2020 నాటికి దేశీయ విపణిలోకి టయోటా ఎలక్ట్రిక్ కార్లు

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ విడుదల గురించిన ప్రణాళికలు వెల్లడించింది.

By Anil

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ విడుదల గురించిన ప్రణాళికలు వెల్లడించింది. 2020 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించింది.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

టయోటా తమ ఎలక్ట్రిక్ కార్లను ముందుగా చైనా విపణిలో లాంచ్ చేసి, ఆ తరువాత ఇండియా, అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. 2030 నాటికి 10 లక్షల బ్యాటరీ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 55 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే అవకాశాలున్నట్లు టయోటా పేర్కొంది.

Recommended Video

BSA Motorcycles India Launch Rumour Shared By Anand Mahindra - DriveSpark
టయోటా ఎలక్ట్రిక్ కార్లు

2020-2030 మధ్య కాలానికి సంభందించిన తమ ప్రణాళికలను టయోటా వెల్లడించింది. ఈ పదేళ్ల కాలంలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు, బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అభివృద్ది మరియు తయారీ మీద దృష్టిసారించనుంది.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

ఇదే కాలంలో లెక్సస్ విక్రయించే మొత్తం వేరియంట్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపట్టే ఆలోచనలో ఉంది. ప్రపంచ బయో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ విషయలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు టయోటా ప్రయత్నిస్తోంది. 2020 చివరి నాటికి సుమారుగా 10 రకాల బయో ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసే లక్ష్యంతో ఉంది.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

టయోటా విడుదల చేసిన ఓ ప్రకటనలో, "బయో ఎలక్ట్రిక్ కార్లను ముందుగా చైనా మార్కెట్‌కు పరిచయం చేసి, తరువాత డిమాండ్ మరియు ఆదరణ అంచనా వేసుకుని మెల్లమెల్లగా జుపాన్, ఇండియా, అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది."

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

అంతే కాకుండా, 2025 నాటికి టయోటా మరియు లెక్సస్ విక్రయించే అన్ని మోడళ్లు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉంచడం లేదంటే తమ కార్లను ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌లో ఎంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.

Trending On DriveSpark Telugu:

కారు స్టార్ట్ కాకపోవడానికి గల రీజన్స్

డీలర్ల వద్ద పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన స్కూటర్లు మరియు బైకులు

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రత్యేకమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వీలైనంత త్వరగా అభివృద్ది చేసి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో వీలవుతుంది.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని టయోటా మరియు సుజుకి మధ్య తాజాగా జరిగిన ఒప్పందంలో ఎలక్ట్రిక్ కార్ల గురించి టయోటా తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయాలకు అనుమతించాలనే భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టయోటా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Toyota To Launch Electric Car In India — Here Are The Details
Story first published: Wednesday, December 27, 2017, 10:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X