లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ లాంచ్ 53.18 లక్షలు

లెక్సస్ ఇండియా విపణిలోకి ఎన్ఎక్స్ 300హెచ్ లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ ప్రారంభ ధర రూ. 53.18 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా మొత్తం)గా ఉంది.

By Anil

లెక్సస్ ఇండియా విపణిలోకి ఎన్ఎక్స్ 300హెచ్ లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ ప్రారంభ ధర రూ. 53.18 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా మొత్తం)గా ఉంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యపు దిగ్గజం లెక్సస్ నవంబర్ 2017లో కళ్లుచెదిరేలా డిజైన్ చేయబడిన ఎన్ఎక్స్ 300హెచ్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో విపణిలోకి ప్రవేశపెట్టింది.

Recommended Video

Volvo's Smallest SUV XC40 Is All Set To Be Launched In India - DriveSpark
లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ బేస్ వేరియంట్ ధర రూ. 53.18 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఎఫ్-స్పోర్ట్ ధర రూ. 55.58 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉ్నన్నాయి.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

సరికొత్త లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో ఉన్న 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ హైబ్రిడ్ ఇంజన్ వ్యవస్థ గరిష్టంగా 194బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ ఇ-సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఎస్‌యూవీలోని నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది. లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ 9.2 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

ఎన్ఎక్స్ 300హెచ్ ఫ్రంట్ డిజైన్‌లో లెక్సస్ వారి సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి ల్యాంప్స్ మరియు L-ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఆకర్షణీయమైన స్పోర్ట్స్ వీల్ ఆర్చెస్ మరియు క్యారెక్టర్ బాడీ లైన్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌ కోణీయంగా పైనుండి క్రిందకు వంచబడినట్లు ఉంటుంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ ఇంటీరియర్‌లో 360-డిగ్రీల ప్యానొరమిక్ సరౌండ్ వ్యూవ్ మానిటర్ కలదు. ఫస్ట్-ఇన్ క్లాస్ ఫోల్డింగ్ మరియు ఎలక్ట్రిక్ పవర్ ద్వారా విచ్చుకునే స్వభావం ఉన్న సీట్లు ఉన్నాయి.

Trending Stories On DriveSpark Telugu:

ప్రపంచపు అతి పెద్ద జలాంతర్గామితో రష్యా అణు సామర్థ్య ప్రదర్శన

టాటా టియాగో ఫస్ట్ యాక్సిడెంట్: నుజ్జునుజ్జయిన కారు

భారతీయులను కించపరిస్తే ఎంతటి దిగ్గజాలకైనా ఇదే పరిస్థితి

కార్లపై యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్ అంటించడం వెనకున్న మిస్టరీ!

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

కలర్ హెడ్స్ అప్ డిస్ల్పే, 10.3-అంగుళాల పరిమాణం గల స్ల్పిట్ స్క్రీన్ మల్టీమీడియా డిస్ల్పే, క్లారిఫై టెక్నాలజీతో 14-స్పీకర్ల హై-ఫై మార్క్ లెవిన్సన్ మ్యూజిక్ సిస్టమ్ వంటి అధునాతన ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

భద్రత పరంగా లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ లగ్జరీ ఎస్‌యూవీలో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రియర్ వ్యూవ్ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు కార్నరింగ్ లైట్లు ఉన్నాయి.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

లెక్సస్ ఇండియా తమ ఎన్ఎక్స్ 300హెచ్ ను దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని విక్రయ కేంద్రాలలో ఒకే ధరతో విక్రయించనుంది. ముంబాయ్, న్యూ ఢిల్లీ, గుర్గావ్ మరియు బెంగళూరు నగరాల్లోని లెక్సస్ గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్లతో పాటు చంఢీఘర్, హైదరాబాద్, చెన్నై మరియు కొచ్చి నగరాలలోని లెక్సస్ అధీకృత సర్వీస్ కేంద్రాలలో లభ్యం కానుంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లెక్సస్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఇతర మోడళ్లతో పోల్చుకుంటే కొత్తగా విడుదల చేసిన ఎన్ఎక్స్ 300హెచ్ అత్యంత సరసమైన వెహికల్. చాలా వరకు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు, అధునాతన భద్రతా ఫీచర్లు మరియు కంఫర్ట్ పరంగా లెక్సస్ తమ ఎన్ఎక్స్ 300హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీతో అద్భుతం చేసిందని చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Lexus NX 300h Launched In India; Prices Start At Rs 53.18 Lakh
Story first published: Friday, December 22, 2017, 11:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X