సింగల్ ఛార్జింగ్‌తో 170కిమీలు నడిచే లీఫ్ కారును దేశీయంగా విడుదల చేయనున్న నిస్సాన్

నిస్సాన్ తమ లీఫ్ ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసే పరిశీలనలో ఉంది. పైలట్ ప్రాజెక్టు క్రింద ప్రయోగాత్మంగా నడపనున్న నిస్సాన్ పేర్కొంది. నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు గురించి...

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అత్యంధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కారు లీఫ్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు నిస్సాన్ ఇండియా విభాగం సన్నాహాలు చేస్తోంది.ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఏజెన్సీల సహాకారంతో పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేసి విక్రయాలకు ఉన్న సాద్యాసాద్యాలను విశ్లేషించనుంది.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

తమ లీఫ్ ఎలక్ట్రిక్ కారుకు దేశీయంగా ఉన్న మార్కెట్‌ను విశ్లేషించేందుకు ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఏజెన్సీలతో కలిసి పనిచేయనుంది. అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా కొన్ని యూనిట్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది నిస్సాన్.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు విడుదల ఉంటుందని నిస్సాన్ అధికారులు పేర్కొన్నారు.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

ఇండియన్ రోడ్ల మీద నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు యొక్క పనితీరు,రకరకాల వాతావరణ పరిస్థితుల్లో బ్యాటరీ యొక్క స్థితి, ప్రత్యేకించి లిథియమ్ అయాన్ బ్యాటరీ యొక్క పనితీరు మరియు సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

వేసవి కాలంలో కారులోని కొన్ని శరీర విడి భాగాల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి వేసవి కాలంలో ఈ లీఫ్ ఎలక్ట్రిక్ కారును వేసవి కాలంలో ఇండియన్ రోడ్ల మీద పరీక్షించనున్నారు.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారుకు ఫేమ్ సబ్సిడీ వర్తిస్తుంది. హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ అభివృద్ది మరియు విక్రయాలను పెంచే ప్రభుత్వం విభాగం ఫేమ్ ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేసే వారికి సబ్సీడి అందిస్తుంది.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు 107బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల లిథియమ్ అయాన్ బ్యాటరీ అనుసంధానిత 30కెడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో నడుస్తుంది.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

అంతర్జాతీయ మార్కెట్లో లీఫ్ ఎలక్ట్రిక్ కారు గేమ్ చేంజర్‌లా వ్యవహరిస్తోంది. సెప్టెంబర్ 2016 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 2.39 లక్షల యూనిట్ల లీఫ్ ఎలక్ట్రిక్ కార్లను నిస్సాన్ విక్రయించింది.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

నిస్సాన్ సంస్థ అభివృద్ది చేసిన 30కిలోడబ్ల్యూహెచ్ లిథియమ్ అయాన్ బ్యాటరీ గల ఎలక్ట్రిక్ మోటార్‌ను అభివృద్ది చేసింది. ఇది గరిష్టంగా 107బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. మరియు సింగల్ ఛార్జింగ్ మీద 170కిమీల నడుస్తుంది.

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

ఎనిమిది గంటల్లో కారులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు మరియు వాహనం నడుస్తున్నపుడు ఆటోమేటిక్‌గా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అదే విధంగా బ్రేకులు అప్లే చేసినపుడు ఉత్పత్తయ్యే శక్తి బ్యాటరీకి చేరుతుంది.

Most Read Articles

English summary
Read In Telugu To Know About Nissan Leaf Electric Car Being Considered For India
Story first published: Wednesday, April 19, 2017, 15:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X