10 లక్షలలోపు ధరతో లభించే ఐదు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ధరను ప్రాతిపదికగా చేసుకుని ఎక్కువ మంది హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకుంటారు. ఒక రంగా చెప్పాలంటే ఇండియన్ రోడ్లకు హ్యాచ్‌బ్యాక్ కార్లే బెటర్. పది లక్షల బడ్జెట్ ధరలో ఉన్న ఐదు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల గురి

By Anil

ఈ పండుగ సీజన్‌లో కారు కొనాలని ఎంతో మంది ఇండియన్స్ ప్లాన్ చేసుకొని ఉంటారు. అయితే ధరను ప్రాతిపదికగా చేసుకుని ఎక్కువ మంది హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకుంటారు. ఒక రంగా చెప్పాలంటే ఇండియన్ రోడ్లకు హ్యాచ్‌బ్యాక్ కార్లే బెటర్.

అయితే పది లక్షల బడ్జెట్ ధరలో ఉన్న ఐదు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

టాటా టియాగో

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసిన తొలి మోడల్ టాటా టియాగో. దీనిని 5 నుండి 10 లక్షల ధరల శ్రేణిలో కోరుకునే వారు ఎంచుకోగలరు. 2015లో విడుదలైన టియాగో మార్చి 2016 వరకు నిలకడైన విక్రయాలు సాధిస్తూనే వచ్చింది.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

అనతి కాలంలోనే మార్కెట్లో ఉన్న మారుతి సెలెరియో, గ్రాండ్ ఐ10, రెనో క్విడ్ 1.0-లీటర్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలిచింది. టాటా లైనప్‌లో ఇది వరకు ఉన్న మరే ఇతర మోడళ్ల డిజైన్‌లతో పోల్చినా టియాగో డిజైన్ అద్భుతంగా ఉంటుంది.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

సామాన్యులను ఆకట్టుకునే ఫ్రంట్ డిజైన్, విశాలమైన క్యాబిన్, అధునాతన ఇంటీరియర్ ఫీచర్స్‌తో పాటు 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఉంది. టాటా టియాగో ధరల శ్రేణి రూ. 3.21 లక్షల నుండి రూ. 5.64 లక్షల మధ్య ఉంది.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

2013 లో విడుదలైన గ్రాండ్ ఐ10 హ్యుందాయ్ మోటార్స్ యొక్క మోస్ట్ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. మరియు 2014 లో భారతదేశపు ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2014 అవార్డును హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సొంతం చేసుకుంది.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇయాన్ తరువాత స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ10 లో ఎన్నో ఇంటీరియర్ ఫీచర్స్ అందించింది. ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధానంగా నిలిచింది.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారును 1.2-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధరల శ్రేణి రూ. 4.59 లక్షల నుండి 7.30 లక్షల మధ్య ఉంది.

Trending On DriveSpark Telugu:

డిస్క్ బ్రేకుల్లో బ్రేక్ ప్యాడ్స్ మార్చకపోతే ఏమవుతుంది..?

ఆ కంపెనీ టూ వీలర్లను ఒక్క రోజులో 3 లక్షలకు పైగా కొనేశారు

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

మారుతి సుజుకి బాలెనో

ఇది వరకు హ్యాచ్‍‌బ్యాక్ వెర్షన్ కార్లను చూశాము, ఇప్పుడు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ కార్లను చూద్దాం రండి... మారుతి సుజుకి నుండి 2015 లో మార్కెట్లోకి విడుదలైన మోస్ట్ సక్సెఫుల్ మోడల్ బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లకు గట్టి పోటీనిచ్చే బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మీద 12 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. లగ్జరీ ఫీల్ కలిగించే బాలెనో ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేయగల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

మారుతి బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును. ఈ ఏడాది ప్రారంభంలో మారుతి తమ బాలెనో కారును ఆర్ఎస్ పర్ఫామెన్స్ వేరియంట్‌ను 1-లీటర్ మూడు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కూడా కలదు. మారుతి సుజుకి బాలెనో ధరల శ్రేణి రూ. 5.26 లక్షల నుండి 8.42 లక్షల మధ్య ఉంది.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

వోక్స్‌వ్యాగన్ పోలో

టాప్ 5 హ్యాచ్‌బ్యాక్ కార్లలో వోక్స్‌వ్యాగన్ పోలో అత్యంత శక్తివంతమైనది. వోక్స్‌వ్యాగన్ ఈ మధ్యనే శక్తివంతమైన నెక్ట్స్ జనరేషన పోలో హ్యాచ్‌బ్యాక్‌ను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. వచ్చే ఏడాది జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శనకు రానుంది.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ప్రపంచ వ్యాప్తంగా‌ మోస్ట్‌ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారుగా పేరుగాంచిన వోక్స్‌వ్యాగన్ పోలో ఇండియన్ మార్కెట్లో కాస్త ధరతో కూడుకున్న మోడల్. అయితే, ధరకు తగ్గ విలువలతో అత్యుత్తమ ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

వోక్స్‌వ్యాగన్ పోలో కారును 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ వేరియంట్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు. వోక్స్‌వ్యాగన్ పోలో ధరల శ్రేణి రూ. 5.47 లక్షల నుండి 9.67 లక్షల మధ్య ఉంది.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హోండా జాజ్

హోండా మోటార్స్ జాజ్ కారులోని ఎన్నో మార్పులు చేర్పులు చేసి 2015లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేసి మంచి సక్సెస్ అందుకుంది. అయితే, అంతకు ముందు ఆశించిన ఫలితాలు సాధించలేదని 2013లో హోండా జాజ్‌ను మార్కెట్ నుండి తొలగించింది. అయితే అద్భుతమైన ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌ మార్పులు జాజ్‌ను మరింత ఆకర్షణీయంగా మలిచాయి.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

2015 హోండా జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజల్ మరియు 1.2-లీటర్ కెపాసిటి గల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్‌లతో లభించును. పెట్రోల్ వేరియంట్ జాజ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

అదే విధంగా జాజా డీజల్ వేరియంట్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే ఎంచుకోవచ్చు. ఏఆర్ఏఆ ప్రకారం, జాజ్ డీజల్ వెర్షన్‌ లీటర్‌కు 27.3కిమీల మైలేజ్ ఇవ్వగలదు. హోండా జాజ్ ధరల శ్రేణి రూ. 5.89 లక్షల నుండి రూ. 9.19 లక్షల మధ్య ఉంది.

అన్ని కార్ల ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Top 5 Hatchbacks Under Rs 10 Lakh You Can Buy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X