2017 జూలైలో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు: రెట్టింపైన బాలెనో సేల్స్

జూలై 2017 లో దేశవ్యాప్తంగా అమ్ముడుపోయిన ప్యాసింజర్ కార్ల గణాంకాల ఆధారంగా అత్యధికంగా అమ్ముడైన పది కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం.

By Anil

జూలై 2017 లో దేశవ్యాప్తంగా అమ్ముడుపోయిన ప్యాసింజర్ కార్ల గణాంకాల ఆధారంగా అత్యధికంగా అమ్ముడైన పది కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం.

ఎప్పటిలా కాకుండా ఈ సారి ఊహించిన విధంగా కార్ల సేల్స్ జరిగాయి. జిఎస్‌టి అమలవడంతో ప్యాసింజర్ కార్ల ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో సేల్స్ భారీగా పెరిగాయి. ఈ టాప్ 10 జాబితాలో బాలెనో రెట్టింపు ఫలితాలను సాధించింది మరియు తొలి పది కార్లలో ఏడు మారుతి కార్లు కాగా, హ్యుందాయ్ నుండి మూడు కార్లకు చోటు దక్కింది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

10. హ్యుందాయ్ క్రెటా

గడిచిన జూలై 2017లో దేశవ్యాప్తంగా 10,556 యూనిట్లు అమ్ముడయ్యాయి, జూన్ 2017 విక్రయాలను గమనిస్తే 7,981 యూనిట్లు సేల్ అయ్యాయి. జూలై ఫలితాలతో హ్యుందాయ్ క్రెటా 32 శాతం వృద్దిని సాధించింది.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

09. మారుతి సుజుకి సెలెరియో

జూన్ 2017 లో 7,792 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించిన మారుతి జూలై 2017లో 11,087 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించి 42 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

08. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఇండియా జూన్ 2017 నెలలో 9,910 యూనిట్ల ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించగా, ఆ తరువాత నెల జూలై 2017లో 11,390 యూనిట్ల ఎలైట్ ఐ20 కార్లను విక్రయించి 15 శాతం వృద్దిని సాధించింది.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

07. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ ఇండియా లైనప్‌లో అత్యధిక విక్రయాలు సాధించే గ్రాండ్ ఐ10 గడిచిన జూలై 2017 నెలలో 12,002 యూనిట్ల విక్రాయలతో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో 7 స్థానంలో నిలిచింది.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

06. మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి ఒకప్పటి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ గతంలో వెలువడే టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్ల జాబితాలో రెండవ లేదా మూడవ స్థానంలో నిలిచేది. అయితే కొత్తగా వచ్చిన మారుతి మోడళ్లు దీనిని ఆరవ స్థానానికి నెట్టేశాయి. గడిచిన జూలై 2017 నెలలో 13,738 యూనిట్ల స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

05. మారుతి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న ఏకైక కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్. మారుతి మునుపటి డిజైర్ స్థానంలోకి ఈ ఏడాది న్యూ డిజైర్ కారును విడుదల చేసింది. భారీ వెయిటింగ్ పీరియడ్‌తో సరికొత్త డిజైర్ అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోంది. గడిచిన జూలై 2017 లో 14,703 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

04. మారుతి వితారా బ్రిజా

మారుతి సుజుకి గత ఏడాది విడుదల చేసిన వితారా బ్రిజా ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తిరుగులేని ఫలితాలు సాధిస్తోంది. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో నాలుగవ స్థానాన్ని సంపాదించుకోవడమే ఇందుకు నిదర్శనం. జూన్ 2017 లో 10,232 యూనిట్ల వరకు అమ్ముడుపోగా జూలై నెలలో 15,243 యూనిట్ల సేల్స్‌తో 49 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

03. మారుతి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా దీని విక్రయాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. జూన్ 2017 లో 15,207 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడుపోగా, జూలై 2017లో 16,301 యూనిట్లు అమ్ముడయ్యి 7 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

02. మారుతి బాలెనో

మారుతి సుజుకి తమ బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారును 2015 లో హ్యుందాయ్ ఐ20 మీద పోటీగా తీసుకొచ్చింది. విడుదల సమయం నుండి ఇప్పటి వరకు బుకింగ్స్, వెయిటింగ్ పీరియడ్ మరియు సేల్స్ ఏవీ తగ్గలేదు. దీంతో ప్రతి నెలా భారీ విక్రయాలు నమోదు చేసుకుంటోంది.

గడిచిన జూన్ 2017 లో 9,120 బాలెనో కార్లు అమ్ముడుపోగా, తర్వాత నెల జూలై 2017 లో ఏకంగా 19,153 యూనిట్ల బాలెనో కార్లు అమ్ముడయ్యి సేల్స్ పరంగా 110 శాతం వృద్దిని సాధించింది.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

01. మారుతి ఆల్టో

మారుతి సుజుకి మరియు ఇండియా బెస్ట్ సెల్లింగ్ కారుగా ఆల్టో మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన జూన్ 2017లో 19,844 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించిన మారుతి, దాని తర్వాత నెల జూలై 2017 లో ఏకంగా 26,009 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించి 31 శాతం వృద్దిని సాధించింది.

Most Read Articles

Read more on: #టాప్ 10 #top 10
English summary
Read In Telugu: Top 10 Best Selling Cars July 2017 In India
Story first published: Tuesday, August 8, 2017, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X