ఊహించని ధరతో విడుదలైన సరికొత్త డిజైర్: ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్....

Written By:

తరం మారింది, అందుకు తగ్గట్లుగా కార్లను అప్‌డేట్ చేయడం ప్రారంభించింది మారుతి సుజుకి. ఇందులో భాగంగానే మారుతి యొక్క బెస్ట్ సెల్లింగ్ కారు స్విఫ్ట్ డిజైర్‌కు అనేక మర్పులు నిర్వహించి స్విప్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో స్విఫ్ట్ పేరును తొలగించి కేవలం డిజైర్ పేరుతో మాత్రమే థర్డ్ జనరేషన్‌ డిజైర్‌గా నేడు(16 మే, 2017) విపణిలోకి విడుదల చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2017 మారుతి డిజైర్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

2017 మారుతి డిజైర్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

 • ఎల్ఎక్స్ఐ ధర రూ. 5.45 లక్షలు
 • విఎక్స్ఐ ధర రూ. 6.29 లక్షలు
 • విఎక్స్ఐ ఆటోమేటిక్ ధర రూ. 6.76 లక్షలు
 • జడ్ఎక్స్ఐ ధర రూ. 7.05 లక్షలు
 • జడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ ధర రూ. 7.52 లక్షలు
 • జడ్ఎక్స్ఐ ప్లస్ ధర రూ. 7.94 లక్షలు
 • జడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ ధర రూ. 8.41 లక్షలు
2017 మారుతి డిజైర్ డీజల్ ధర వివరాలు

2017 మారుతి డిజైర్ డీజల్ ధర వివరాలు

 • ఎల్‌డిఐ ధర రూ. 6.45 లక్షలు
 • విడిఐ ధర రూ. 7.29 లక్షలు
 • విడిఐ ఆటోమేటిక్ ధర రూ. 7.76 లక్షలు
 • జడ్‌డిఐ ధర రూ. 8.05 లక్షలు
 • జడ్‌డిఐ ఆటోమేటిక్ ధర రూ. 8.52 లక్షలు
 • జడ్‌డిఐ ప్లస్ ధర రూ. 8.94 లక్షలు
 • జడ్‌డిఐ ప్లస్ ఆటోమేటిక్ ధర రూ. 9.41 లక్షలు

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

డిజైన్ మరియు ఫీచర్ల పరంగా సరికొత్త డిజైర్‌లో అనేక మార్పులు చేసుకున్నప్పటికీ మునుపటి మోడల్‌లో ఉన్న అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-డీజల్ ఇంజన్‌లను ఇందులో కొనసాగింపుగా తీసుకువచ్చింది. వీటికి 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

సరికొత్త డిజైర్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఈ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 22 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

నూతన డిజైర్‌లోని 1.3-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 73బిహెచ్‌పి పవర్ మరియు 189ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు, మరియు లీటర్‌కు 28.40 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. దేశీయంగా అత్యధిక మైలేజ్ ఇవ్వగల కారు డీజల్ డిజైర్.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

సరికొత్త డిజైర్ గత ఏడాది ఆవిష్కరించబడిన నూతన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా డిజైన్ చేయబడింది. ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న స్పోర్టివ్ క్రోమ్ హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ కలదు.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

ఈ తరం కార్లలో ముఖ్యంగా ఉండాల్సిన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న యాంగులర్ ఎల్ఇడి హెడ్ లైట్లను ఇందులో అందివ్వడం జరిగింది. ప్రస్తుతం ట్రెండింగ్ ఫీచర్లలో ఎల్ఇడి హెడ్ లైట్లు కీలక పాత్ర పోషిస్తుండటంతో ఎక్కువ మంది ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ గల వేరియంట్లకు మొగ్గు చూపుతున్నారు.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

నూతన స్విఫ్ట్‌తో పోల్చుకుంటే డిజైర్ మరింత స్పోర్టివ్‌గా ఉంది. కారు చివరి భాగంలో ఉన్న టాపు ఎత్తును తగ్గించడం ద్వారా తక్కువ ఎత్తుతో రూఫ్ టాప్‌ని కలిగి ఉంది. మరియు హ్యాచ్‌బ్యాక్‌ కాదు అని సంకేతం ఇచ్చేందుకు వెనుకవైపున స్వల్పంగా పొడగించబడిన మరియు రీడిజైన్ చేయబడిన డిక్కీ కలదు.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

ముందు మరియు వెనుక వైపు డిజైన్‌ను మునుపటి మోడల్ డిజైర్‌తో పోల్చుకుంటే పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. సరికొత్త మారుతి డిజైర్ 14-అంగుళాలు మరియు 15-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

మారుతి ఈ కొత్త డిజైర్‌లోని రియర్ డిజైన్‌కు అధిక ప్రాధ్యాన్యతనిచ్చింది. సిగ్నేచర్ ఎల్ఇడి డిజైన్‌ జోడింపుతో టెయిల్ ల్యాంప్ క్లస్టర్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. రెండు టెయిల్ లైట్లను కలుపుతూ ఓ క్రోమ్ పట్టీని డిక్కీ మీదుగా అమర్చారు.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

డిజైన్ పరంగానే కాకుండా ఇంటీరియర్‌ స్పేస్‌ను మరింత పెంచడానికి మారుతి ప్రయత్నించింది. మునుపటి డిజైర్‌తో పోల్చుకుంటే ఫ్రంట్ క్యాబిన్ 20ఎమ్ఎమ్, రియర్ క్యాబిన్ 30ఎమ్ఎమ్ మరియు లెగ్ రూమ్ స్పేస్ 55ఎమ్ఎమ్ వరకు పెరిగి మరింత స్పేసియష్‌గా మారింది.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

ఆపిల్ కార్ ప్లే మరియు అండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. మరియు వెనుక వైపు ప్యాసింజర్లు ఏ/సి కోసం ప్రత్యేక ఏ/సి వెంట్ అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

మునుపటి డిజైర్‌తో పోల్చితే నూతన మోడల్‌లో మరింత పారదర్శకమైన క్రీమ్ కలర్ లైటింగ్ షేడ్ అందివ్వడం జరిగింది. డిజైర్‌లోని టాప్ ఎండ్ వేరియంట్‌లో డ్యాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్ మరియు డోర్లకు లోపలివైపున ఫాక్స్ బర్ల్ అనే కలపను అందించి ప్రీమియమ్ ఫీల్ కల్పించడం జరిగింది.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

భద్రత పరంగా మారుతి సుజుకి సరికొత్త డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు, చైల్డ్ సీట్ ఫిక్స్ కోసం ఐఎస్ఒఫిక్స్ యాంకర్స్ అదే విధంగా స్టాండర్డ్‌గా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ లను అందించారు.

మారుతి సుజుకి 2017 డిజైర్ విడుదల

సరికొత్త 2017 డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును ఆరు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి,

 • ఆక్స్‌ఫర్డ్ బ్లూ,
 • షెర్వూడ్ బ్రౌన్,
 • గల్లంట్ రెడ్,
 • మ్యాగ్మా గ్రే,
 • సిల్కీ సిల్వర్ మరియు
 • పర్ల్ ఆర్కిటిక్ వైట్.
English summary
Read in telugu maruti dzire launched in india, get more details about launche, price, mileage, specifications, images and more
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark