన్ని తన సోదరుడి పేరు మీత బుక్ చేయించాడు. కొనుగోలు చేసే సమయంలో కేవలం రెండు రోజుల్లోనే డెలివరీ ఇస్తామని షోరూమ్ నిర్వాహకులు మాట ఇచ్చారు.

ఇసుజు వి-క్రాస్

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు శ్రీవర్దన్ తపస్వి వద్ద ఇసుజు వి-క్రాస్ వెహికల్ ఉండాల్సింది. అయితే అలా జరగలేదు. పేమెంట్ జరిగినంత సులభంగా ఇసుజు షోరూమ్ నిర్వాహకులు తపస్వికి వి-క్రాస్ వెహికల్ డెలివరీ ఇవ్వలేకపోయింది.

Trending On DriveSpark Telugu:

అంబానీ డ్రైవర్ నెలసరి జీతం ఎంతో తెలుసా...?

చైనాకు ధీటుగా హిమాలయాల్లో భారత్ రైల్వే లైన్

అవమానించిన ఫోర్డ్ మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్న రతన్ టాటా

ఇసుజు వి-క్రాస్

రెండు రోజుల్లో డెలివరీ జరగాల్సిన వెహికల్ రాకపోవడంతో, తపస్వి షోరూమ్ హెడ్‌తో మెయిల్ మరియు ఫోన్ ద్వారా సంప్రదించడంతో. ప్రస్తుతం కుదరలేదు, ఆగష్టు 25, 2017న ఖచ్చితంగా డెలివరీ ఇస్తామని, డెలివరీ ఆలస్యమవడంతో మొదటి వాయిదా కూడా మేమే చెల్లిస్తామని డీలర్ కస్టమర్‌కు తెలిపాడు.

ఇసుజు వి-క్రాస్

మళ్లీ కూడా కస్టమర్‌కు వెహికల్ డెలివరీ ఇవ్వలేకపోయారు. అలా కొన్ని రోజుల పాటు ఏవేవో కారణాలు చెబుతూ కస్టమర్‌కు డెలివరీ ఇవ్వకుండా వచ్చారు. అయితే, సెప్టెంబర్ 16, 2017న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో, విరాజ్ ఇసుజు షోరూమ్‌ను మూసేయడం జరిగింది, ఇక మీదట విరాజ్ ఇసుజుకి మరియు కంపెనీకి మధ్య ఎలాంటి సంభందం లేదని ఓ నోటీస్ ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుండి విరాజ్ ఇసుజు షోరూమ్‌కు విక్రయాలు జరిపే అధికారం లేదని పేర్కొంది.

ఇసుజు వి-క్రాస్

ఇప్పుడు బాధిత కస్టమర్ ప్రజా ప్రయోజనాల కోర్టులో కేసు వేశాడు. డిసెంబర్ 20, 2017న కేసు తొలి వాయిదాకు వచ్చినపుడు విరాజ్ ఇసుజు తరపున ఎవ్వరూ కోర్టుకు హాజరవ్వలేదు.

ఇసుజు వి-క్రాస్

కోర్టులో నమోదైన కేసుకు ఇసుజు ఇండియా స్పందిస్తూ, ఈ ఒప్పందం కస్టమర్ మరియు డీలరుకు మధ్య మాత్రమే జరిగింది కాబట్టి, దీనికి ఇసుజు ఇండియాకు ఎలాంటి సంభందం లేదని వివరణ ఇచ్చింది.

ఇసుజు వి-క్రాస్

ఇసుజు ఇచ్చిన సమాధానానికి కస్టమర్లను షాక్‌కు గురి చేసింది. నిజమే, లక్షలు పోసి తమ ఫేవరెట్ మోడళ్లను ఎంచుకుంటున్నపుడు డెలివరీ ఇవ్వని బుకింగ్స్ విషయంలో తన బాధ్యత లేదని చెప్పడం ఎంత వరకు న్యాయం.

ఇసుజు వి-క్రాస్

అయితే, డీలర్‌కు పెండింగ్‌లో ఉన్న పది బుకింగ్స్ గురించి వివరణ ఇవ్వాలని విరాజ్ ఇసుజు షోరూమ్‌ను కోరుతూ ఇసుజు ఇండియా లెటర్ పంపింది. పెండింగ్‌లో ఉన్న అన్ని బుకింగ్స్‌ను ఆగష్టు 24 లోపు క్లియర్ చేయాలని, లేనిచో కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా డీలర్‌ మీద చర్యలు తీసుకుంటామని ఇసుజు ఆ లేఖలో డీలర్‌కు సూచించింది.

ఇసుజు వి-క్రాస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మోసపోయిన కస్టమరుకు న్యాయం చేయకుండా ఇసుజు చేతులు దులుపుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. వెహికల్ మొత్తం ధరను చెల్లించినా, డెలివరీ ఇవ్వకుండా కస్టమర్‌ను షోరూమ్ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేశారు. ఇక్కడ ప్రధానం గుర్తించాల్సిన పాయింట్, కస్టమర్ మొత్తం డబ్బును చెల్లించినపుడు ఇసుజు ఇండియాకు విరాజ్ ఇసుజు అధీకృత విక్రయ కేంద్రంగా ఉంది.

ఇసుజు వి-క్రాస్

అన్ని పెండింగ్ బుకింగ్స్‌ను క్లియర్ చేయాలని ఇసుజు ఇండియా డీలర్‌కు సూచించింది. అయితే, డీలర్ డెలివరీ ఇవ్వకపోవడానికి ఇసుజు ఎలాంటి భాద్యతవహించదని కస్టమర్‌కు తెలిపింది. ఇప్పుడు ఆ కస్టమర్ మొత్తం డబ్బును చెల్లించి, వెహికల్ డెలివరీ తీసుకోకపోయినా... ప్రతి నెలా వెహికల్ మీద తీసుకున్న లోన్‌కు ఇఎమ్ఐ చెల్లిస్తున్నాడు.

Via Team BHP

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: This Customer Paid For Isuzu V-Cross In August 2017; Yet To Receive The Car!
Story first published: Wednesday, December 27, 2017, 20:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X