హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్ వేసిన పోలీస్

సాధారణంగా మోటార్ సైకిల్ లేదా స్కూటర్‌లో వెళుతున్నపుడు హెల్మెట్ ధరిస్తారు. అయితే, ఈ ఫోటోలో మారుతి ఓమిని కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించాడు. ఇప్పుడా ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

By Anil

సాధారణంగా మోటార్ సైకిల్ లేదా స్కూటర్‌లో వెళుతున్నపుడు హెల్మెట్ ధరిస్తారు. అయితే, ఈ ఫోటోలో మారుతి ఓమిని కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించాడు. ఇప్పుడా ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్

కారులో సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణించాల్సిన వ్యక్తి హెల్మెట్ ఎందుకు ధరించాడనేది మీ ప్రశ్న కదా... మా ప్రశ్న కూడా ఇదే. మొత్తానికి కారులో అలా హెల్మెట్‌తో డ్రైవింగ్ చేయడానికి ఉన్న అసలు కారణమేంటో చూద్దాం రండి.

హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన విష్ణు శర్మ తన మారుతి ఓమిని కారులో ప్రయాణిస్తున్నపుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులకు అతనికి జరిమానా విధించారు.

హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్

అవును, మీరు చదివింది అక్షరాలా నిజమే! డిసెంబర్ 1, 2017 విష్ణు శర్మ మారుతి సుజుకి ఓమిని కారులో వెళుతుండగా ఉత్తరప్రదేశ్-రాజస్థాన్ సరిహద్దులో ఉన్న ఉంచా అవుట్ పోస్ట్ పోలీసులు రాజస్థాన్ సరిహద్దులో గస్తీ నిర్వహిస్తూ అతని వాహనాన్ని ఆపారు.

హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్

తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో, పోలీస్ కానిస్టేబుల్ ప్రహ్లాద్ సింగ్ హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నాడనే కారణంతో రూ. 200 లు జరిమానా విధించాడు. ఈ ఘటన అనంతరం శర్మ ఇక మీదట ఎలాంటి జరిమానాలు పడకుండా ఉండేందుకు ఓ కొత్త హెల్మెట్ కొనుక్కుని వాహనాన్ని నడుపుతున్నాడు.

హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్

దీనిపై కానిస్టేబుల్ స్పందిస్తూ, సీట్ బెల్ట్ ధరించలేదు అని రాయడానికి బదులుగా పొరబాటున హెల్మెట్ ధరించలేదని రాసినట్లు తెలిపాడు. కానీ, పోలీసులు ఆపినపుడు నేను సీట్ బెల్ట్ ధరించాను. అంతే కాకుండా చలానాలో టూ వీలర్ అని రాశాడు. అయితే, వెహికల్ నెంబర్ మరియు పేరు కరెక్టుగా రాసినట్లు తెలిపాడు.

హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్

పోలీసులు ఇలా అంసంభందమైన చలానాలు ఇవ్వడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలో గోవాలో ఓ మోటార్ సైకిల్ రైడర్ సీట్ బెల్ట్ ధరించలేదని కూడా జరిమానా విధించారు. అక్కడ కూడా కానిస్టేబుల్ పొరబాటు బయటపడింది. నిబంధనల ప్రకారం, కారులో సీట్ బెల్ట్ మరియు బైకు మీద హెల్మెట్ ఖచ్చితం అని మాత్రమే ఉంది. కానీ బైకు మీద సీట్ బెల్ట్ కారులో హెల్మెట్ తప్పనిసరి అని ఎక్కడా లేదు.

హెల్మెట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అకారణంగా పోలీసులు చలానా జారీ చేశారు. నిజానికి ఆ డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించినా కూడా హెల్మెట్ లేదనే కారణం చేత జరిమానా విధించడంతో ఇది కూడా రూల్ అనుకుని ఆ డ్రైవర్ అప్పటి నుండి హెల్మెట్ ధరించి వాహనాన్ని నడుపుతున్నాడు.

అనివార్యమైణ కారణాలకు జరిమానాలు విధించకుండా పోలీసులు ప్రజలకు భద్రతా పరమైన అవగాహన కల్పించాలి. ఏయే వాహనాలలో ఎలాంటి భద్రతను పాటించాలనే విషయాలు తెలియజేయాలి.

Most Read Articles

English summary
Read In Telugu: Police Fined This Man For Not Wearing Helmet While Driving!
Story first published: Saturday, December 9, 2017, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X