భారత్‌లో సురక్షితమైన కార్లు ఇవే: మీరు ఎంచుకున్న కారు ఈ జాబితాలో ఉందా...?

ఒక మోడల్ కారును 100 యూనిట్ల చొప్పున విక్రయించిన అనంతరం అందులో ఎన్ని సమస్యల నమోదయ్యాయి అనే అంశం ఆధారంగా ఆ మోడల్ యొక్క నాణ్యతపరమైన రేటంగ్ లెక్కగడతారు. ఈ ఏడాది జెడి పవర్ జాబితాలో చోటు దక్కించుకున్న కార్ల

By Anil

జెడి పవర్, గ్లోబల్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ. ఇది ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల సంతృప్తి మరియు ఉత్పత్తుల నాణ్యత గురించి పలు సర్వేలు నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా జెడి పవర్ అంటే, కొత్త కార్లు మరియు ధీర్ఘకాలికంగా కార్లను వినియోగించే కస్టమర్ల సంతృప్తిని అధ్యయనం చేసే సంస్థగా పేరుగాంచింది.

జెడి పవర్ కొత్త కార్ల నాణ్యత కోసం ప్రాథమిక నాణ్యతపరమైన అధ్యయనం(IQS) చేస్తుంది. ఈ అధ్యయనం విక్రయించిన 100 కార్లలో ఎన్ని సమస్యలు తలెత్తాయి అనే అంశం ఆధారంగా ఉంటుంది. విక్రయించిన కార్లు మరియు వాటిలో తలెత్తిన సమస్యలు మధ్య నిష్పత్తి ఆధారంగా ప్రతి కారు యొక్క ఇన్షియల్ క్వాలిటీ స్టడీ(IQS) నివేదికను రూపొందిస్తుంది.

Recommended Video

[Telugu] Tata Nexon Review: Specs
భారత్‌లో సురక్షితమైన కార్లు

అంటే ఒక మోడల్ కారును 100 యూనిట్ల చొప్పున విక్రయించిన అనంతరం అందులో ఎన్ని సమస్యల నమోదయ్యాయి అనే అంశం ఆధారంగా ఆ మోడల్ యొక్క నాణ్యత లెక్కగడతారు. మరి నేటి జాబితాలో జెడి పవర్ అధ్యయనం మేరకు ఏవి బెస్ట్ కార్లో చూద్దాం రండి...

భారత్‌లో సురక్షితమైన కార్లు

ప్యాసింజర్ కార్ల విభాగంలోని వాహనాలను పలు కెటగిరీలుగా విభజించి అందులో ఉన్న మోడళ్లకు రేటింగ్ ఇచ్చింది. వీటిలో ఎంట్రీ కాంపాక్ట్, కాంపాక్ట్, అప్పర్ కాంపాక్ట్, ప్రీమియమ్ కాంపాక్ట్, ఎంట్రీ మిడ్ సైజ్, మిడ్ సైజ్, ఎమ్‌పీవీ మరియు ఎస్‌యూవీ. ఒక్కె కెటగిరీ వారీగా జెడి పవర్ రేటింగ్ ఇచ్చిన కారు గురించిన వివరాలు...

భారత్‌లో సురక్షితమైన కార్లు

ఎంట్రీ కాంపాక్ట్

మిగతా అన్ని సెగ్మెంట్లతో పోల్చుకుంటే ఎంట్రీ కాంపాక్ట్ 121 పాయింట్ల రేటింగ్‌తో చాలా దారుణమైన ఫలితాలు నమోదు చేసుకుంది. ఇందులో వరుసగా మారుతి సుజుకి ఆల్టో 800 103 పాయింట్లు, హ్యుందాయ్ ఇయాన్ 106, డాట్సన్ రెడి-గో 107 పాయింట్లతో వరుసగా ఉన్నాయి.

ఇదే సెగ్మెంట్లో ఉన్న క్విడ్ 100 కార్లకు 168 పాయింట్లను దక్కించుకుని ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

భారత్‌లో సురక్షితమైన కార్లు

కాంపాక్ట్

కాంపాక్ట్ సెగ్మెంట్ ఓవరాల్ రేటింగ్ 110 పాయింట్లుగా ఉంది. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 85 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సెలెరియో 85 పాయింట్లతో రెండవ, మారుతి ఆల్టో కె10 110 పాయింట్లతో వరుసగా మూడవ స్థానంలో నిలిచాయి.

కాంపాక్ట్ సెగ్మెంట్లో మారుతి సుజుకి కార్లే ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.

