2017 జెనీవా మోటార్ షో లో ప్రదర్శించబడిన అన్ని కార్ల గురించి తెలుగులో - పార్ట్ 1

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కార్ల తయారీ సంస్థలన్నీ నూతన ఆవిష్కరణలను జెనీవా మోటార్ షో వేదికగా ప్రదర్శిస్తాయి. మార్చి 07 మరియు 08 వ తేదీలలో జరిగిన అన్నికొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు మీ కోసం....

By Anil

ప్రపంచంలో అతి ముఖ్యమైన వాహన ప్రదర్శన వేదికలలో జెనీవా మోటార్ షో ఒకటి. ప్రతి ఏటా స్విట్జర్లాండులో నిర్వహించే వాహన ప్రదర్శన వేదిక మీద మార్చి 07 మరియు 08 వ తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్ల తయారీ సంస్థలు అద్బుతమైన వాహనాలను ప్రదర్శించారు. ఇప్పుడు మార్చి 09 నుండి 19 వరకు వేదిక మీద ఆవిష్కరించిన అన్ని వాహనాలను ప్రజా సందర్శనకు సిద్దం చేశారు.

2017 జెనీవా మోటార్ షో

సుమారుగా గత 86 సంవత్సరాల నుండి ఈ వాహన ప్రదర్శనను ఐరోపాలోని స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న జెనీవా నగర వేదిక నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది 87వ వాహన ప్రదర్శన. ఎప్పటిలాగే కార్ ఆఫ్ ది ఇయర్ గా ఓ అత్యుత్తమ వాహనాన్ని జెనీవా మోటార్ షో అధికారులు ఎన్నుకుంటారు. అయితే 2017 జెనీవా మోటార్ షో కార్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు ప్యూజో 3008 ను వరిచించింది.

2017 జెనీవా మోటార్ షో

ఈ వాహన ప్రదర్శన వేదిక మీద ప్రపంచ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో, బిఎమ్‌డబ్ల్యూ, బుగాటి, అబర్త్, టయోటా, వోక్స్‌వ్యాగన్, లెక్సస్, ప్యూజో, స్కోడా, కియా మోటార్స్, మసేరాటి, హ్యుందాయ్, రేంజ్ రోవర్, లతో పాటు మారుతి సుజుకి మరియు టాటా మోటార్స్ కూడా తమ భవిష్యత్ ఉత్పత్తులను ఆవిష్కరించాయి. 2017 మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడిన కొత్త కార్లు గురించి ఇవాల్టి కథనంలో చూద్దాం రండి...

1. వోక్స్‌‌వ్యాగన్ సెడ్రిక్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యాన్

1. వోక్స్‌‌వ్యాగన్ సెడ్రిక్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యాన్

ప్రపంచ వ్యాప్తంగా స్వయం చాలక మరియు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేస్తోన్న సంస్థలకు బుర్రలకు అంతు పట్టని రీతిలో వోక్స్‌వ్యాగన్ తమ సెల్ఫ్ డ్రైవింగ్ సెడ్రిక్ హైబ్రిడ్ వ్యాన్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా అటానమస్ వాహనం. ఇందులో పెడల్స్, స్టీరింగ్ వీల్ వంటి ఎలాంటి పరికరాలు ఉండవు. ఇది కాన్సెప్ట్ దశలో ఉన్న వోక్స్‌వ్యాగన్ తెలిపింది.

వోక్స్‌ వ్యాగన్ ఫోటోల కోసం.....

2. లాంబోర్గిని హురాకాన్

2. లాంబోర్గిని హురాకాన్

ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గిని 2017 జెనీవా మోటార్ షో వేదిక మీ తమ శక్తివంతమైన హురాకాన్ కారును ఆవిష్కరించింది. కేవలం 2.9 సెకండ్ల కాల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ల గల ఇందులో 5.2-లీటర్ సామర్థ్యం గల వి10 ఇంజన్ కలదు.

లాంబోర్గిని హురాకాన్ ఫోటోల కోసం....

3. హోండా సివిక్ టైప్-ఆర్

3. హోండా సివిక్ టైప్-ఆర్

జపాన్ కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ తమ సివిక్ టైప్-ఆర్ ప్రొడక్షన్ వేరియంట్‌ను ఈ వేదిక మీద ఆవిష్కరించింది. గతంలో దీనిని 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రపంచ ప్రదర్శనకు తీసుకొచ్చింది.

