ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల: ధర రూ. 71.38 లక్షలు

ఇండియన్ మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ లగ్జరీ ఎస్‌యూవీ విడుదలయ్యింది. సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ ప్రారంభ ధర రూ. 71.38 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. మరియు వేరియంట్ల ఆధారంగా దీని రూ. 1.08

By Anil

ఇండియన్ మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ లగ్జరీ ఎస్‌యూవీ విడుదలయ్యింది. సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ ప్రారంభ ధర రూ. 71.38 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. మరియు వేరియంట్ల ఆధారంగా దీని రూ. 1.08 కోట్ల వరకు ఉంది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ మీద కొన్ని నెలల క్రితమే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీని ఐదవ తరానికి చెందిన మోడల్‌గా లాంచ్ చేసింది. 1989 లో తొలి డిస్కవరీ వెహికల్ విడుదలైనప్పటి నుండి దీంతో ఇప్పటి వరకు ఐదు తరాలకు చెందిన డిస్కవరీలను అభివృద్ది చేసింది.

Recommended Video

[Telugu] BMW 330i Gran Turismo Launched In India - DriveSpark
ల్యాండ్ రోవర్ డిస్కవరీ

సరికొత్త డిస్కవరీని ల్యాండ్ రోవర్ వారి తేలికపాటి ఫుల్ సైజ్ ఆర్కిటెక్చర్ (PLA ఫ్లాట్‌ఫామ్) మీద నిర్మించింది. మునుపటి నాలుగవ తరానికి చెందిన డిస్కవరీతో పోల్చుకుంటే దీని బరువు 480కిలోల వరకు తగ్గువగా ఉంది.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

సరికొత్త 7-సీటర్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీ రెండు ఇంజన్ వేరియంట్లలో లభించును అవి, 3.0-లీటర్ వి6 పెట్రోల్ మరియు 3.0-లీటర్ డీజల్ ఇంజన్. రెండు ఇంజన్‌లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించును.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ
వేరియంట్లు ధరలు
3.0 Petrol S Rs 71.38 Lakh
3.0 Petrol SE Rs 74.64 Lakh
3.0 Petrol HSE Rs 77.86 Lakh
3.0 Petrol HSE Luxury Rs 82.77 Lakh
3.0 Petrol First Edition Rs 88.56 Lakh
3.0 Diesel S Rs 82.21 Lakh
3.0 Diesel SE Rs 89.48 Lakh
3.0 Diesel HSE Rs 93.92 Lakh
3.0 Diesel HSE Luxury Rs 1.016 Crore
3.0 Diesel First Edition Rs 1.08 Crore
ల్యాండ్ రోవర్ డిస్కవరీ

సాంకేతికంగా ల్యాండ్ రోవర్ డిస్కవరీలోని 3.0-లీటర్ కెపాసిటి గల వి6 పెట్రోల్ ఇంజన్ 335బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు 3.0-లీటర్ డీజల్ ఇంజన్ 254బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

వి6 పెట్రోల్ ఇంజన్ డిస్కవరీ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 245కిలోమీటర్లుగా ఉంది. మరియు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.1 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుంది. డీజల్ వెర్షన్ డిస్కవరీ గరిష్ట వేగం 209కిలోమీటర్లు మరియు 0 నుండి 100కిమీల స్పీడ్ 8.1 సెకండ్లలో చేరుకుంటుంది.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీలో సరికొత్త మరియు ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్లను అందించింది. అవి, ఫుల్ సైజ్ స్పేర్ వీల్, ఆటోమేటిక్ టైర్ లిఫ్టింగ్ మరియు ఇంటెలిజెంట్ సీట్ ఫోల్డ్ ఫంక్షనాలిటి ఫీచర్లు ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

డిస్కవరీలోని అతి ముఖ్యమైన ఫీచర్లలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 14-స్పీకర్ల మెరేడియన్ డిజిటల్ సరౌండ్ సిస్టమ్ అనుసంధానం గల 10-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్‌కంట్రోల్ టచ్ ప్రొ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

ఆల్ న్యూ డిస్కవరీలో రెండు ఇంటెలిజెంట్ సిస్టమ్ ఛాయిస్‌లో లభించే పర్మనెంట్ ఫోర్ వీల్ డ్రైవ్ కలదు. వీటిలో ఆన్ రోడ్ కోసం ఆప్టిమల్ సింగల్-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ బాక్స్ మరియు ఆఫ్ రోడింగ్ కోసం టు-స్పీడ్ బాక్స్ కలదు.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

భద్రత పరంగా ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీలో ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగులు, కర్టెన్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, స్టెబిలిటి కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ మరియు సరౌండ్ కెమెరా సిస్టమ్ కలదు.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ల్యాండ్ రోవర్ ఐదవ తరానికి చెందిన డిస్కవరీ ఎస్‌యూవీలో మునుపటి వెర్షన్‌తో పోల్చితే ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఫుల్ సైజ్ ఎస్‌యూవీలో ఇదివరకెన్నడూ లేని ఫీచర్లను పరిచయం చేసింది. ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఆడి క్యూ7 మరియు వోల్వో ఎక్స్‌సి90 లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Land Rover Discovery Launched In India; Prices Start At Rs 71.38 Lakh
Story first published: Monday, October 30, 2017, 20:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X