అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

Written By:

భారత దేశపు అతి పెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా మోటార్స్ ఇండియా సిఇఒ బట్స్‌చెక్ మరియు వోక్స్‌వ్యాగన్ సిఇఒ మత్తియాస్ ముల్లెర్ ఇరువురు పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకం చేసారు.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

ఇరు సంస్థల యొక్క పరస్పర ఒప్పందం ప్రకారం, ప్రాథమికంగా ఉమ్మడి భాగస్వామ్యంతో వెహికల్ ఆర్కిటెక్చర్, ఇంజన్‌లు మరియు విడి భాగాలను పంచుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

టాటా మరియు వోక్స్‌వ్యాగన్ సంస్థలు తమ యొక్క విలువైన సాంకేతిక సమాచారం మరియు డాటాను పరస్పరం పంచుకొని నూతన ఉత్పత్తుల తయారీ మరియు అభివృద్దికి సహకారం చేసుకోనున్నాయి.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, ఉత్పత్తుల యొక్క పోర్ట్ ఫోలియోను పెంచుకునేందుకు భారతదేశంలో ఎక్కువ ప్రభావం ఉన్న అతి పెద్ద వాహన తయారీ సంస్థతో పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ ఇది వరకే తమ నూతన ఉత్పత్తుల తయారీ కోసం ఎమ్‌క్యూబి-ఎ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ది చేయడం మీద దృష్టి సారించింది. అయితే ఇండియాలో ఈ ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన భారీ ఖర్చుతో కూడుకున్నదని తెలుసుకొని దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థతో చేతులు కలిపింది.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

టాటా మోటార్స్ కూడా భవిష్యత్తు కోసం అడ్వాన్స్‌డ్ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్ అభివృద్ది చేస్తోంది. అయితే ఇప్పుడు వోక్స్‌వ్యాగన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ప్రపంచ శ్రేణి ఉత్పత్తుల ఆర్కిటెక్చర్, అభివృద్దిని తక్కువ ధరలో పూర్తి చేసే అవకాశం అందివచ్చింది.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

ప్రారంభంలో వోక్స్‌వ్యాగన్, టాటా మోటార్స్ ఏఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్ వినియోగించుకునే దాని మీద స్వల్ప అనుమానంతో ఉండేది. అయితే జర్మనీకి చెందిన ఇంజనీరింగ్ సంస్థ ఇడిఎజి ఎవాల్యుయేట్ చేయడం ద్వారా జర్మనీ ఆటో దిగ్గజం(వోక్స్‌వ్యాగన్) సుముఖత చూపింది.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

టుగెథర్ - స్ట్రాటజీ 2025 (TOGETHER - strategy 2025 ) ప్రణాళికతో వోక్స్‌వ్యాగన్ భాద్యతలను కొన్ని ప్రత్యేకమైన రీజియన్‌లలో టాటా టేకోవర్ చేయడానికి సుముఖత చూపింది.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

గతంలో సుమారుగా ఆరు ఫ్లాట్‌ఫామ్‌లలో భాగస్వామ్యంతో ఉన్న టాటా ఇప్పుడు రెండు ఫ్లాట్‌ఫామ్‌లకు చేరింది. వివిధ ఫ్లాట్‌ఫామ్ లలో ఆర్థికపరమైన పెట్టుబడులు తీసుకునే విషయంలో టాటా చాలా జాగ్రత్త వహించింది.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

టాటా మరియు వోక్స్‌వ్యాగన్ భాగస్వామ్యంలో ఎలాంటి ఉత్పత్తులు తయారు కానున్నాయి అనే ప్రశ్న చాలా మందికి ఇప్పటికే మెదిలి ఉంటుంది. ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ రెండు సంస్థలు తయారు చేసే వాహనాల యొక్క సమాచారం కోసం మాతో కలిసి ఉండండి.

అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్ - వోక్స్‌వ్యాగన్

టాటా మోటార్స్ దేశీయంగా అందుబాటులో ఉంచిన అన్ని ప్యాసింజర్ కార్ల ఫోటో గ్యాలరీని వీక్షించండి.

టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

English summary
Tata Motors And Volkswagen Group Sign MoU For Joint Cooperation
Story first published: Thursday, March 9, 2017, 17:07 [IST]
Please Wait while comments are loading...

Latest Photos