Just In
- 29 min ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 3 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డీలర్ 85 వ వార్షికోత్సవానికి ప్రత్యేక కారును రూపొందించిన రోల్స్ రాయిస్!
ఎవరివద్ద అయినా రోల్స్ రాయిస్‌కు చెందిన ఫాంటమ్ లేదా ఘోస్ట్ కారు ఉందంటే ఆయన గురించి భలే గొప్పలు పోతాం. కానీ ఈ రెండు కాదు, రోల్స్ రాయిస్ తయారు చేసిన డాన్ మేఫెయిర్ ఎడిషన్ కొన్నవాడే అసలైన సంపన్నుడు.
విలాసంవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ డాన్ కారును విభిన్నంగా మేఫెయిర్ ఎడిషన్‌లో ఆవిష్కరించింది. అయితే దీనిని విక్రయాల కోసం కాదట, హెచ్ఆర్ ఓవెన్ రోల్స్ రాయిస్ డీలర్షిప్ 85 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ ప్రదర్శించడానికి అభివృద్ది చేసినట్లు రోల్స్ రాయిస్ తెలిపింది.
పది కాదు, ఇరవై కాదు ఏకంగా 85 సంవత్సరాల పాటు రోల్స్ రాయిస్ కార్లను విక్రయిస్తూ అత్యుత్తమ రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రంగా హెచ్ఆర్ ఓవెన్ ప్రసిద్దిగాంచింది. ఇక్కడ ప్రదర్శనకు సిద్దం చేసిన కారులో అనేక లగ్జరీ ఫీచర్లను తొలిసారిగా పరిచయం చేసింది.
ఇంటీరియర్‌లోని కాపర్ లోహంతో డ్యాష్ బోర్డ్‌ను కలిగిన మొదటి కారు ఇదే. అంతే కాకుండా ఇంటీరియర్‌లోని త్రెడ్ ప్లేట్ల మీద స్పెషల్ కమిషన్ - మేఫెయిర్ ఎడిషన్ వన్ ఆఫ్ వన్ అనే ఆంగ్ల పదాలను ప్రింట్ చేయడం జరిగింది.
రోల్స్ రాయిస్ ఈ డాన్ మేఫెయిర్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ మీద బెర్విక్ బ్రాంజ్ పెయింట్ అందించింది. కాపర్ డ్యాష్ బోర్డ్, స్పీకర్లు మరియు ఆర్కిటిక్ వైట్ కలర్లో ఉన్న సీట్లు ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లండన్ ఈ డాన్ మేఫెయిర్ కూపే కారును అభివృద్ది చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న రోల్స్ రాయిస్ మోడల్ కార్లకు ధీటుగా, అద్బుతంగా ఉంది ఈ స్పెషల్ ఎడిషన్ డాన్.
హెచ్ఆర్ ఓవెన్ డీలర్షిప్ వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేకంగా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లండన్ ఈ అల్ట్రా రేర్ కారును తయారు చేయడం పట్ల రోల్స్ రాయిస్ బ్రాండ్ డైరెక్టర్ క్లాస్ ఆండర్సెన్ హర్షం వ్యక్తం చేశాడు.
రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసిన ఈ ఏకైక రోల్స్ రాయిస్ డాన్ మేఫెయిర్ ఎడిషన్ కారును లక్కీ కస్టమర్‌కు విక్రయించనున్నట్లు తెలిపాడు. అయితే దీని ధర వివరాలను వెల్లడించలేదు.