రూమర్ కాదండోయ్: డబుల్ రైడింగ్ బ్యాన్ అధికారికంగా అమల్లోకి తెచ్చారు

నవంబర్ 23, 2017 నుండి 100సీసీ కన్నా తక్కువ కెపాసిటి గల టూ వీలర్లను కేవలం సింగల్ సీటుతో మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నట్లు కర్ణాటక రవాణా శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

By Anil

100సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల మీద డబుల్ రైడింగ్ బ్యాన్ గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఈ వారంలో ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, చాలా మంది దీనిని రూమర్‌గా భావించారు. కానీ ఇది రూమర్ కాదు. ఇప్పుడు ఈ నిషేధం అధికారికంగా అమల్లోకి వచ్చింది.

డబుల్ రైడింగ్ బ్యాన్

నవంబర్ 23, 2017 నుండి 100సీసీ కన్నా తక్కువ కెపాసిటి గల టూ వీలర్లను కేవలం సింగల్ సీటుతో మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నట్లు కర్ణాటక రవాణా శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఇది బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక మొత్తం అమల్లోకి వచ్చింది.

డబుల్ రైడింగ్ బ్యాన్

సింగల్ సీటు అంటే ఏలా...?

100సీసీ లోపు కెపాసిటి ఇంజన్ గల టూ వీలర్లలో సీటు పొడవు ఇద్దరు కూర్చునేందుకు అనువుగా ఉంటుంది. అయితే, ఈ టూ వీలర్లకు ఆర్‌టిఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే తయారీదారుడి నుండి రైడర్‌ సీటు మాత్రమే ఉన్నట్లు సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.

డబుల్ రైడింగ్ బ్యాన్

ప్రస్తుతం బెంగళూరు మరియు కర్ణాటక వ్యాప్తంగా ఈ టూ వీలర్లకు సింగల్ సీటును మాత్రమే అమర్చి డీలర్లు విక్రయించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని రూల్ వచ్చాక ఇలాంటి టూ వీలర్లను కొనడం శుద్ద దండగని చెప్పవచ్చు.

డబుల్ రైడింగ్ బ్యాన్

ప్రస్తుతం రోడ్డు మీద ఉన్న 100సీసీ టూ వీలర్ల పరిస్థితి ఏమిటి ?

100సీసీ టూ వీలర్ల మీద డబుల్ రైడింగ్ బ్యాన్ అనే నియమం నవంబర్ 23, 2017 తరువాత రిజిస్టర్ అయ్యే టూ వీలర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఈ తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న టూ వీలర్లతో ఎలాంటి సమస్య ఉండదు. అయితే, ఇక మీదట 100సీసీ లోపు టూ వీలర్లను ఎంచుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి.

డబుల్ రైడింగ్ బ్యాన్

టూ వీలర్ల కంపెనీలకు లాభమా... నష్టమా....?

100సీసీ కెపాసిటి గల బైకులు లేదా స్కూటర్లు కేవలం ఒక్కరి కోసమే అంటే కస్టమర్లు ఇలాంటి స్కూటర్లను దాదాపు ఎంచుకోరు. ఇదే జరిగితే చిన్న చిన్న టూ వీలర్ల సేల్స్‌కు దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

Trending On DriveSpark Telugu:

విమాన ప్రయాణంలో పైలట్లు మరియు ఎయిర్ హోస్టెస్ చేసే 20 ఆసక్తికరమైన పనులు

అప్పుడే పుట్టిన పాపకు నరకం చూపించిన ఇలాంటి డ్రైవర్ మీ చేతికి చిక్కితే ఏం చేస్తారు?

క్షణకాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారతదేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

డబుల్ రైడింగ్ బ్యాన్

తాజా నిర్ణయంతో నిషేధానికి గురైన బైకులు మరియు స్కూటర్లు

  • టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్
  • టీవీఎస్ స్పోర్ట్
  • హీరో హెచ్ఎఫ్ డీలక్స్
  • హీరో స్ల్పెండర్ ప్లస్
  • టీవీఎస్ ఎక్స్ఎల్
  • హీరో స్ల్పెండర్ ప్రొ
  • బజాజ్ సిటి 100
  • హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎకో
  • హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్
  • డబుల్ రైడింగ్ బ్యాన్

    పిలియన్ రైడింగ్ నిషేధానికి అసలు కారణం ఏంటి ?

    ఇంజన్ కెపాసిటి తక్కువగా ఉండటంతో ఇద్దరు ప్రయాణిస్తున్నపుడు బైకులు క్రిందపడి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఉద్దేశ్యంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఇది ఎంత వరకు అమలవుతుందనేది వేచి చూడాలి మరి.

    డబుల్ రైడింగ్ బ్యాన్

    ఈ నిర్ణయంపై ప్రజల స్పందన...

    ఈ నిషేధం ఒక మూర్ఖపు నిర్ణయమని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్లు పాడవడంతో టూ వీలర్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని వాపోతున్నారు. రోడ్లే సరిగ్గా ఉంటే చిన్న చిన్న టూ వీలర్లతో ఎలాంటి సమస్య ఉండదు. రోడ్ల మరమ్మత్తుల గురించి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంతో ఇటు ప్రజలు, అటు తయారీ సంస్థలు కొత్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

    డబుల్ రైడింగ్ బ్యాన్

    100సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం గల టూ వీలర్లకు ఒక్కరు కూర్చునే సీటు ఉంటేనే రిజిస్ట్రేషన్ అని నిమయం ఇప్పుడు కర్ణాటకలో మాత్రమే అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ అనంతరం ఈ టూ వీలర్ల మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించాలి. దీని అతిక్రమించిన వారి మీద మోటార్ వాహనాల చట్టం ఆధారంగా జరిమానా మరియు చర్యలు తీసుకుంటారు.

    డబుల్ రైడింగ్ బ్యాన్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    చిన్న టూ వీలర్ల మీద ఇద్దరు ప్రయాణించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ప్రభుత్వం వాదన దాదాపు తప్పు. రోడ్లకు సకాలం మరమ్మత్తులు నిర్వహిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఇందుకు ఉదాహరణ గతం వారంలో ముంబాయ్‌లో జరిగిన ప్రమాదం.

    డబుల్ రైడింగ్ బ్యాన్

    ముంబాయ్ నగరంలో ఓ స్కూటర్ ప్రమాదం జరిగింది. ఈ స్కూటర్‌ మీద ఒక్కరే ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డు గుంతలమయంగా ఉండటంతో స్కూటర్‌ నడుపుతున్న మహిళ క్రింద పడిపోయింది. వెనకాలే వచ్చిన క్రేన్ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది. ఇందుకు ప్రధాన కారణం రోడ్డు సరిగా లేకపోవడం.

    చిన్న తప్పు నిండు ప్రాణాన్ని బలిగొంది: స్కూటర్లో వెళుతున్నారా... తస్మాత్ జాగ్రత్త

Most Read Articles

English summary
Read In Telugu: Pillion rider ban on 100cc two wheelers is not a roumer, it is official now
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X