దేశీయంగా విడుదల కానున్న 2017 కియా పికంటో ఆవిష్కృతం

Written By:

కియా మోటార్స్ ఈ ఏడాదిలోనే దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కియా ప్రొడక్షన్ ప్లాంటును ఏర్పాటు చేసే విశయంలో కియా ప్రతినిధులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ద హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన పికంటోను దేశీయ విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది.

2017 కియా పికంటో

అయితే ఈ నేపథ్యంలో కియా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్ కోసం మూడవ తరానికి చెందిన 2017 పికంటోను ఆవిష్కరించింది. 2017 లో జరగనున్న జెనీవా మోటార్ షో వేదిక మీద దీనిని ప్రదర్శించనుంది.

2017 కియా పికంటో

ప్రపంచ ప్రదర్శనకు ముందుగానే కియా మోటార్స్ తమ 2017 పికంటో హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. దీనికి సంభందించి ఫీచర్లు, సాంకేతిక వివరాలు మరియు ఫోటోలను అధికారికంగా ఆవిష్కరించింది.

2017 కియా పికంటో

ప్రపంచ అత్యుత్తమ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన పికంటోను ఇప్పుడు మూడవ జనరేషన్ మోడల్‌గా విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఇందులో నూతన డిజైన్, అభివృద్ది పరిచిన సాంకేతికత మరియు ప్రత్యేకమైన కస్టమైజేషన్ ఆప్షన్‌లను పరిచయం జరిగింది.

2017 కియా పికంటో

2017 పికంటో డిజైన్ విషయానికి వస్తే, మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే అత్యంత స్పోర్టివ్‌గా అభివృద్ది చేశారు. ముందు వైపున టైగర్ నోస్ ప్రంట్ గ్రిల్, రీ డిజైన్ చేయబడిన బంపర్, మెరుగులద్దిన సైడ్ స్కర్ట్స్, అర్బన్ సిటి కారుగా దీనికి మళ్లీ జీవం పోశారని చెప్పవచ్చు.

2017 కియా పికంటో

2017 పికంటో థర్డ్ జనరేషన్ మోడల్‌ ముందు వైపు డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి టెయిల్ లైట్ల ఇముడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అంతే కాకుండా దీనిని ఆరు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. లైమ్ లైట్, షైనీ రెడ్, అరోరా బ్లాక్, పాప్ ఆరేంజ్, స్పార్ల్కింగ్ సిల్వర్ మరియు క్లెస్టియల్ బ్లూ పర్ల్‌సెంట్ మెటాలిక్.

2017 కియా పికంటో

ఇంటీరియర్ ఫీచర్ల విశయానికి వస్తే, 7-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మరియు పార్కింగ్ కెమెరాలను సపోర్ట్ చేస్తుంది. ఇంజన్ విడుదల చేసే శబ్దం ఇంటీరియర్‌లోనికి చేరకుండా ఇంజన్ కవర్ అదే విధంగా అబ్సార్బెంట్ ఫోమ్ లను అందివ్వడం జరిగింది.

2017 కియా పికంటో

ఇంజన్ విషయానికి వస్తే, అంతర్జాతీయ విపణిలోకి పరిచయం కానున్న ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న టి-జిడిఐ వచ్చే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 98బిహెచ్‌పి పవర్ మరియు 172ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 కియా పికంటో

కియా లైనప్‌లో ఉన్న ఇతర ఇంజన్‌ ఆప్షన్లయిన 1.0-లీటర్ మరియు 1.25-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌పిఐ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్లు కూడా సరికొత్త 2017 పికంటో లో వచ్చే అవకాశం ఉంది.

2017 కియా పికంటో

వీటిలో 1.0-లీటర్ వేరియంట్ గరిష్టంగా 66బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా 1.25-లీటర్ ఇంజన్ గరిష్టంగా 82.8బిహెచ్‌పి పవర్ మరియు 122ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

2017 కియా పికంటో

భద్రత పరంగా ఇందులో 2017 పికంటోలో వెహికల్ స్టెబిలిటి మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను జోడించడం జరిగింది.

ఇగ్నిస్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్  చేయండి...

 

English summary
India-bound 2017 Kia Picanto; Pictures, Specs And Details Revealed
Story first published: Monday, February 20, 2017, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos