12 కార్ల మీద భారీ డిస్కౌంట్ల: 1 నుండి 2 లక్షల వరకు తగ్గింపు

By Anil Kumar

మీరు డ్రీమ్ కారు కొనడానికి సమయం ఆసన్నమైంది. అవును, వర్షపు జల్లులతో మొదలైన ఈ జూన్ నెల భారీ డిస్కౌంట్ల వర్షం కురిపిస్తోంది. భారతదేశపు పలు బెస్ట్ సెల్లింగ్ కార్లు మరియు ఎస్‌యూవీల మీద లక్షల్లో ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.

మాన్‌సూన్ డిస్కౌంట్లు, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు ఉచిత ఇన్సూరెన్స్‌తో కలుపుకొని 12 కార్లు మరియు ఎస్‌యూవీల లక్ష నుండు రెండు లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఏయే మోడల్ మీద ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఓ లుక్కేసుకుందాం రండి....

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

12. హ్యుందాయ్ ఎక్సెంట్

కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తమ ఎక్సెంట్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గత ఏడాది విపణిలోకి విడుదలైన మారుతి సుజుకి డిజైర్ నుండి విపరీతమైన పోటీని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో తమ కాంపాక్ట్ సెడాన్ ద్వారా వీలైనంత వరకు సేల్స్ సాధించేందుకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ బోనస్ క్రింద మొత్తం రూ. 1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

11. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తమ మరో మోడల్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ మీద భారీ ఆఫర్లను ప్రకటించింది. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మెరుగైన సేల్స్ సాధించేందుకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ బోనస్ ద్వారా గరిష్టంగా లక్ష రుపాయల వరకు తగ్గింపు ప్రకటించింది.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

10. హోండా జాజ్

హోండా జాజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆకర్షణీయమైన ఆఫర్లతో లభ్యమవుతోంది. ప్రస్తుతం ఉన్న హోండా జాజ్ స్థానంలోకి అతి త్వరలో న్యూ జనరేషన్ హోండా జాజ్ పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో ఏకంగా లక్ష రుపాయల వరకు డిస్కౌంట్లతో పాటు ఉచిత యాక్ససరీలను కూడా అందిస్తోంది.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

09. స్కోడా సూపర్బ్

స్కోడా సూపర్బ్ లక్ష రుపాయల కంటే ఎక్కువ విలువైన ఆఫర్లతో లభ్యమవుతోంది. ఈ జూన్ నెలలో ఎంచుకునే కస్టమర్లకు రూ. 75,000 ల విలువైన మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్, రూ. 15,000 కార్పోరేట్ డిస్కౌంట్ మరియు నాలుగేళ్ల సర్వీస్ ప్యాకేజీ తగ్గింపు ధరతో లభిస్తోంది. వీటి మొత్తం విలువ సుమారుగా లక్ష కంటే ఎక్కువ.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

08. ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ మోటార్స్ అతి త్వరలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫిగో స్థానంలో నూతన ఫిగో కారును ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు ఎక్కువ సేల్స్ సాధించేందుకు మరియు స్టాకును క్లియర్ చేసుకునేందుకు ఫోర్డ్ ఫిగో మీద లక్ష రుపాయల విలువైన ఆఫర్లను ప్రకటించింది.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

07. ఫోర్డ్ ఆస్పైర్

ఫిగో హ్యాచ్‌బ్యాక్‌తో పాటు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌ను కూడా అతి త్వరలో అప్‌డేటెడ్ వెవర్షన్‌లో లాంచ్ చేయడానికి సిద్దమైంది. దీంతో ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ మీద కూడా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

06. వోక్స్‌వ్యాగన్ వెంటో

వోక్స్‌వ్యాగన్ వెంటో కంపెనీకి మంచి ఫలితాలే సాధించిపెడుతోంది.అయినప్పటీ, మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో పోటీని తట్టుకుని నిలబడేందుకు కంఫర్ట్‌లైన్ డీజల్ మరియు హైలైన్ పెట్రోల్ మినహా, మిగతా అన్ని వేరియంట్ల మీద లక్ష రుపాయల పైబడి ఆఫర్లను ప్రకటించింది. ఇందులో రూ. 60,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 40,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు రూ. 15,000 కార్పోరేట్ బోనస్ అందిస్తోంది.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

05. మారుతి సుజుకి సియాజ్

ప్రస్తుతం ఉన్న మారుతి సుజుకి సియాజ్ అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలవ్వనుంది. ఈ నేఫథ్యంలో స్టాకును క్లియర్ చేసుకునేందుకు సియాజ్ పెట్రోల్ వేరియంట్ల మీద రూ. 40,000 మరియు డీజల్ వేరియంట్ల మీద రూ. 70,000 డిస్కౌంట్ ప్రకటించింది. అదనంగా రెండింటి మీద రూ. 50,000 విలువైన ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

04. టాటా హెక్సా

టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా హెక్సా భారీ విజయాన్ని అందుకొంది. కస్టమర్ల నుండి ఎలాంటి కంప్లైట్లు లేకుండా విజయంవంతంగా అమ్ముడవుతున్న టాటా హెక్సా విపణిలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌డకు గట్టి పోటీనిస్తోంది. పలు టాటా డీలర్లు హెక్సా క్రాసోవర్ ఎస్‌యూవీ మీద లక్ష రుపాయల విలువైన ఆఫర్లను అందిస్తున్నారు.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

03. హోండా బిఆర్-వి

హోండా బిఆర్-వి మీద రూ. 1.26 లక్షల విలువైన ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 50,000. అదనంగా రూ. 50,000 విలువైన మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటు రూ. 26,000 విలువైన యాక్ససరీలను ఉచితంగా అందిస్తోంది.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

02. హోండా సిఆర్-వి

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం ఉన్న హోండా సిఆర్-వి స్థానంలో ఈ ఏడాది చివరికి నూతన సిఆర్-వి మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. అన్నింటి కంటే ప్రత్యేకించి, సిఆర్-వి ఆశించిన సేల్స్ సాధించడలేకపోతోంది. దీంతో హోండా సిఆర్-వి మీద డీలర్లు ఏకంగా రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు ప్రకటించారు.

బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద గొప్ప డిస్కౌంట్లు

01. రెనో క్యాప్చర్

బోనస్‌లు, డిస్కౌంట్లు కాదు రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ మీద సరాసరిగా రూ. 2 లక్షల రుపాయల తగ్గింపు ప్రకటించారు. రెనో క్యాప్చర్ లభించే అన్ని వేరియంట్లను ఎక్స్-షోరూమ్ ధర మీద 2 లక్షల రుపాయల తగ్గింపుతో ఎంచుకోవచ్చు. ధరల తగ్గింపు అనంతరం రెనో క్యాప్చర్ ధరకు తగ్గ విలువలు కలిగి ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: 12 cars and SUVs with 1 lakh and more Discounts: Maruti Ciaz to Tata Hexa
Story first published: Saturday, July 14, 2018, 17:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X