ఇండియాలో ఆ టైర్లను కలిగి ఉన్న ఏకైక కారు

మారుతి సుజుకి తమ ఇగ్నిస్‌లో ఎకోపియా ఇపి150 ఎకో ఫ్రెండ్లీ టైర్లను అందించింది. ఇండియాలో ఈ టైర్లను మొదటిసారిగా వినియోగించింది ఇగ్నిస్ కారులోనే.

By Anil

కొన్ని అంశాల పరంగా చూస్తే మారుతి సుజుకినే మొదటి సారిగా తమ కార్లలో పరిచయం చేస్తుంటుంది. మచ్చుకు ఒకటి,సెలెరియో ద్వారా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం. అయితే ఇప్పుడు మరొకటి, బ్రడ్జిస్టోన్ కు చెందిన ఎకోపియా ఇపి150 టైర్లను తమ ఇగ్నిస్ క్రాసోవర్‌లో అందిస్తోంది. ఇందులో ఏముంది అనుకునేరు. బ్రిడ్జిస్టోన్‌ ఎకో ఫ్రెండ్లీ ఎకోపియాపి ఇపి150 టైర్లను కలిగి ఉన్న భారత దేశపు మొదటి కారు ఇదే.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

మంచి ఇంధన సామర్థ్యం మరియు ఎకో ఫ్రెండ్లీ అంశాలకు అనుగుణంగా బ్రిడ్జిస్టోన్ అభివృద్ది చేసిన ఎకోపియా ఇపి150 టైర్లను మారుతి తమ ప్రీమియ్ క్రాసోవర్ కారు ఇగ్నిస్‌లో పరిచయం చేసింది.

 మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

బ్రిడ్జిస్టోన్ సంస్థ ఈ ఎకోపియా ఇపి150 టైర్లను విభిన్నమైన పదార్థాలతో సమ్మేళనంతో, త్రెడ్ డిజైన్ కోసం ప్రత్యేకమైన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని వినియోగించి తయారు చేసింది. తద్వారా ఇంధన సామర్థ్యం, భద్రత, సామర్థ్యం మరియు సమర్థవంతమైన బ్యాలెన్సింగ్‌ వంటివి సాధ్యం అవుతాయి.

 మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

బ్రిడ్జిస్టోన్ సంస్థ అందిపుచుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విన్నూత్న డిజైన్, మరియు మన్నిక వంటి అంశాలు ఎకోపియా ఇపి150 టైర్లలో అచ్చంగా ప్రతిబింబిస్తాయి.

 మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

బ్రిడ్జిస్టోన్ ఇండియా డైరెక్టర్ కత్సుయుకి యమమురా మాట్లాడుతూ, "బ్రిడ్జిస్టోన్ అభివృద్ది చేసిన ఎకోపియా ఇపి150 ఎకో ఫ్రెండ్లీ టైర్లను మొదటి సారిగా మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఇగ్నిస్ లో అందివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు."

 మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బ్రిడ్జిస్టోన్ డీలర్ల వద్ద 13 నుండి 18 సైజుల్లో ఉన్న రిమ్ములకు 26 సైజులో ఉండే ఎకోపియా ఇపి150 టైర్లు విక్రయాలకు సిద్దంగా ఉన్నాయి.

 మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

భద్రత ప్రమాణాలను పాటిస్తూ, మైలేజ్ పెంచుతూ, వినియోగంలో సౌండ్ మరియు అరుగుదలకు చెక్ పెట్టేందుకు గాను బ్రిడ్జిస్టోన్ వీటిని అభివృద్ది చేసింది.

 మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

  • రిపబ్లిక్ డే గెస్ట్: అబుదాబి రాజు గారి ఆడంబరమైన విమానం
  • ఇండియాలో ఉన్న టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు
  •  మారుతి సుజుకి ఇగ్నిస్ ఎకోపియా ఇపి150 టైర్లు

    ఈ ఏడాదిలో మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనే ప్లాన్ చేస్తున్నారా....? కొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే మారుతి సుజుకి ఈ ఏడాదిలో థర్డ్ జనరేషన్ స్విఫ్ట్‌ను దేశీయంగా విడుదల చేస్తోంది. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ప్రస్తుత స్విఫ్ట్ మోడల్‌తో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది. 2017 మారుతి స్విఫ్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోల కోసం....

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis To Get Bridgestone’s Ecopia EP150 Tyres
Story first published: Saturday, January 28, 2017, 13:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X