ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

అత్యధిక మైలేజ్ ఇచ్చే కొన్ని అత్యుత్తమ హ్యాచ్‍‌బ్యాక్ కార్లను డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కోసం అందిస్తోంది. ఇవాళ్టి కథనంలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మైలేజ్, ఇంజన్ మరియు ధరల వివరాలు

By Anil

భారత్‌లో కారు కొనేముందు ప్రతిఒక్కరు అడిగే ప్రశ్న, మైలేజ్ ఎంత ? నిజమే, ఇండియాలో కారు లేదా బైకు కొనే ప్రతి కస్టమర్ మైలేజ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఇందు కోసం దేశీయంగా కార్లను విడుదల చేసే ప్రతి కార్ల కంపెనీ కూడా మైలేజ్ దృష్టిలో ఉంచుకుని తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఇకపోతే, దేశవ్యాప్తంగా పండుగ సందడి ఇప్పటికే ప్రారంభమైంది. పండుగ సందర్భంలో ఇంటికి కొత్త వస్తువులను తెచ్చుకోవాలని భారతీయులు భావిస్తారు. అందులో కార్లు లేదా బైకులు అయితే, వచ్చే పండుగ సీజన్‌లో కొందాములే అని వాయిదా వేస్తూ ఉంటారు.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

మరి ఈ పండుగ సీజన్‌లో ఎంచుకోవడానికి అత్యధిక మైలేజ్ ఇచ్చే కొన్ని అత్యుత్తమ హ్యాచ్‍‌బ్యాక్ కార్లను డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కోసం అందిస్తోంది. ఇవాళ్టి కథనంలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మైలేజ్, ఇంజన్ మరియు ధరల వివరాలు వివరంగా....

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

మారుతి సుజుకి బాలెనో

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఆల్టో, స్విఫ్ట్, సెలెరియో తర్వాత పాపులర్ కారుగా బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ నిలిచింది. నెక్సా షోరూమ్‌లో లభించే రెండవ కారుగా బాలెనో కారును 2015లో మారుతి సుజుకి విడుదల చేసింది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే బాలెనో కారును డీజల్ ఆప్షన్‌లో ఎంచుకోవడం ఉత్తమం. డీజల్ వేరియంట్ బాలెనో మైలేజ్ లీటర్‌కు 27.39కిలోమీటర్లుగా ఉంది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు గట్టి పోటీనిస్తున్న బాలెనో మీద 3-4 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంది. బాలెనో డీజల్ వేరియంట్ల ధర శ్రేణి రూ. 6.44 - రూ. 8.43 లక్షలుగా ఉంది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హోండా జాజ్

బెస్ట్ మైలేజ్ ఇవ్వగల హ్యాచ్‌బ్యాక్ కార్లలో జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ రెండవ స్థానంలో నిలిచింది. హోండా ఇండియా లైనప్‌లోకి 2015లో జాజ్ విడుదలైంది. 2001లో విడుదలైన తొలి సిరీస్ జాజ్ నుండి ఇప్పటి వరకు 75 దేశాల్లో సుమారుగా 55 లక్షల జాజ్ కార్లను హోండా విక్రయించింది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

జాజ్ కూడా పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో లభిస్తోంది. అయితే, జాజ్ డీజల్ వేరియంట్ గరిష్టంగా లీటర్‌కు 27.3కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. జాజ్ లోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ బిహెచ్ పవర్ మరియు ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు. అయితే, మ్యాన్యువల్ వెర్షన్ డీజల్ జాజ్ మాత్రమే ఈ మైలేజ్ ఇస్తుంది. జాజ్ డీజల్ మ్యాన్యువల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ.7.3 నుండి రూ.9.3 లక్షలుగా ఉంది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ ఇండియా సరికొత్త ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారును 2015లో విపణిలోకి విడుదల చేసింది. ఇందులోని శక్తివంతమైన 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టిడిసిఐ డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఫోర్డ్ ఫిగో లోని డీజల్ వేరియంట్ గరిష్టంగా లీటర్‌కు 25.83కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఫిగో డీజల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 5.76 - రూ. 7.3 లక్షలుగా ఉంది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

టయోటా ఎటియోస్ క్రాస్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ఇండియా, తమ లైనప్‌లో ఉన్న లివా హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఎటియోస్ క్రాస్ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. మూడు ఇంజన్ ఆప్షన్‌లలో లభించే ఇందులో 1.4-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్ మంచి మైలేజ్ ఇస్తుంది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

టయోటా ఎటియోస్ క్రాస్ డీజల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 23.59 కిలోమీటర్లుగా ఉంది. ఎటియోస్ క్రాస్ లోని శక్తివంతమైన 1.4-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‍‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టయోటా ఎటియోస్ క్రాస్ డీజల్ ధరల శ్రేణి రూ.7.51 నుండి రూ.7.81 లక్షల మధ్య ఉంది.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మోటార్స్ ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారును 2008లో విడుదల చేసింది. ఇండియాలో హ్యుందాయ్‌కి మంచి సక్సెస్ తెచ్చిపెట్టిన మోడళ్లలో ఎలైట్ ఐ20 ఒకటి. దీనిని 1.4-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో ఎంచుకోగలరు.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హ్యుందాయ్ ఎలైట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ గరిష్ట మైలేజ్ లీటర్‌కు 22.54 కిలోమీటర్లుగా ఉంది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ.6.65 లక్షల నుండి రూ.8.97 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

వోక్స్‌వ్యాగన్ పోలో జిటి

వోక్స్‌వ్యాగన్ పోలో నిజానికి శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో ఉండాల్సింది. అయితే, పర్ఫామెన్స్ మరియు మైలేజ్ రెండూ కోరుకునే కస్టమర్ల కోసం ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ లిస్టులో అత్యంత ఖరీదైన హ్యాచ్‌బ్యాక్ కారు కూడా ఇదే.

బెస్ట్ మైలేజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

వోక్స్‌వ్యాగన్ పోలో జిటి శ్రేణిలో ఉన్న డీజల్ వేరియంట్ గరిష్టంగా లీటర్‌కు 21.49 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇందులోని శక్తివంతమైన 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వోక్స్‌వ్యాగన్ పోలో జిటి ధరల శ్రేణి రూ. 9.33 నుండి రూ. 9.69 లక్షల మధ్య ఉంది.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(హైదరాబాద్‌)గా ఉన్నాయి మరియు అన్ని మైలేజ్ వివరాలు ఏఆర్ఏఐ ప్రకారం ఇవ్వబడ్డాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Most fuel efficient hatchback sold in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X