ముగిసిన టాటా సఫారీ డైకార్ ఎస్‌యూవీ శకం!

Written By:

టాటా మోటార్స్ స్వతహాగా డిజైన్ చేసి, డెవలప్ చేసి, పూర్తి స్థాయిలో ఇండియాలోనే తయారు చేసిన ఎస్‌యూవీ సఫారీ డైకార్ శకానికి పులిష్టాప్ పెట్టింది. టాటా మోటార్స్ ప్రొడక్ట్స్ వివరాలను తెలిపే అధికారిక వెబ్‌సైట్ నుండి తమ "సఫారీ డైకార్" ను తొలగించింది.

వెబ్‌సైట్ నుండి సఫారీ డైకార్ ఎస్‌యూవీని తొలగించిన టాటా మోటార్స్

తొలుత, 1998లో టాటా మోటార్స్ 2.0-లీటర్ డీజల్ ఇంజన్‌తో టాటా సఫారీ వాహనాన్ని విడుదల చేసింది. తరువాత 2003లో, పవర్ స్టీరింగ్, ఫ్యూయల్ పంప్ మరియు అనేక ఎలక్ట్రికల్స్ జోడింపుతో అప్‌గ్రేడ్స్ నిర్వహించి లాంచ్ చేసింది.

వెబ్‌సైట్ నుండి సఫారీ డైకార్ ఎస్‌యూవీని తొలగించిన టాటా మోటార్స్

అయితే 2005 లో పూర్తిగా మోడిఫై చేసి, 3-లీటర్ డైకార్ ఇంజన్‌తో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా అనేక మార్పులు చేర్పులు జరిపి, టాటా సఫారీ పేరు ప్రక్కన డైకార్ అనే పదాన్ని చేర్చి టాటా సఫారీ డైకార్ ఎస్‌యూవీగా విపణిలోకి విడుదల అయ్యింది.

వెబ్‌సైట్ నుండి సఫారీ డైకార్ ఎస్‌యూవీని తొలగించిన టాటా మోటార్స్

కామన్ రెయిల్ టెక్నాలజీతో టాటా వద్ద ఉన్న తొలి ఇంజన్ సఫారీ డైకార్‌లో పరిచయం చేసిన 3-లీటర్ డైకార్ ఇంజన్ కావడం విశేషం. అదే ఏడాదిలో సఫారీ డైకార్‌ను 2-లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టడం జరిగింది. నూతన అప్‌డేట్స్‌తో లభించే సఫారీ స్టార్మ్ మాత్రం యధావిథిగా అందుబాటులో ఉంది. కాబట్టి డైకార్ రూపాన్ని సఫారీ స్టార్మ్ లోనే చూసుకోవాలి.

వెబ్‌సైట్ నుండి సఫారీ డైకార్ ఎస్‌యూవీని తొలగించిన టాటా మోటార్స్

టాటా సఫారీ డైకార్ ఎస్‌యూవీ ఎల్ఎక్స్ 4X2 మరియు ఇఎక్స్ 4X2 వేరియంట్లలో లభించేది. సఫారీ డైకార్‌లో యురో-4 ఉద్గార నియమాలను పాటించే 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న డైకార్ టుర్బో డీజల్ ఇంజన్‌తో లభించేది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

వెబ్‌సైట్ నుండి సఫారీ డైకార్ ఎస్‌యూవీని తొలగించిన టాటా మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ సఫారీ డైకార్ ఎస్‌యూవీని తొలగించి డైకార్ శకానికి ముగిపు పలికినప్పటికీ, ఇది ఎంతో మందికి డ్రీమ్ కారుగా నిలిచిపోయింది. సఫారీ శ్రేణిలో ఇప్పుడు అప్‌గ్రేడ్స్‌తో లభించే సఫారీ స్టార్మ్ లభ్యమవుతోంది.

English summary
Read In Telugu: Tata Safari Dicor Discontinued Unlisted Tata Motors Website
Story first published: Wednesday, July 12, 2017, 11:54 [IST]
Please Wait while comments are loading...

Latest Photos