జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా: ఎస్‌యూవీ రేసులో గెలుపెవరిది ?

హ్యుందాయ్ క్రెటా వర్సెస్ జీప్ కంపాస్. హ్యుందాయ్ క్రెటా మరియు జీప్ కంపాస్ ఎస్‌యూవీలను పోల్చి, రెండింటిలో ఏది బెస్ట్ అని తెలిపే కంపారిజన్.

By Anil

అమెరికాకు చెందిన ఇకానిక్ బ్రాండ్ జీప్, భారతదేశంలోని ఎస్‌యూవీ సెగ్మెంట్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయడానికి సిద్దమైంది. స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(SUV) సెగ్మెంట్‌కు సరికొత్త నిర్వచనాన్నిస్తూ విపణిలోకి విడుదుల చేసిన సరికొత్త జీప్ కంపాస్ ఎస్‌యూవీ ప్రతి ఇండియన్ ఎస్‌యూవీ బయ్యర్‌లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఏదేమయినప్పటికీ, ఇప్పుడు దేశీయంగా ఉన్న జీప్ కంపాస్ హ్యుందాయ్ క్రెటాకు ప్రత్యక్ష పోటీగా నిలిచింది. ఇప్పటి వరకు పోటీ అనేది ఎరుగకుండా హ్యుందాయ్ క్రెటా విక్రయాలు సాగిస్తోంది. 15 నుండి 20 లక్షల ధరల శ్రేణిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

మరి ఇదే రేంజ్‌లో విడుదలైన కంపాస్ ఎస్‌యూవీ క్రెటాను మార్కెట్ నుండి బహిష్కరిస్తుందా...? మరి కంపాస్ మరియు క్రెటా లలో ఏది బెస్ట్ ? దేనిని ఎంచుకోవచ్చు వంటి వివరాలు తెలుసుకోవాలంటే నేటి కంపారిజన్ కథనంలోకి వెళ్లాల్సిందే.

జీప్ కంపాస్ డిజైన్:

జీప్ తమ అతి పెద్ద లగ్జరీ మరియు అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ గ్రాండ్ చిరోకీ నుండి సేకరించిన అనేక డిజైన్ సొబగుల ఆధారంగా చిన్న రూపంలో కంపాస్ ఎస్‍‌యూవీని ఆవిష్కరించింది. జీప్ డిఎన్‌ఏ మేళవిపుతో బెస్ట్ మరియు డీసెంట్ ఎస్‌యూవీగా కంపాస్ విపణిలో మంచి పేరు తెచ్చుకుంది.

జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

కంపాస్ ఫ్రంట్ డిజైన్‌లో 7-స్లాట్ గ్లాస్ బ్లాక్ మరియు క్రోమ్ పట్టీ గల ఫ్రంట్ గ్రిల్ కలదు మరియు ఐరన్ మ్యాన్ ప్రేరిత ఆకర్షణీయమైన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్నాయి. కంపాస్ డిజైన్ సిటి మరియు ఆఫ్ రోడింగ్ రెండింటి అవసరాలకు అనుగుణంగా చక్కగా డిజైన్ చేయబడింది.

జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఫ్లూయిడిక్ స్కల్పచర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా క్రెటా ఎస్‌యూవీ డిజైన్ చేయబడింది. జీప్ కంపాస్‌తో పోల్చుకుంటే క్రెటా ఫ్రంట్‌ డిజైన్‌లో పదునైన స్టైలింగ్ లక్షణాలున్నాయి. టర్న్ ఇండికేటర్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్స్‌కు మధ్యలో క్రోమ్ పట్టీలున్న ఫ్రంట్ గ్రిల్ కలదు.

జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

అయితే, హ్యుందాయ్ క్రెటా ను ప్రక్కను పరిశీలిస్తే, ప్రత్యేకించి సిటి కోసం రూపొందించినట్లు స్పష్టమవుతుంది. పెద్ద పరిమాణంలో కాకుండా చిన్నగా, షార్ప్ లుక్స్‌తో ఉన్న క్రెటా సిటి కస్టమర్లను ఆకట్టుకున్నప్పటికీ ఆఫ్ రోడింగ్‌ను ఇష్టపడే కస్టమర్లను తీవ్రంగా నిరాశపరుస్తోంది.

జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

జీప్ కంపాస్ మరియు మరియు హ్యుందాయ్ క్రెటా కొలతలు

కొలతలు(మిల్లీ మీటర్లలో) జీప్ కంపాస్ హ్యుందాయ్ క్రెటా
పొడవు 4,420 4,270
వెడల్పు 1,820 1,780
ఎత్తు 1,650 1,630
వీల్ బేస్ 2,640 2,590

డిజైన్ పరంగా ఓవరాల్ రేటింగ్

  • జీప్ కంపాస్ 8/10
  • హ్యుందాయ్ క్రెటా 7.5/10
  • జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

    ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియు గేర్‌బాక్స్

    జీప్ కంపాస్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్ కంపాస్‌లో 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ టుర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

    జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

    జీప్ కంపాస్ డీజల్ వేరియంట్ 2.0-లీటర్ సామర్థ్యం టుర్భో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే కంపాస్ డీజల్ వేరియంట్ ఫ్రంట్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లో లభిస్తోంది.

    జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

    హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. హ్యుందాయ్ క్రెటాలో 122బిహెచ్‌పి పవర్ మరియు 154ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

    జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

    క్రెటా డీజల్ వెర్షన్‍‌లో 89బిహెచ్‌పి పవర్ మరియు 224ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ డీజల్ మరియు 126బిహెచ్‌పి పవర్ మరియు 265ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లలో లభిస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 1.4-లీటర్ ఇంజన్ యూనిట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుండగా, 1.6-పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి.

    జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

    ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ పరంగా కంపాస్ మరియు క్రెటా లను పోల్చితే, కంపాస్ డీజల్ మోడల్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మిస్సయ్యింది. క్రెటా లోని 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ మోడళ్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు, అయితే క్రెటా 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రాలేదు.

    ఏదేమైనప్పటికీ జీప్ కంపాస్ డీజల్ వెర్షన్ అత్యంత శక్తివంతమైనది. మరియు ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి ఉంది. అయితే క్రెటాలో ఆఫ్ రోడింగ్ ఫీచర్ కంప్లీట్‌గా మిస్సయ్యింది. జీప్ కంపాస్‌ను మరింత ప్రత్యేకం చేస్తూ, జీప్ కంపాస్ ఆక్టివ్ డ్రైవ్ 4X4 సిస్టమ్ కలదు. దీని ద్వారా కంపాస్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా మార్చేసుకోవచ్చు.

    ఓవరాల్ ఇంజన్ రేటింగ్

    • జీప్ కంపాస్ 8/10
    • హ్యుందాయ్ క్రెటా 7.5/10
    • జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

      జీప్ కంపాస్ ఫీచర్లు

      • 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
      • ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్,
      • డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏ/సి
      • ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే,
      • నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు
      • జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

        హ్యుందాయ్ క్రెటా లోని ఫీచర్లు

        • 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
        • ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే,
        • ఆటోమేటిక్ ఏ/సి
        • ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్,
        • ముందు చక్రాలకు మాత్రమే డిస్క్ బ్రేకులు
        • జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

          ఫీచర్ల పరంగా రేటింగ్

          ఫీచర్ల విషయంలో కంపాస్‌లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అదనంగా ఉండగా, క్రెటాలో రాలేకపోయింది. క్రెటాలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, సెలెక్ టెర్రైన్ డ్రైవ్ మోడ్ వంటి ఫీచర్లు రాలేకపోయాయి.

          • జీప్ కంపాస్ 8/10
          • హ్యుందాయ్ క్రెటా 7/10
          • జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

            భద్రత ఫీచర్లు

            జీప్ కంపాస్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, ప్యానిక్ బ్రేక్ అసిస్ట్, హైడ్రాలిక్ బూస్టర్ ఫెయిల్యూర్ కంపెన్సేషన్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫెయిల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

            జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

            హ్యుందాయ్ క్రెటాలో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్, వెహికల్ స్టెబిలిటి మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

            సేఫ్టీ పరంగా ఓవరాల్ రేటింగ్

            • జీప్ కంపాస్ 8/10
            • హ్యుందాయ్ క్రెటా 7.5/10
            • జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

              ధరలు

              జీప్ కంపాస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 14.95 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20.65 లక్షలు అదే విధంగా హ్యుందాయ్ క్రెటా ప్రారంభ వేరియంట్ ధర రూ 8.92 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14 లక్షలుగా ఉన్నాయి.

              జీప్ కంపాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

              జీప్ కంపాస్ డీజల్ వేరియంట్ల ధరలు

              • స్పోర్ట్ రూ. 15,45,000 లు
              • లాంగిట్యూడ్ రూ. 16,45,000 లు
              • లాంగిట్యూడ్ ఆప్షన్ రూ. 17,25,000 లు
              • లిమిటెడ్ 18,05,000 లు
              • లిమిటెడ్ ఆప్షన్ రూ. 18,75,000 లు
              • లిమిటెడ్ 4x4 రూ. 19,95,000 లు
              • లిమిటెడ్ ఆప్షన్ 4x4 రూ. 20,65,000 లు
              • జీప్ కంపాస్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

Most Read Articles

English summary
Read In Telugu: Jeep Compass Vs Hyundai Creta Comparision — Tussle Of The Decade
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X