Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనుమతులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన తొలి టాటా ఎలక్ట్రిక్ కారు
టాటా మోటార్స్ ఒక ప్రక్కన నూతన కార్లను అభివృద్ది చేసి, విడుదల చేస్తూనే... మరో ప్రక్కన వాటిని ఎలక్ట్రిక్ వెర్షనలో అభివృద్ది చేసింది. టాటా బెస్ట్ సెల్లింగ్ కారు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత స్టైల్ బ్యాక్ సెడాన్ టిగోర్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో డెవలప్ చేస్తోంది. విపణిలో ఉన్న మహీంద్రా ఇ-వెరిటో కారు ఇది గట్టి పోటీనివ్వనుంది.
టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి వివరాలు...

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) వద్దకు టాటా టిగోర్ ఎలక్ట్రిక్ తుది దశ పరీక్షలకొచ్చింది. ఐదు(2+3) మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం గల టిగోర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ గరిష్టంగా 40బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.


టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు మొత్తం బరువు 1,516 కిలోలుగా ఉంది. మహీంద్రా ఇ వెరిటో ఎలక్ట్రిక్ కారుతో దీని బరువు సుమారుగా 2,00 కిలోలు తక్కువగా ఉంది. టిగోర్ ఎలక్ట్రిక్ సింగల్ ఛార్జింగ్‍తో 120 నుండి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ARAI వద్దకు పూర్తి స్థాయి పరీక్షలు మరియు అనుమతి కోసం వచ్చిందంటే, ఇండియన్ రోడ్ల మీద పరుగులు పెట్టేందుకు దాదాపు సిద్దమైనట్లే. అయితే, బ్యాటరీ మరియు చార్జింగ్ సమయం వంటి వివరాలను టాటా ఇంకా వెల్లడించలేదు.

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇఇఎస్ఎల్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు టాటా మోటార్స్ ఆర్డర్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఈ నెలలో 350 టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను ఇఇఎస్ఎల్ కు టాటా డెలివరీ ఇవ్వనుంది.

టాటా మోటార్స్ అతి త్వరలో ఎలక్ట్రిక్ కార్లను కమర్షియల్‌గా విడుదల చేయడానికి సర్వ సిద్దం చేసుకుంది. టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది. టిగోర్ తరువాత టియాగో మరియు నానో కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయనుంది.

2030 నుండి పెట్రోల్ మరియు డీజల్ కార్ల రిజిస్ట్రేషన్‌కు స్వస్తి పలికి కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అనుమతించేలా భారతప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఎలక్ట్రిక్ కార్లకు తప్పనిసరిగా కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం మరియు మౌళిక సదుపాయాల గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా అందుబాటులోకి వస్తే, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం మీద ఇప్పటి నుండే ప్రజలలో అవగాహన మరియు చైతన్యం తీసుకురావచ్చు. ఎలక్ట్రిక్ కార్లలో ప్రధానమైనవి లిథియం అయాన్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్.

ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ వ్యవస్థలను ప్రతి కార్ల తయారీ సంస్థ స్వహాగా అభివృద్ది చేసుకుంటుంది. అయితే, బ్యాటరీల కోసం ఇతర సంస్థల మీద ఆదారపడాల్సి ఉంటుంది. ప్యాసింజర్ కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి గుజరాత్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ఏర్పాటుకు సిద్దమవుతోంది.