హోండా సివిక్ టైప్-ఆర్ ఫోటోల కోసం....

4. స్కోడా ఆక్టావియా విఆర్ఎస్ 245

4. స్కోడా ఆక్టావియా విఆర్ఎస్ 245

సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా స్విట్జర్లాండులో జరిగిన 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద అత్యంత శక్తివంతమైన ఆక్టావియా వెర్షన్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్భో చార్జ్‌డ్ ఇంజన్ 242బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

స్కోడా ఆక్టావియా ఫోటోల కోసం.....

5. సుబారు ఎక్స్‌వి

5. సుబారు ఎక్స్‌వి

జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ సుబార్ నూతన అంతర్జాతీయ ఫ్లాట్‌మీద అభివృద్ది చేసిన క్రాసోవర్ వాహనం సుబార్ ఎక్స్‌వి ని ఆవిష్కరించింది. ఆల్ వీల్ డ్రైవ్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇందులో 2.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

సుబారు ఎక్స్‌వి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

6. 2017 కియా పికంటో

6. 2017 కియా పికంటో

కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీయంగా విడుదల చేయనున్న మొదటి ఉత్పత్తి కియా పికంటో హ్యాచ్‌బ్యాక్‌ను 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది. ఇందులో 1.0-లీటర్, 1.25-లీటర్ మరియు 1.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ ఆప్షన్ల‌తో అందుబాటులో ఉన్నట్లు కియా ప్రతినిధులు పేర్కొన్నారు.

2017 కియా పికంటో ఫోటోల కోసం....

7. హ్యుందాయ్ ఎఫ్ఇ ఫ్యూయల్ సెల్

7. హ్యుందాయ్ ఎఫ్ఇ ఫ్యూయల్ సెల్

దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ జెనీవా వాహన ప్రదర్శన వేదికగా తమ తరువాత తరం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎస్‌యూవీ ఎఫ్ఇ ఫ్యూయల్ సెల్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. దీనిని 2018 నాటికి అంతర్జాతీయ విపణిలోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ ఎఫ్ఇ ఫ్యూయల్ సెల్ ఫోటోల కోసం......

8. ఆడి క్యూ8 స్పోర్ట్స్ కాన్సెప్ట్

8. ఆడి క్యూ8 స్పోర్ట్స్ కాన్సెప్ట్

ఆడి ఎస్‌యూవీ రేంజ్‌లో టాప్ ఆఫ్ ది మోడల్‌గా నిలిచే క్యూ8 స్పోర్టివ్ వేరియంట్‌ను కాన్సెప్ట్ రూపంలో ఆడి 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది. ఇందులో అందించిన శక్తివంతమైన 3.0-లీటర్ సామర్థ్యం గల టర్బో చార్జ్‌డ్ వి6 పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో గరిష్టంగా 470బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ఆడి క్యూ8 స్పోర్ట్స్ కాన్సెప్ట్ SUV ఫోటోల కోసం.....

9. టాటా టామో రేస్‌మో

9. టాటా టామో రేస్‌మో

టాటా మోటార్స్ ప్రారంభించిన టామా బృందం అతి తక్కువ కాలంలోనే ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని రేస్‌మే అనే కూపే స్పోర్ట్స్ కారును అభివృద్ది చేసింది. 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ గల దీనిని జెనీవా వేదిక మీద ప్రదర్శించింది. ఈ ఆవిష్కరణ ప్రపంచ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజాలన్నీ ఉలిక్కిపడ్డాయని చెప్పవచ్చు.

టాటా టామో రేస్‌మో స్పోర్ట్స్ కూపే కారు యొక్క మరిన్ని ఫోటోల కోసం....

10. మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి కాన్సెప్ట్

10. మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి కాన్సెప్ట్

2017 జెనీవా వేదిక మీద అందిరీ కళ్లూ దీనిమీదే అని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అభివృద్ది చేసిన నాలుగు డోర్లే ఏఎమ్‌జి జిటి కాన్సెప్ట్ హైబ్రిడ్ సెడాన్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల 4-లీటర్ ట్విన్ టుర్బో వి8 ఇంజన్ గరిష్టంగా 804బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేస్తుందని మెర్సిడెస్ పేర్కొంది.

మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి కాన్సెప్ట్ సెడాన్ కారుకు సంభందించిన మరిన్ని ఫోటోల కోసం.....

11. వోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్

11. వోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ లైనప్‌లో ఉన్న సరికొత్త 4-సిరీస్ గ్రాన్ కూపే కారుకు పోటీగా వోక్స్‌వ్యాగన్ తమ ఆర్టియాన్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆధునిక ఆర్టియాన్ లో 276బిహెచ్‌గపి పవర్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టిఎస్ఐ ఇంజన్ అందివ్వడం జరిగింది.

వోక్స్ వ్యాగన్ ఆర్టియాన్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

12. పినిన్ఫారినా ఫిట్టిపాల్డి ఇఎఫ్7 విజన్ గ్రాన్ టురిస్మొ

12. పినిన్ఫారినా ఫిట్టిపాల్డి ఇఎఫ్7 విజన్ గ్రాన్ టురిస్మొ

మహీంద్రా సొంతం చేసుకున్న ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ పినిన్ఫారినా డిజైన్ బృందం ఫిట్లిపాల్డి ఇఎఫ్7 విజన్ గ్రాన్ టురిస్మొ కాన్సెప్ట్ స్పోర్ట్స్ సూపర్ కారును 2017 జెనీవా వేదిక మీద సూపర్ కార్ల విభాగంలో ఆవిష్కరించింది. ఇందులో 592బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల అత్యంత శక్తివంతమైన 4.6-లీటర్ సామర్థ్యం ఉన్న వి8 ఇంజన్ కలదు.

పినిన్ఫారినా ఫిట్టిపాల్డి ఇఎఫ్7 విజన్ గ్రాన్ టురిస్మొ సూపర్ కార్ ఫోటోల కోసం....

13. మెక్‌లారెన్ 720ఎస్

13. మెక్‌లారెన్ 720ఎస్

టార్క్ కార్ల తయారీలో బాగా చెయ్యి తిరిగిన మెక్‌లారెన్ 2017 జెనీవా మోటార్ షోను వేదికగా చేసుకుని అత్యంత శక్తివంతమైన మెక్‌లారెన్ 720ఎస్ సూపర్ కారును ఆవిష్కరించింది, మునుపటి తరం కార్ల కన్నా ఇది తక్కువ బరువును కలగి ఉంటూ శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌తో పరిచయం అయ్యింది.

మెక్‌లారెన్ 720 ఎస్ కారు యొక్క మరిన్ని ఫోటోల కోసం....

14. పోర్షే పానమెరా స్పోర్ట్ టురిస్మొ

14. పోర్షే పానమెరా స్పోర్ట్ టురిస్మొ

పోర్షే కార్ల తయారీ దిగ్గజం 4+1 సీటింగ్ సామర్థ్యం తో విభిన్నమైన రియర్ డిజైన్ ప్రొఫైల్‌తో పానమెరా స్పోర్ట్ టురిస్మొ కారును ఆవిష్కరించింది. ఇందులో 3.0-లీటర్ల సామర్థ్యం ఉన్న ఆరు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 327బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

పోర్షే పానమెరా స్పోర్ట్ టురిస్మొ ఫోటోల కోసం....

15. ఆస్టన్ మార్టిన్ వాల్కైర్

15. ఆస్టన్ మార్టిన్ వాల్కైర్

గతంలో ఆస్టన్ మార్టిన్ మరియు రెడ్‌బుల్ సంయుక్తంగా ఏఎమ్-ఆర్‌బి 001 కోడ్ పేరుతో ఓ హైపర్ కారును అభివృద్ది చేశాయి. దానిని ఇప్పుడు 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద వాల్కైర్ పేరుతో ఆవిష్కరించింది. ఇందులో 6.5-లీటర్ సామర్థ్యం గల వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలదు.

ఆస్టన్ మార్టిన్ వాల్కైర్ ఫోటోల కోసం....

2017 జెనీవా మోటార్ షో

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించిన మరిన్ని కార్లను పార్ట్ - 2 కథనం ద్వారా తెలియజేస్తాము. జెనీవా వాహన ప్రదర్శన వేదిక ప్రదర్శింపబడిన మరిన్ని ఇతర కార్ల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Top Cars From The 2017 Geneva Motor Show
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X