విపణిలోకి విడుదలైన వోల్వో ఎక్స్‌సి60: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

వోల్వో ఇండియా విభాగం విపణిలోకి ఎక్స్‌సి60 లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త వోల్వో ఎక్స్‌‌సి60 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 55.90 లక్షలుగా ఉంది.

By Anil

వోల్వో ఇండియా విభాగం విపణిలోకి ఎక్స్‌సి60 లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త వోల్వో ఎక్స్‌‌సి60 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 55.90 లక్షలుగా ఉంది. వోల్వో తమ నూతన స్కేలబుల్ ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్(SPA) ఫ్లాట్‌ఫామ్ మీద ఈ కొత్త తరం ఎస్‌యూవీని అభివృద్ది చేసింది.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

విపణిలో ఉన్న మునుపటి ఎక్స్‌సి60 స్థానంలో సెకండ్ జనరేషన్ మోడల్‌గా నూతన ఎక్స్‌సి60 లాంచ్ అయ్యింది. ఇది కేవలం ఇన్‌స్క్రిప్షన్ అనే ఒక్క వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. పాత వెర్షన్ వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీ 2011 నుండి ఇండియన్ మార్కెట్లో విక్రయాల్లో ఉంది.

Recommended Video

Bangalore City Police Use A Road Roller To Crush Loud Exhausts
వోల్వో ఎక్స్‌సి60 విడుదల

సరికొత్త వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీ మార్కెట్లో ఉన్న ఆడి క్యూ5, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, జాగ్వార్ ఎఫ్-పేస్ మరియు అప్ కమింగ్ లెక్సస్ ఎన్ఎక్స్300హెచ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

సాంకేతికంగా వోల్వో ఎక్స్‌సి60 వాహనంలో 1,969సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 233బిహెచ్‌పి పవర్ మరియు 1,750-2,250ఆర్‌పిఎమ్ మధ్య 480ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

ఈ శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 8-స్పీడ్ గేర్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గుండా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

వోల్వో తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎక్స్‌సి90 ఆధారంగానే ఈ ఎక్స్‌సి60 మోడల్‌ను డిజైన్ చేసింది. వోల్వో సిగ్నేచర్ మల్టీ స్లాట్ క్రోమ్ గ్రిల్, గ్రిల్‌కు ఇరువైపులా ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే థార్స్ హమ్మర్ ఎల్ఇడి లైట్లు వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

ఉలితో చెక్కిన ఫ్రంట్ బంపర్‌లో క్యారెక్టర్ లైన్స్, మధ్యలో గాలిని ఇంజన్‌కు చేరవేసే ఎయిర్ డ్యామ్, బంపర్‌కు ఇరు చివరల్లో క్రోమ్ తొడుగులు ఉన్న ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. మొత్తానికి, పాత మోడల్‌తో పోల్చుకుంటే ఈ సెకండ్ జనరేషన్ వోల్వో ఎక్స్‌సి60 డిజైన్ చాలా అడ్వాన్స్‌గా ఉంది.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

వోల్వో ఎక్స్‌సి60 పొడవు 4,688ఎమ్ఎమ్, వెడల్పు 1,902ఎమ్ఎమ్, ఎత్తు 1,658ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,865ఎమ్ఎమ్‌గా ఉంది. విశాలమైన షోల్డర్ లైన్స్, ప్రత్యేకాకర్షణగా నిలిచే క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

రియర్ డిజైన్‌లో కూడా వోల్వో అద్భుతమే చేసిందని చెప్పాలి. ఎక్స్‌సి90 తరహాలో నిలువుటాకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, చంకీ రియర్ బంపర్, క్రోమ్ సొబగులున్న రిఫ్లెక్టర్లు మరియు చతుర్జుజాకారంలో ఉన్న డ్యూయల్ క్రోమ్ ఎగ్జాస్ పైపులు ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

చర్ల విషయానికి వస్తే, వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీలో సెగ్మెంట్ ఫస్ట్ మెసేజ్ ఫంక్షనాలిటీ గల కోల్డ్/హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కోణంలో ఉన్న కెమెరా, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, సెమి ఆటోమేటిక్ పార్కింగ్ మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అంశాల్లో డ్రైవర్‌కు సహకరించేందుకు 9.0-అంగుళాల పరిమాణం గల సెంటర్ సెన్సస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

వోల్వో ఎక్స్‌సి60 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోల్వో తమ సెకండ్ జనరేషన్ ఎక్స్‌సి60 పరిచయం లగ్జరీ ఫీల్ కొత్త అంచులకు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ మరియు పోటీదారులను ఎదుర్కునేలా ఉన్న ధర వంటివి వోల్వో ఎక్స్‌సి60 లగ్జరీ ఎస్‌యూవీకి బాగా కలిసి రానున్నాయి. మొత్తానికి జర్మన్ లగ్జరీ కార్ల సంస్థలకు వోల్వో దడ పుట్టించనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Volvo XC60 Launched In India; Priced At Rs 55.90 Lakh
Story first published: Tuesday, December 12, 2017, 20:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X