సరికొత్త మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ లాంచ్ డిటైల్స్ రివీల్

జపాన్ వాహనతయారీ దిగ్గజం మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త అవుట్‍‌ల్యాండర్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఈ సరికొత్త క్రాసోవర్ ఎస్‌యూవీ ఇప్పటికే వైబ్‌సైట్లోకి చేరింది.

By Anil

జపాన్ వాహనతయారీ దిగ్గజం మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త అవుట్‍‌ల్యాండర్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఈ సరికొత్త క్రాసోవర్ ఎస్‌యూవీ ఇప్పటికే వైబ్‌సైట్లోకి చేరింది.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

తాజాగా అందిన సమాచారం మేరకు, మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ 2018 మే నెలలో విపణిలోకి విడుదల కానుంది. జనవరి లేదా ఫిబ్రవరి 2018లో దీని మీద అధికారిక బుకింగ్స్ ప్రారంభించనుంది.

Recommended Video

New Mitsubishi Outlander India Launch Details - DriveSpark
మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

ప్రస్తుతానికి అవుట్‍‌ల్యాండర్ ఎస్‌యూవీని కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే ఖరారు చేసింది. కనీసం, విడుదల సమయంలోనైనా డీజల్ వెర్షన్‌ను జతగా లాంచ్ చేస్తే బాగుంటుంది.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

సరికొత్త మిత్సుబిషి అవుట్‍‌ల్యాండర్ క్రాసోవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ 2.4-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో లభ్యమయ్యే ఇది 169బిహెచ్‌పి పవర్ మరియు 225ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

న్యూ మిత్సుబిషి అవుట్‍‌ల్యాండర్ మిత్సుబిషి సూపర్-ఆల్ వీల్ కంట్రోల్(S-AWC) డ్రైవ్ సిస్టమ్‌తో లభించనుంది. ఇది అవసరాన్ని బట్టి ఎంత మేర పవర్ అవసరం ఉంటుందో అంత మేరకు పవర్‌ను అన్ని చక్రాలకు సరఫరా చేస్తుంది. ఇందులో పలు రకాల డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

అవుట్‍‌ల్యాండర్ ఇంటీరియర్‌లో 6.1-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథర్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 710W సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఆటోమేటిక్ హెడ్ లైట్, వైపర్లు,స ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి అదనపు ఫీచర్లున్నాయి.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

సేఫ్టీ పరంగా మిత్సుబిషి అవుట్‍‌ల్యాండర్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, యాక్టివ్ స్టెబిలిటి కంట్రోల్ వంటివి ఉన్నాయి.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

మిత్సుబిషి 2008లో సెకండ్ జనరేషన్ అవుట్‌ల్యాండర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే, నాలుగేళ్ల అనంతరం ఆశించిన సేల్స్ సాధ్యంకాకపోవడంతో మార్కెట్ నుండి తొలగించింది.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మూడవ తరానికి చెందిన మిత్సుబిషి అవుట్‌ల్యాండ్ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో రానుంది. ఈ విషయం మిత్సుబిషి ఇదివరకే ప్రకటించింది. అయితే, నిజానికి డీజల్ వెర్షన్ ఇండియన్స్‌కు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న హోండా సిఆర్-వి డీజల్‌ వెర్షన్‌తో ఇది పోటీపడుతుందో చూడాలి మరి. మార్కెట్ టాక్ ప్రకారం, రూ. 30 లక్షల ధరతో అవకాశం ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: New Mitsubishi Outlander India Launch Details Revealed
Story first published: Monday, December 25, 2017, 16:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X