సూపర్ కార్ల సంస్థలకు మింగుడుపడని న్యూస్ ఇచ్చిన లాంబోర్గిని

లాంబోర్గిని అందుబాటులోకి తీసుకురానున్న ఉరస్ ఎస్‌యూవీకి చెందిన ఇంజన్ మరియు దాని పనితీరు వివరాలు విడుదలయ్యాయి. సూపర్ కార్ల సెగ్మెంట్లో విప్లవాన్ని తీసుకురానున్న ఉరస్ గురించి మరిన్ని వివరాలు...

By Anil

తక్కువ ఎత్తుతో, పొడవుగా, సెడాన్ శైలిలో, ఏరోడైనమిక్ డిజైన్ లక్షణాలను కలిగి ఉంటాయి సూపర్ కార్లు. మరి సూపర్ కార్లంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు లాంబోర్గిని. సూపర్ కార్ల మార్కెట్లోకి తిరుగులేని సక్సెస్ అందుకున్న లాంబోర్గిని ఇప్పుడు సూపర్ కార్లకు కొనసాగింపుగా ఉరస్ అనే ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది. మరి ఈ ఉరస్ నిజంగానే సూపర్ కార్ల ట్రెండ్ మారుస్తుందో లేదో చూద్దాం రండి.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

కోపాన్ని ప్రదర్శించే ముఖపోలికలతో ఉన్న ఉరస్ ఎస్‌యూవీ సూపర్ కార్ల డిజైన్‌తో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది. ముందు వైపు తక్కువ ఎత్తుతో మరియు వెనుక వైపున గరిష్ట ఎత్తుతో రూపొందించబడి ఉంటుంది.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

లాంబోర్గిని సిఇఒ స్టెఫానో డామినికల్ ఈ ఉరస్ ఎస్‌యూవీకి చెందిన ఇంజన్ మరియు ఇది విడుదల చేసే పవర్ గురించిన వివరాలను వెల్లడించారు. ఇదే వేదికలో దీనిని 2018 నాటికి ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసి ఆ తరువాత ప్లగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాడు.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీలో ట్విన్ టుర్బో వి8 ఇంజన్ అందించినట్లు డామినికల్ తెలిపాడు. ఇది గరిష్టంగా 641బిహెచ్‌పి పవర్ వరకు ఉత్పత్తి చేయును. స్టాండర్డ్‌ ఇంజన్ వేరియంట్‌కు కొనసాగింపుగా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇంజన్ కూడా రానుంది.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

2018 లో 1,000 యూనిట్లను మరియు 2019 లో 3,500 యూనిట్ల ఉరస్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేయాలని ఇటలీకి చెందిన లగ్జరీ సూపర్ కార్లు, స్పోర్ట్స్ కార్లు మరియు ఎస్‌యూవీల తయారీ సంస్థ లాంబోర్గిని లక్ష్యంగా పెట్టుకుంది.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

హైబ్రిడ్ ఉరస్‌ను సామర్థ్యం(efficiency) కోసం మరియు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ గల ఉరస్‌ను అత్యుత్తమ పనితీరు(performance) కోసం అభివృద్ది చేస్తున్నట్లు లాంబోర్గిని మాజీ సిఇఒ స్టీఫన్ వింకల్‌మ్యాన్ గతంలో తెలిపాడు.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కు చెందిన ఆడి క్యూ7 మరియు బెంట్లీ బెంట్యాగా కార్లను అభివృద్ది చేసిన వేదిక మీదే లాంబోర్గిని తమ ఉరస్ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

అయితే లాంబోర్గిని తమ ఉరస్ ఎస్‌యూవీలో తాము స్వతహాగా అభివృద్ది చేసిన వి8 ఇంజన్‌ను మాత్రమే వినియోగిస్తాము అదే విధంగా వోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన పోర్షే వారి ట్విన్ టుర్బో వి8 ఇంజన్ వినియోగించబోమని కూడా స్పష్టం చేసింది.

లాంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ

లాంబోర్గిని తమ ఉరస్ ఎస్‌యూవీని 2017 చివరి నాటికి కంపెనీ ఫ్యాక్టరీ ఉన్న సంట్ అగాటాలో ఆవిష్కరించనుంది. హురాకాన్ మరియు అవెంతడోర్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రక్కనే ఉరస్‌ను ఉత్పత్తి చేయనుంది.

Most Read Articles

English summary
Read In Telugu Lamborghini Urus SUV Engine Power Details Revealed
Story first published: Wednesday, May 17, 2017, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X