మారుతి సుజుకి స్విఫ్ట్‌కు పెద్ద ఎదురుదెబ్బ: ప్యూజో

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ప్యూజో దేశీయ విపణిలోకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు గట్టి పోటీనిచ్చే మోడల్‌తో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది.

By Anil

ఇండియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన స్విఫ్ట్ వచ్చే ఏడాది కొత్త వెర్షన్‌లో భారీ విపణిలోకి విడుదల కానుంది. భారీ మార్పులకు గురైన ఎక్ట్సీరియర్ డిజైన్, ఎన్నడూరానటువంటి అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు, ప్రీమియమ్ ఫీల్ కలిగించే సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో రానుంది.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

ఈ అంశాల పరంగా చూసుకుంటే నూతన స్విఫ్ట్ మారుతికి అతి పెద్ద విజయాన్ని సాధించిపెట్టనుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే, విపణిలోకి రానున్న స్విఫ్ట్‌ను టార్గెట్ చేస్తూ ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ప్యూజో దేశీయ విపణిలోకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు గట్టి పోటీనిచ్చే మోడల్‌తో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

తాజాగా అందిన సమాచారం మేరకు, ప్యూజో ఇండియన్ మార్కెట్లో 2020 నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇక మార్కెట్లో ఉన్న స్విఫ్ట్‌కు పోటీగా రానున్న హ్యాచ్‌బ్యాక్ కారును ఎస్‌సి21 కోడ్ పేరుతో అభివృద్ది చేస్తోంది.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

రిపోర్ట్స్ ప్రకారం, దీనితో పాటు మరో రెండు లేదా మూడు హ్యాచ్‌బ్యాక్ కార్లను కూడా లాంచ్ అవకాశం ఉంది. తమ కార్ల ధరలను తక్కువగా ఉంచేందుకు ప్యూజోకు విడిపరికరాలను సరఫరా చేసే సంస్థలతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తోంది.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

ఈ భాగస్వామ్యపు ఒప్పందం ద్వారా, సరఫరాదారుల నుండి నాలుగు లక్షల యూనిట్లకు కావాల్సిన విడిపరికరాలను సరఫరా చేసే విధంగా డీల్ కుదుర్చుకోనుంది. విడిభాగాలను చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటుకు చేర్చి, అసెంబుల్ చేయనుంది. ఈ ప్లాంటు నుండి లక్ష కార్ల వరకు ఉత్పత్తి చేయాలని ప్యూజో భావిస్తోంది.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ తరువాత ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ శర వేగంగా వృద్ది చెందుతోంది. చాలా మంది కస్టమర్లు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లను వదిలి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ కార్లను ఎంచుకోవడం మరియు కొత్త కస్టమర్లు కూడా వీటికే మొగ్గు చూపడంతో ఈ సెగ్మెంట్లో అవకాశాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

ప్రస్తుతం, ప్యూజో సంస్థ అంతర్జాతీయ విపణిలో 208 హ్యాచ్‌బ్యాక్‌ కారును విక్రయిస్తోంది. ఇది దేశీయంగా ఉన్న మారుతి స్విఫ్ట్‌కు గట్టిపోటీనివ్వనుంది. ప్యూజో దీనిని తొలిసారిగా 2012లో అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది. పలుమార్లు ప్యూజో తమ 208 హ్యాచ్‌బ్యాక్ కారును రహస్యంగా పరీక్షిస్తోంది.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

ప్యూజో ఇండియాలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే నాటికి భారతీయ రోడ్లకు అనుగుణంగా ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది విడుదలకు సిద్దం చేయనుంది. ఏదేమైనప్పటికీ, ప్యూజో ప్రణాళికలు గమనిస్తే ఖచ్చితంగా మారుతిని ఇబ్బందుల్లో పడేస్తుందేమే అనే అనుమానం కలగక మానడంలేదు.

ప్యూజో 208 హ్యాచ్‌బ్యాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్ల తరువాత ఎక్కువ ఆదరణ లభిస్తున్న సెగ్మెంట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్. ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌కు ఉదాహరణగా మారుతి బాలెనో, హోండా జాజ్ మరియు హ్యుందాయ్ ఐ20 కార్లను చెప్పుకోవచ్చు.

ప్యూజో ప్రణాళికల మేరకు, ఇటు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10తో పాటు, ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు కూడా గట్టిపోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Peugeot’s Maruti Swift Rival Is Coming To India
Story first published: Thursday, December 7, 2017, 14:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X