రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ లగ్జరీ ఎస్‌యూవీ విడుదల: దీని ధర తెలిస్తే షాక్!

రేంజ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. రేండ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ ధర రూ. 2.79 కోట్లు ఎక్స్-షోరూమ్(దేశవ్యాప్తం)గా ఉంది.

By Anil

రేంజ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. రేండ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ ధర రూ. 2.79 కోట్లు ఎక్స్-షోరూమ్(దేశవ్యాప్తం)గా ఉంది.

లగ్జరీ ఇంటీరియర్ మరియు శక్తివంతమైన వి8 ఇంజన్‌తో జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ (SVO) బృందం ఈ రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ను అభివృద్ది చేసింది.

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్

సాంకేతికంగా రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ ఎస్‌యూవీలో 5.0-లీటర్ సామర్థ్యం గల వి8 సూపర్ ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. పూర్తిగా అల్యూమినియంతో నిర్మించిన ఈ ఇంజన్ గరిష్టంగా 543బిహెచ్‌పి పవర్ మరియు 625ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ ఛార్జ్‌డ్ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

Recommended Video

2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్

5.0-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్ సహాయంతో రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ ఎస్‌యూవీ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ డిజైన్

డైనమిక్ రూపాన్ని అందించేందకు రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ ఎస్‌యూవీలో 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను గ్రాఫైట్ అట్లాస్ సొబగులతో రెడ్ కలర్ బ్రెంబో కాలిపర్లను కలిగి ఉంది. స్పోర్టివ్ ఫీల్ కలిగించేందుకు బ్లాక్ కాంట్రాస్ట్ రూఫ్ మరియు మిర్రర్ క్యాప్స్ అందివ్వడం జరిగింది.

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్

అరుదైన ఇంటీరియర్ రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌‌లో గమనించవచ్చు, నాలుగు విభిన్న రంగుల్లో లభించే మెత్తటి డైమండ్ సీట్స్, మరియు గ్రాండ్ బ్లాక్ ఫ్రంట్, రియర్ డోర్ వెనీర్స్ ఇందులో ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్

ఇంటీరియర్‌లో 10-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బాటిల్ చిల్లర్ కంపార్ట్‌మెంట్ మరియు వెనుక వరుస సీటింగ్‌ వరకు పొడగించబడిన సెంటర్ కన్సోల్ మరియు దానికి పవర్ డెప్లాయబుల్ టేబుల్ అందివ్వడం జరిగింది.

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్

స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ బృందం ఇండియన్ లైనప్‌లోకి ఈ రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ వెహికల్‌ను నాలుగవ మోడల్‌గా విడుదల చేసింది. ఇది వరకే, రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ లను విడుదల చేసింది.

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ లగ్జరీ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా ఉన్న 25 అధీకృత డీలర్ నుండి బుక్ చేసుకోవచ్చు.

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్‌ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జి 63 ఏఎమ్‌జి తో పోటీపడనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Range Rover SVAutobiography Dynamic Launched In India; Priced At Rs 2.79 Crore
Story first published: Thursday, July 27, 2017, 19:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X