బాలెనో, ఐ20 మరియు జాజ్ కార్లకు పోటీగా 37కిమీల మైలేజ్ ఇచ్చే నిస్సాన్ నోట్

నిస్సాన్ భారత్‌లో నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారును పరీక్షిస్తోంది. నిస్సాన్ నోట్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లతో పోటీపడనుంది.

By Anil

మరో జపాన్ దిగ్గజం ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతోంది. నిస్సాన్ భారత్‌లో నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారును పరీక్షిస్తోంది. నిస్సాన్ నోట్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లతో పోటీపడనుంది.

నిస్సాన్ నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

నిస్సాన్ మైక్రా కోసం వినియోగించిన వి-ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నోట్ హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేసింది. ప్రస్తుతం పరీక్షించిబడుతున్న మోడల్ హైబ్రిడ్ వెర్షన్ అని తెలుస్తోంది. పలు అంతర్జాతీయ మార్కెట్లలో నిస్సాన్ నోట్ కారును హైబ్రిడ్ వెర్షన్‌లో విక్రయిస్తోంది.

నిస్సాన్ నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

అయితే రెగ్యులర్ నోట్ వెర్షన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి ఉన్న డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లో రానుంది. ఇవే ఇంజన్‌లు నిస్సాన్ మైక్రాలో కూడా ఉన్నాయి.

నిస్సాన్ నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

నిస్సాన్ వద్ద ఉన్న హైబ్రిడ్ టెక్నాలజీలో పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్ ఉంటుంది. అయితే, కారు మాత్రం ఎలక్ట్రిక్ మోటార్ ఆదారంగానే నడుస్తుంది. ఈ కార్లలో ఉన్న బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి ఇందులోని ఇంజన్‌లు పనిచేస్తాయి.

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
నిస్సాన్ నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లలో ఉన్న పరిమిత పరిధి సమస్యను నివారిస్తుంది. ఈ శ్రేణి కార్లు పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్ కార్లలా మనకు కావాల్సినంత దూరం ప్రయాణించవు. చార్జింగ్ అయిపోగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, ఇంజన్ ద్వారా బ్యాటరీలను చేయడంతో ఎక్కడ కావాలంటే ఇక్కడ ఇంధనాన్ని నింపుకోవచ్చు.

నిస్సాన్ నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

నిస్సాన్ ఈ టెక్నాలజీని ఇ-పవర్ అని పిలుస్తోంది. నిస్సాన్ నోట్ ఇ-పవర్ కారులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న హెచ్ఆర్12డిఇ ఇంజన్ కలదు. ఇది 79బిహెచ్‌పి పవర్ మరియు 103ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నిస్సాన్ మైక్రాలో ఉపయోగించిన ఇదే ఇంజన్ నోట్ ఇ-పవర్ కారులో బ్యాటరీ ఛార్జింగ్‌కు ఉపయోగపడుతోంది.

నిస్సాన్ నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

నిస్సాన్ నోట్ ఇ-పవర్ కారు గరిష్ట మైలేజ్ లీటర్‌కు 37.2 కిలోమీటర్లు. అంటే సాధారణ హ్యాచ్‌బ్యాక్ ఇచ్చే మైలేజ్‌కు ఇది రెట్టింపు. నిస్సాన్ తరువాత ఈ పరిజ్ఞానాన్ని షెవర్లే తమ వోల్ట్ హైబ్రిడ్ కారులో అందిస్తోంది.

నిస్సాన్ నోట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

నిస్సాన్ నోట్ ఇ-పవర్ కారులో బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ స్టేషన్ల అవసరం లేదు కాబట్టి ఇండియన్ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నిస్సాన్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిజ్ఞానం త్వరగా ఇండియాకు రావాల్సిన అవసరలం ఎంతైనా ఉంది. నిస్సాన్ నోట్-ఇ పవర్ హ్యాచ్‌బ్యాక్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాతో పంచుకోండి...

Most Read Articles

English summary
Read In Telugu: Nissan Note premium hatchback – Baleno & i20 Rival – spotted in India
Story first published: Monday, October 16, 2017, 7:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X