భారత్‌లో సురక్షితమైన కార్లు

అప్పర్ కాంపాక్ట్

ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లకు 71, ఎటియోస్ లివా మరియు ఎటియోస్ క్రాస్ కార్లకు 76 పాయింట్లు లభించాయి. 100 కు 76 పాయింట్లతో అప్పర్ కాంపాక్ట్ సెగ్మెంట్ అత్యుత్తమ ఫలితాలు సాధించింది.

అన్ని సెగ్మెంట్లలోకెల్లా అప్పర్ సెగ్మెంట్లో ఉన్న కార్లు అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. హ్యాచ్‌బ్యాక్ కార్ల నిర్మాణ నాణ్యతతో అప్పర్ కాంపాక్ట్ సెగ్మెంట్లో ఉన్న మోడళ్లు అత్యుత్తమ రేటింగ్ సాధించింది.

భారత్‌లో సురక్షితమైన కార్లు

ప్రీమియమ్ కాంపాక్ట్

ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్్ సెగ్మెంట్లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో వోక్స్‌వ్యాగన్ పోలో, పోలో జిటి వేరియంట్లు మరియు క్రాస్ పోలో వంటివి ఉన్నాయి. వీటిలో పోలో 100 కు 69 పాయింట్లు, హ్యుందాయ్ ఎలైట్ ఐ20/ ఐ20 యాక్టివ్ 79 మరియు హోండా జాజ్ 93 పాయింట్లతో వరుసగా ఉన్నాయి.

భారత్‌లో సురక్షితమైన కార్లు

ఎంట్రీ మిడ్ సైజ్

అన్ని కార్ల పరంగా టయోటా ఎటియోస్ కారుకు అత్యుత్తమ రేటింగ్ లభించింది. 100 కు 56 పాయింట్లను నమోదు చేసుకుంది. ఈ ఫలితాలతో టయోటా అత్యుత్తమ నిర్మాణ విలువతో కార్లను తయారు చేస్తోందని చెప్పడానికి దీనిని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లయిన హ్యుందాయ్ ఎక్సెంట్ 70 మరియు హోండా అమేజ్ భారీగా పతనం చెంది 31 పాయింట్లు నష్టపోయింది.

భారత్‌లో సురక్షితమైన కార్లు

మిడ్ సైజ్ సెడాన్

ఫోర్ వీలర్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఎక్జ్సిక్యూటివ్ సెగ్మెంట్ ఎస్‌యూవీలతో గట్టి పోటీని ఎదుర్కుంటోంది. అయినప్పటికీ, మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో కొన్ని బెస్ట్ సెల్లింగ్ కార్లు ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన హ్యుందాయ్ వెర్నా మరియు హోండా సిటి 70 పాయింట్లు, వోక్స్‌వ్యాగన్ వెంటో 73 పాయింట్లను సాధించుకుంది.

భారత్‌లో సురక్షితమైన కార్లు

ఎమ్‌పీవీ

టయోటా ఈ సెగ్మెంట్లో మళ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా 77 పాయింట్లు, మహీంద్రా బొలెరో 86, మారుతి సుజుకి ఎర్టిగా 103 పాయింట్లను నమోదు చేసుకున్నాయి. 2016తో పోల్చుకుంటే మారుతి ఎర్టిగా సుమారు 38 పాయింట్లను నష్టపోయింది.

భారత్‌లో సురక్షితమైన కార్లు

ఎస్‌యూవీ

ఇండియన్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో గత ఏడాది రెనో డస్టర్ టాప్ ర్యాంక్ సొంతం చేసుకోగా ఈ ఏడాది మారుతి సుజుకి ఎస్-క్రాస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. క్రెటా గత కూడా అవే ఫలితాలను సాధించింది. అయితే, ఎస్-క్రాస్ ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. మూడవ మరియు నాలుగవ స్థానంలో వరుసగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలు నిలిచాయి.

భారత్‌లో సురక్షితమైన కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

గత కొన్ని సంవత్సరాల నుండి భారతీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమ నాణ్యత పరంగా చాలా వరకు మెరుగైన ఫలితాలను సాధించిందని జెడి పవర్ పేర్కొంది. ఏదేమైనప్పటికీ కార్లలోని ఏ/సి సిస్టమ్‌లో తలెత్తే సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ కస్టమర్లు ఏ/సి వ్యవస్థల పనితీరు గురించి రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఏ/సి గురించిన ఫిర్యాదులు 15 నుండి 22 పాయింట్లకు పెరిగాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Etios Leads From The Front When It Comes To Quality — Find Out Why!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X