టాటా హెక్సా విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

టాటా మోటార్స్ తమ లైనప్‌లోకి శక్తివంతమైన మరియు అతి ముఖ్యమైన వాహనం హెక్సా ను నేడు (జనవరి 18, 2017) ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. హెక్సా ఇంజన్, ధరలు, ఫీచర్ల మరియు ఫోటోలు....

By Anil

టాటా మోటార్స్ 2017 ఏడాది హెక్సా విడుదలతో ఎస్‌యువి దిగ్గజ సంస్థల్లో గుబులుపుట్టించింది. టాటా లైనప్‌కు అతి ముఖ్యమైన మోడల్‌గా నిలవనున్న హెక్సా టాటా గతంలోని అరియా మోడల్ స్థానంలోకి వచ్చింది. హెక్సా ఎస్‌యువిని రూ. 11.99 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.

టాటా హెక్సా విడుదల

టాటా మోటార్స్ 2017 ఏడాది హెక్సా విడుదలతో ఎస్‌యువి దిగ్గజ సంస్థల్లో గుబులుపుట్టించింది. టాటా లైనప్‌కు అతి ముఖ్యమైన మోడల్‌గా నిలవనున్న హెక్సా గతంలోని అరియా మోడల్ స్థానంలోకి వచ్చింది. హెక్సా ఎస్‌యువిని రూ. 11.99 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.

టాటా హెక్సా లభించు వేరియంట్లు

టాటా హెక్సా లభించు వేరియంట్లు

టాటా మోటార్స్ హెక్సా ఎస్‌యువిని మూడు విభిన్న వేరియంట్లలో పరిచయం చేసింది. అవి,

  • హెక్సా ఎక్స్ఇ,
  • హెక్సా ఎక్స్ఎమ్,
  • హెక్సా ఎక్స్‌టి
  • ఈ మూడు వేరియంట్లు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మరియు ఎక్స్ఎమ్, ఎక్స్‌టి వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల చేసింది.
    హెక్సా వేరియంట్లు మరియు ధర వివరాలు

    హెక్సా వేరియంట్లు మరియు ధర వివరాలు

    • ఎక్స్ఇ ధర రూ. 11.99 లక్షలు
    • ఎక్స్ఎమ్ ధర రూ. 13.85 లక్షలు
    • ఎక్స్ఎమ్ ఆటోమేటిక్ ధర రూ. 15.05 లక్షలు
    • ఎక్స్‌టి ధర రూ. 16.20 లక్షలు
    • ఎక్స్‌టి ఆటోమేటిక్ ధర రూ. 17.40 లక్షలు
    • ఎక్స్‌టి 4X4 ధర రూ. 17.49 లక్షలు
    • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
      ఇంజన్ వివరాలు

      ఇంజన్ వివరాలు

      టాటా మోటార్స్ తమ హెక్సా ఎస్‌యువిలో 2.2-లీటర్ సామర్థ్యం గల టుర్బో చార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందించింది. ఎక్స్ఇ వేరియంట్లోని ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

      అయితే మిగతా వేరియంట్లలోని ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 154బిహెచ్‌పి పవర్ మరియు 2,700ఆర్‌పిఎమ్ వద్ద 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇక్కడ గుర్తించాల్సింది అన్ని వేరియంట్లలో కూడా ఒకే ఇంజన్ అందుబాటులో ఉండటం.

      టాటా హెక్సా విడుదల

      ఇది మూడు ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ల అనుసంధానంతో లభిస్తోంది. అవి, 5-స్పీడ్ మ్యాన్యువల్ (కేవలం ఎక్స్ఇ వేరియంట్లో మాత్రమే), 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్.

      టాటా హెక్సా విడుదల

      టాటా మోటార్స్ తమ టాప్ ఎండ్ వేరియంట్లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందించింది. ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా చేయడానికి బోర్గ్-వార్నర్ సంస్థకు చెందిన ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

      టాటా హెక్సా విడుదల

      టాటా హెక్సా ఇక్స్‌టి ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లో నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్ కలవు. అవి, ఆటో, కంఫర్ట్, డైనమిక్ మరియు ఆఫ్ రోడ్. వీటిని డ్యాష్ బోర్డ్ లోని డయల్ మోడ్ ద్వారా ఎంచుకోవచ్చు.

      టాటా హెక్సా కొలతలు

      టాటా హెక్సా కొలతలు

      • పొడవు: 4,788ఎమ్ఎమ్
      • వెడల్పు: 1,903ఎమ్ఎమ్
      • ఎత్తు: 1,791ఎమ్ఎమ్
      • వీల్ బేస్: 2,850ఎమ్ఎమ్
      • గ్రౌండ్ క్లియరెన్స్: 200ఎమ్ఎమ్
      • చక్రాలు: ఎక్స్ఇ మరియు ఎక్స్ఎమ్ వేరియంట్లలో 16-అంగుళాల స్టీల్ చక్రాలు/ ఎక్స్‌టి వేరియంట్లో 19-అగుళాల అల్లాయ్ చక్రాలు
      • టైర్లు: ఎక్స్ఇ మరియు ఎక్స్ఎమ్ వేరియంట్లలో 235/70 ఆర్16 మరియు ఎక్స్‌టి వేరియంట్లో 235/55 ఆర్19
      • టర్నింగ్ సర్కిల్ రేడియస్: 5.75 మీటర్లు
      • ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం: 60-లీటర్లు
      • టాటా హెక్సా డిజైన్ అంశాలు

        టాటా హెక్సా డిజైన్ అంశాలు

        టాటా మోటార్స్ ఈ హెక్సా ఎస్‌యువిలోని ముందు వైపున అగ్రెసివ్ డిజైన్ అందించింది. టాటా సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్‌కు ఇరు చివరి వైపుల ఫ్లాంకింగ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ను ఇముడింపజేయడం జరిగింది.

        టాటా హెక్సా విడుదల

        సిగ్నేచర్ గ్రిల్‍‌కు క్రింది వైపున ఉన్న బంపర్‌కు పై భాగంలో అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్ కలదు. బంపర్‌కు ఇరు వైపులా పగటి పూట వెలిగే లైట్లు మరియు ఫాగ్ల్ లైట్లను అందివ్వడం జరిగింది.

        టాటా హెక్సా విడుదల

        హెక్సా వెనుక వైపు డిజైన్‌కు కూడా టాటా ఓ మోస్తారు ప్రాముఖ్యతనిచ్చింది. ముఖ్యంగా టెయిల్ ల్యాంప్స్ డిజైన్ చేసిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. చతురస్రాకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్‌ రెండింటిని క్రోమ్ పట్టీ ఒకటి పట్టి ఉంచింది. ఈ క్రోమ్ స్ట్రిప్ (పట్టీ)కి మధ్యలో టాటా లోగోను గుర్తించవచ్చు.

        టాటా హెక్సా విడుదల

        బ్లాక్ స్పోర్టి ఇంటీరియర్ గల హెక్సా లో ఆరు లేదా ఏడు ప్రయాణించే విధంగా ఇంటీరియర్ లేఔట్ తీర్చిదిద్దడం జరిగింది. ఐదు అంగుళాల పరిమాణం గల హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో టాటా వారి కనెక్ట్‌నెక్ట్స్ సిస్టమ్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. దీని ద్వారా వాయిస్ కమాండ్ ఇవ్వవచ్చు మరియు దీనిని 10-స్పీకర్లు గల హార్మన్ ఆడియో సిస్టమ్‌కు అనుసంధానం చేయడం జరిగింది.

        టాటా హెక్సా విడుదల

        ఎస్‌యువి సెగ్మెంట్లో ఉన్న ఇతర వాహనాలకు గట్ట పోటీనిచ్చే విధంగా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు (ముందు, ప్రక్కల మరియు కర్టన్), యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి వంటి భద్రత ఫీచర్లను అందించింది.

        టాటా హెక్సా విడుదల

        టాటా హెక్సా ఎస్‌యువి లోని ఫీచర్లను తెలిపే ఫోటోలు....

Most Read Articles

English summary
Also Read In Telugu: Tata Hexa Launched In India; Launch Price + Photo Gallery
Story first published: Wednesday, January 18, 2017, 13:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X