ప్రపంచ ఆటోమొబైల్ సంస్థలు ఇండియాకు వస్తుంటే, అవే దేశాల్లో జెండా పాతుతున్న మహీంద్రా

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా దక్షిణ అమెరికా టెక్నకల్ సెంటర్ నూతన జనరేషన్ స్కార్పియో అభివృద్ది చేసే పనిలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందిస్తున్న స్కార్పియో 2020 నాటికి ప్రపంచం ముందుకు రానుంది.

నాలుగవ తరానికి చెందిన స్కార్పియోను సరికొత్త ఆర్కిటెక్చర్‌తో నిర్మించనుంది. ప్రస్తుతం బాగా అభివృద్ది చెందిన మార్కెట్లకు అనుగుణంగా దీనిని ప్రత్యేక ఎలిమెంట్లను డిజైన్ చేయనుంది. ఓ ఎస్‌యూవీ మరియు పికప్ ట్రక్కు కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది.

స్కార్పియో ఆధారిత పికప్ ట్రక్కుతో అమెరికా మార్కెట్లోకి అడుగులు వేయనుంది. అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లోని శక్తివంతమైన విపణిలో ఉత్పత్తులను అభివృద్ది చేసి అందుబాటులోకి తీసుకురావడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదని చెప్పాలి.

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ రాజన్ వాదెరా ఇటి ఆటోతో మాట్లాడుతూ, నూతన జనరేషన్ స్కార్పియో ను మహాంద్రా అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. అయితే దీనికి సంభందించిన వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

దక్షిణ అమెరికా టెక్నిల్ సెంటర్ మహీంద్రా విభాగం ఈ ప్రాజెక్ట్ డిజైన్‌కు జడ్101 అనే కోడ్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ మరియు అభివృద్ది పనులను చెన్నైలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ పర్యవేక్షిస్తుంది.

అంతే కాకుండా మహీంద్ర మరో యుటిలిటి వెహికల్‌ను కూడా అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. మరో 12 నెలల్లో ఇది మార్కెట్‌ను చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా కు పోటీనివ్వనుంది.

ఇండియన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ నిలకడా ప్రతి నెలకు 3,000 యూనిట్ల స్కార్పియోలను విక్రయిస్తోంది. సరికొత్త డిజైన్ భాషతో మహీంద్రా నుండి వస్తోన్న మొదటి ఉత్పత్తి నాలుగవ తరానికి చెందిన ఎస్‌యూవీ.

 

English summary
Read In Telugu to know about Mahindra’s New-Generation Scorpio In The Works — To Be A Global Product.
Story first published: Tuesday, April 18, 2017, 14:54 [IST]
Please Wait while comments are loading...

Latest Photos