వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుందో తెలుసా?

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల భద్రతలో భాగంగా IND అనే పదాన్ని నెంబర్ ప్లేట్‌లో పొందుపరిచారు. మోటార్ వాహనాల చట్టం 1989లో 2005 చట్టసవరణ ద్వారా ఈ హై సెక్యూరిటీ వెహికల్ నెంబర్ ప్లేట్లను భారత ప్రభుత్వం పరిచ

By Anil

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల భద్రతలో భాగంగా IND అనే పదాన్ని నెంబర్ ప్లేట్‌లో పొందుపరిచారు. మోటార్ వాహనాల చట్టం 1989లో 2005 చట్టసవరణ ద్వారా ఈ హై సెక్యూరిటీ వెహికల్ నెంబర్ ప్లేట్లను భారత ప్రభుత్వం పరిచయం చేసింది.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

అధిక భద్రతా రిజిస్ట్రేషన్ ప్లేట్ల వెనకున్న ప్రధాన ఉద్దేశం భద్రత. కరెన్సీ నోట్ భద్రత తరహాలో ఈ నెంబర్ నెంబర్ ప్లేట్లలో హై సెక్యూరిటీ లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఇది ట్యాంప్ ప్రూఫ్(ప్లేట్ మీద ఉన్న నెంబర్ తొలగించ సాధ్యం కాదు) మరియు దీని అంచులను స్నాప్ లాక్‌తో తొలగించడానికి వీల్లేకుండా ఫిట్ చేస్తారు.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

ఈ హై సెక్యూరిటీ ప్లేటుకు నకిలీ ప్లేటును తయారు చేయడం అసంభవం, అసాధ్యం. రోడ్డు ప్రక్కన నెంబర్ ప్లేట్లను తయారు చేసే వారు కూడా ఈ స్నాప్ లాక్‌ను ఓపెన్ చేయలేరు.

Recommended Video

Bangalore City Police Use A Road Roller To Crush Loud Exhausts
వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

వాహన యాజమానులకు ఉపయోగకరంగా ఉండే ఈ హై సెక్యూరిటి నెంబర్ ప్లేట్లలో వెహికల్ ఓనర్ యొక్క సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఈ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను దొంగలు ఎత్తుకెళ్లినా కూడా ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఆధారంగా అధికారులు అసలు యజమాని ఎవరో గుర్తిస్తారు.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

ఈ నెంబర్ ప్లేట్ మీద పేటెంట్ పొందిన క్రోమియమ్ చక్రా హోలోగ్రామ్ ఉంటుంది. ఈ ప్లేట్ మీద ఆల్ఫా-న్యూమరిక్ ఐడింటిఫికేషన్ నంబరింగ్ సిస్టమ్ ఉంది. దీంతో తనికీ బృందం వివరాలను సులభంగా రాబడుతుంది.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

ఇండియా అనే ఆంగ్లపు పేరును వెహికల్ నెంబర్ మీద 45డిగ్రీల వాలు కోణంతో రెట్రోల్ రిఫ్లెక్టివ్ ఫిల్మ్‌తో ముద్రిస్తారు. దీని మీదకు కాంతి ప్రసరణ జరిగినపుడు నెంబర్ ప్లేట్ మీదున్న రిజిస్ట్రేషన్ నెంబర్ మీద గల ఇండియా అనే అక్షరాలు రిఫ్లెక్ట్ అవుతాయి.

Trending On DriveSpark Telugu:

ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి ? వివరంగా...!!

స్పేర్ వీల్‌ను స్టెప్నీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

కార్లపై యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్ అంటించడం వెనకున్న మిస్టరీ!

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

IND అనే అక్షరాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్‌ ప్లేట్ మీద ఎడమవైపున హోలో గ్రామ్ క్రింది వైపున నీలం రంగులో ముంద్రించబడి ఉంటుంది. ఇది 1ఎమ్ఎమ్ మందం గల అల్యూమినియంతో ప్రింట్ చేయబడి ఉంటుంది.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటును వాహనానికి ముందు మరియు వెనుకవైపున స్నాప్ లాక్ ద్వారా ఫిక్స్ చేస్తారు. దీనికి నకిలీ సృష్టించడం మరియు ఈ నెంబర్ ప్లేటును మరో వాహనంలో వాడుకోవడానికి వీల్లేకుండా చేసే ఉద్దేశంతో స్నాప్ లాక్‌ను ఉపయోగిస్తారు.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు చూడటానికి ఒక యూనిఫామ్ లుక్‌లో అచ్చం ఫారిన్ కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్ తరహా ఉంటాయి. అయితే, ఏదేశానికి అవి విభిన్నంగా ఉంటాయి. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఎక్కువగా ఉండటంతో అంకెలను తమ తమ భాషల్లో రాయించడం మరియు దేవనాగరి లిపిలో ఉన్న నెంబర్లను వాడుతుంటారు.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

ఇలా చేయడం చట్టవ్యతిరేకం. నిజానికి మన దేశంలో వాహనాదారులందరూ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను వినియోగించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ఉపయోగించడం లేదు. వీటిని రవాణా శాఖ కార్యాలయాల్లో తగిన రుసుము చెల్లించి పొందవచ్చు.

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుంది

మీ వాహనాలకు పాత నెంబర్ ప్లేట్ సిస్టమ్ ఉంటే వాటి స్థానంలో నూతన హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తీసుకోండి. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకు తప్పనిసరి. అంతే కాకుండా పోలీసులు మరియు ఆర్‌టిఓ అధికారులకు వాహనాల నెంబర్ ప్లేట్లను తనిఖీ చేసే అధికారం ఉంది. కాబట్టి సంభందిత అధికారుల వద్ద హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను పొందండి.

ఈ కథనం పై మీ అభిప్రాయం క్రింది కామెంట్ సెక్షన్‌లో తెలుపగలరు...

Most Read Articles

English summary
Read In Telugu: why do vehicle number plates in india have ind written on them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X