నుజ్జునుజ్జయిన మారుతి ఆల్టో: నలుగురూ స్పాట్‌లోనే

By Anil

ముంబాయ్‌లో జరిగిన ఘరో రోడ్డు ప్రమాదం ఒక కుటుంబానికి నూకలు చెల్లేలా చేసింది. ఒక్క అమ్మాయికి అమ్మ, నాన్న, తమ్ముడిని దూరం చేసింది. నలుగురు ఉన్న ఆ కుటుంబంలో ఇప్పుడు ఒక్కరేమిగిలారు. సతారా జిల్లాలోని తమ స్వగ్రామం నుండి ముంబాయ్‌కు తిరుగుప్రయాణమైన కారులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుతో పాటు డ్రైవర్ కూడా అక్కడిక్కడే మరిణించాడు.

నుజ్జునుజ్జయిన మారుతి ఆల్టో:

వివరాల్లోకి వెళితే. ముంబాయ్‌లోని చునభట్టి ప్రాంతంలో యశ్వంత్ పాండురంగ్ మనే(45) రోగ నిర్ధాక పరీక్షలు జరిపే ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. యశ్వంత్ భార్య శారద(40) మరియు కుమారుడు హిృషికేష్(19)తో పాటు డ్రైవర్ రామచంద్ర కృష్ట అందరూ కలిసి తన స్వగ్రామం నుండి ముంబాయ్‌కి వస్తుంటే మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది.

నుజ్జునుజ్జయిన మారుతి ఆల్టో:

మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తున్న యశ్వంత్ తన కుమార్తెను సతారా జిల్లాలోని ఖత్వా తాలూకాలోని మయానీ ప్రాంతంలో ఉన్న మెడికల్ ఇన్‌స్ట్యూట్‌లే వదిలిపెట్టి, అక్కడి నుండి తన గ్రామానికి వెళ్లారు. జాతీయ రహదారి 40 మీద ముంబాయ్ మార్గంలో తన కొడుకు హిృషికేష్ కారును నడుపుతూ ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొట్టాడు.

నుజ్జునుజ్జయిన మారుతి ఆల్టో:

కారు నడుపుతున్న హిృషికేష్ ప్రక్కన డ్రైవర్, వెనుక సీటులో భార్యభర్తలు కూర్చున్నారు. నేషనల్ హైవే 40 మీద కట్రాజ్ టన్నెల్ సమీపంలో కారుకు కుడివైపున్న మలుపును తప్పించబోయి లెఫ్ట్ సైడ్‌కు రావడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టాడు.

నుజ్జునుజ్జయిన మారుతి ఆల్టో:

తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు మొత్తం లారీ లోపలికి చొచ్చుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న అందరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తరువాత సుమారుగా 30 మీటర్ల వరకు లారీ కారును లాక్కెళ్లినట్లు తెలుస్తోంది.

నుజ్జునుజ్జయిన మారుతి ఆల్టో:

ఉదయం నాలుగు గంటలకు ప్రమాదం జరగడంతో నిద్రలేమి కూడా కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఛిద్రమైన కారును పరిశీలిస్తే ఓవర్ స్పీడింగ్ మరియు ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Trending On DriveSpark Telugu:

ఎంత చెప్పిన మాట వినలేదు అందుకే పచ్చడి చేస్తున్నాం...!!

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన బైకు గురించి తెలుసా...?

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రతి అభిమాని తెలుసుకోవాల్సిన నిజాలు

నుజ్జునుజ్జయిన మారుతి ఆల్టో:

నిర్లక్ష్యపు, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, అనుభవలేమి అదనంగా నిద్రలో డ్రైవింగ్ ఈ కారణాలే ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒక్కరు చేసే తప్పు ఎంతో మందిని బలితీసుకుంటుంది. మరెంతో మందికి వారిని దూరం చేస్తుంది. అందుకు సజీవ సాక్ష్యం ఈ కథనం.

దయచేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి...! అన్ని రహదారి నియమాలను పాటించండి...!! సురక్షితంగా గమ్యాన్ని చేరండి!!!

Most Read Articles

English summary
Read In Telugu: All four travelling in Maruti Alto died on the spot after the car rear ends a truck at high speed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X