20 ఏళ్ల హోండా చరిత్రలో రికార్డులు తిరగరాసిన అమేజ్ కారు

By Anil Kumar

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన 2018 హోండా అమేజ్ భారీ విజయాన్ని అందుకొంది. వరుసగా మూడవ నెల అమ్మకాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. దీంతో హోండా మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా మొదటి స్థానంలో నిలిచింది.

2018 హోండా అమేజ్

గత 20 ఏళ్లలో కాలంలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ తరహా సక్సెస్ సాధించిన దాఖలాలు అస్సలు లేవు. కొత్తగా విడుదలై తొలి మూడు నెలల్లోపే 30,000 సేల్స్ మైలురాయిని అందుకున్న మొట్టమొదటి హోండా కారు ఇదే కావడం గమనార్హం.

2018 హోండా అమేజ్

ఏప్రిల్ - జూలై 2018 మధ్య కాలంలో కేవలం ఒక్క హోండా అమేజ్ విక్రయాల ద్వారానే హోండా కార్స్ సంస్థ యొక్క మొత్తం సేల్స్ వృద్ది 12.5 శాతం మేర పెరిగింది. అంతే కాకుండా, దేశీయ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి డిజైర్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ కార్లకు హోండా అమేజ్ తీవ్ర పోటీనిస్తోంది.

2018 హోండా అమేజ్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరక్టర్ మకోటో హ్యోడా మాట్లాడుతూ, "సరికొత్త హోండా అమేజ్ కారును పూర్తి స్థాయిలో ఒక నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. దీంతో ధరకు తగ్గ విలువలు, అధునాతన ఫీచర్లు, అత్యంత పోటీతత్వముతో కూడిన డిజైన్‌తో మార్కెట్లో ఉన్న ఇతర మోడళ్లకు గట్టిపోటీనివ్వగలిగింది."

2018 హోండా అమేజ్

అంతే కాకుండా, "ప్రతి ఇండియన్ కస్టమర్ కోరుకునే అంశాలను పొందుపరిచి, ఇండియన్ రోడ్లకు అనుగుణంగా అభివృద్ది చేయడంతో సరికొత్త 2018 హోండా అమేజ్ కారుకు కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. హోండా అమేజ్ భవిష్యత్తులో కంపెనీ యొక్క కీలకమైన ఉత్పత్తిగా రాణిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు."

2018 హోండా అమేజ్

2018 హోండా అమేజ్ మొత్తం విక్రయాల్లో పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజల్ ఆటోమేటిక్ కార్ల విక్రయాలు 30 శాతం నమోదయ్యాయి. అంతర్జాతీయ విపణిలో 2018 అమేజ్ కారు విడుదలైన మొదటి మార్కెట్ ఇండియా. దేశీయంగా టైర్ 1, 2 మరియు 3 నగరాల్లో హోండా అమేజ్‌కు మంచి స్పందన లభిస్తోంది.

2018 హోండా అమేజ్

సరికొత్త హోండా అమేజ్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఇ,ఎస్, వి మరియు విఎక్స్. హోండా అమేజ్‌లో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ప్యాసివ్ కీ లెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 హోండా అమేజ్

ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. భద్రత పరంగా రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా వచ్చాయి.

2018 హోండా అమేజ్

కొత్త తరం హోండా అమేజ్ సాంకేతికంగా అవే పాత ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. వీటిలో, 1.2-లీటర్ పెట్రోల్ వెర్షన్ 89బిహెచ్‌పి-110ఎన్ఎమ్ మరియు 1.5-లీటర్ డీజల్ వెర్షన్ 99బిహెచ్‌పి-200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

2018 హోండా అమేజ్

ఏఆర్ఏఐ మేరకు, అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • అమేజ్ పెట్రోల్ మ్యాన్యువల్ - 19.5 కిమీ/లీ
  • అమేజ్ పెట్రోల్ ఆటోమేటిక్ - 19.0 కిమీ/లీ
  • అమేజ్ డీజల్ మ్యాన్యువల్ - 27.4 కిమీ/లీ
  • అమేజ్ డీజల్ ఆటోమేటిక్ - 23.8 కిమీ/లీ
  • 2018 హోండా అమేజ్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    హోండా మోటార్స్ అమేజ్ కారును తొలుత రూ. 5,59,900 పరిచయాత్మక ధరతో ప్రవేశపెట్టింది. అయితే, ఆగష్టు 1, 2018 నుండి సవరించిన ధరల మేరకు అమేజ్‌లోని అన్ని వేరియంట్ల మీద రూ. 25,000 వరకు ధర పెరిగింది. అయితే ఈ ధరల పెంపు హోండా అమేజ్ సేల్స్ మీద ఏమాత్రం ప్రభావం చూపలేదు.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Honda Amaze breaks record
Story first published: Thursday, August 23, 2018, 13:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X