2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

ఇండియన్ మార్కెట్లో ఏకఛత్రాదిపత్యం సాధించడానికి విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉన్న మారుతి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద పలు రకాల కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి సిద్దమ

By Anil

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుతం ఇండియన్ ప్యాసింజర్ కార్ల విపణిలో 50 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఏకఛత్రాదిపత్యం సాధించడానికి విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉన్న మారుతి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద పలు రకాల కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి సిద్దమైంది.

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శనలో ఎలాంటి కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తోందో డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇవాళ్టి కథనంలో మీ కోసం తీసుకొచ్చింది....

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

జపాన్ దిగ్గజం సుజుకి ప్రపంచ విపణిలోకి తీసుకొచ్చిన కొత్త తరం స్విఫ్ట్ మీద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరికొన్ని మార్కెట్లలో అత్యుత్తమ విక్రయాలు జరుపుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న స్విఫ్ట్ స్థానాన్ని భర్తీ చేస్తూ నూతన స్విఫ్ట్‌ను మారుతి సుజుకి తీసుకురానుంది. ఇందుకు 2018 ఆటో ఎక్స్ పో వేదిక మీద తొలి ఆవిష్కరణ చేయనుంది.

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లతో రానుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పాత తరం స్విఫ్ట్‌లో కూడా ఇవే ఇంజన్‌ వేరియంట్లు ఉన్నాయి. స్విఫ్ట్ స్పోర్ట్ వెర్షన్‌లో 1.0-లీటర్ కెపాసిటి గల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ రానుంది.

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

సెకండ్ జనరేషన్ మారుతి ఎర్టిగా

మారుతి లైనప్‌లో అందుబాటులో ఉన్న ఏకైక ఫ్యామిలీ కారు ఎర్టిగా. ఎమ్‌పీవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీగా ఎర్టిగా అగ్రస్థానంలో నిలిచింది. ఎమ్‌పీవీ సెగ్మెంట్లో పోటీని ప్రక్కకు నెట్టి అగ్రగామిగా రాణించేందుకు ఎర్టిగా కారులో భారీ మార్పులు చేర్పులు చేసి, అప్‌డేటెడ్ వెర్షన్‌లో సెకండ్ జనరేషన్ ఎర్టిగా రూపంలో 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తొలి ఆవిష్కరణకు రానుంది.

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీని తొలుత 2012లో లాంచ్ చేసింది. తరువాత చిన్న చిన్న మార్పులతో 2016లో రీలాంచ్ చేసింది. అయితే, నెక్ట్స్ జనరేషన్ ఎర్టిగా వాహనంలో ప్రస్తుతం ఉన్న ఎర్టిగాలోని 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సరికొత్త 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో కూడా రానుంది. ఇంటీరియర్ ఫీచర్లు మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులకు మారుతి పెద్దపీట వేస్తోంది.

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

అద్భుతమైన క్యాబిన్ స్పేస్, అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు గల బెస్ట్ సెడాన్ మారుతి సియాజ్. అయినప్పటికీ, ఈ మధ్య కాలంలో సియాజ్ సేల్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి తమ మిడ్ సైజ్ సెడాన్ కారు సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను వచ్చే 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించడానికి సిద్దమైపోయింది.

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

అప్ కమింగ్ మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ స్థానంలోకి 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త తరం సియాజ్ ఫేస్‌లిఫ్ట్ పదునైన డిజైన్ మరియు స్పోర్టివ్‌ లుక్‌లో రానుంది.

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

మారుతి సుజుకి అదనంగా మరిన్ని మోడళ్లను కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించనుంది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లను ప్రదర్శించనుంది. ప్రత్యేకించి రెనో క్విడ్ మోడల్‌ను ఎదుర్కునే ఉద్దేశంతో ఒక కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను మారుతి సిద్దం చేసింది.

  • ఫలించిన ఎనిమేదళ్ల నిరీక్షణ: చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి
  • 2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    మారుతి సుజుకి 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించే వాహనాల గురించి ఔత్సాహికుల్లో మరింత ఆతృుతని పెంచేస్తోంది. డ్రైవ్‌స్పార్క్ బృందం వచ్చేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ నగర వేదికగా జరగనున్న వాహన ప్రదర్శన మీద ఆవిష్కరించే మోడళ్లను మీ కోసం లైవ్ కవరేజ్ ఇవ్వనుంది. మరిన్ని ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Cars Expected At The 2018 Auto Expo
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X