ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

ఈ ఏడాది మార్కెట్లోకి విడుదలైన కొన్ని కొత్త మోడళ్లు భారీ విజయాన్ని అందుకొన్నాయి. 2018 తొలిసగంలో ప్యాసింజర్ కార్ల విభాగం సాధించిన వృద్ది, మలిసగంలో మరికొన్ని కొత్త మోడళ్లను విడుదల చేసే దిశగా కంపెనీల్లో ఉ

By Anil Kumar

ఈ ఏడాది మార్కెట్లోకి విడుదలైన కొన్ని కొత్త మోడళ్లు భారీ విజయాన్ని అందుకొన్నాయి. 2018 తొలిసగంలో ప్యాసింజర్ కార్ల విభాగం సాధించిన వృద్ది, మలిసగంలో మరికొన్ని కొత్త మోడళ్లను విడుదల చేసే దిశగా కంపెనీల్లో ఉత్సాహాన్ని నింపింది. మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న కార్ల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి...

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ సంస్థ ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించినపుడు విడుదల చేసిన తొలి మోడల్ శాంట్రో. శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారుతో భారీ విజయాన్ని అందుకున్న హ్యుందాయ్ అనతి కాలంలో భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా నిలిచింది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

ఇటీవల కాలంలో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ అధికమవుతుండటంతో, గతంలో మార్కెట్ నుండి తొలగించిన శాంట్రో కారును రీలాంచ్ చేయడానికి హ్యుందాయ్ సన్నాహాలు ప్రారంభించింది. డిజైన్ మరియు ఫీచర్లు పరంగా భారీ మార్పులకు గురవుతున్న శాంట్రో విపణిలో ఉన్న మారుతి ఆల్టో మరియు రెనో క్విట్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

కొత్త తరం హ్యుందాయ్ శాంట్రోలో సాంకేతికంగా 1.1-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లో కూడా ఇదే ఇంజన్ ఉంది. దీనిని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు. ఇది విపణిలో ఉన్న ఇయాన్ మరియు గ్రాండ్ ఐ10 మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

విడుదల అంచనా: జూలై/ఆగష్టు 2018

ధర అంచనా: రూ. 3 లక్షలు

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ గత ఏడాది విపణిలోకి విడుదల చేసిన కంపాస్ మిడ్ సైజ్ ప్రీమియం ఎస్‌యూవీతో భారీ విజయాన్ని అందుకుంది. జీప్ కంపాస్ ఇచ్చిన సక్సెస్‌తో దానికి కొనసాగింపుగా ట్రయల్‌హాక్ వెర్షన్ లాంచ్ చేయడానికి జీప్ ఇండియా సిద్దమైంది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

రెగ్యలర్ వెర్షన్ కంపాస్ కంటే ఎన్నో మెరుగైన లక్షణాలు మరియు సామర్థ్యాలు ఉన్న కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీని తమ విలువైన కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా ఉన్న పలు జీప్ డీలర్ల వద్ద ప్రదర్శించింది. సాధారణ కంపాస్ కంటే ట్రయల్‌హాక్ వెర్షన్ మరిన్ని ఆఫ్ రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంది

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.0-లీటర్ కెపాసిటి గల టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు, 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో జీప్ యాక్టివ్ లో-రేంజ్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్, హిల్ డిసెంట్ మరియు న్యూ రాక్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

విడుదల అంచనా: జూన్/జూలై 2018

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

మహీంద్రా యు321

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అత్యంత ఖరీదైన యు321 ప్రీమియం ఎమ్‌పీవీని సిద్దం చేసింది. ఇప్పటి వరకు లెక్కలేనన్ని సార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండగా పట్టుపడింది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

మహీంద్రా డెవలప్ చేసిన యు321 ఎమ్‌పీవీ విపణిలో ఉన్న మారుతి ఎర్టిగా మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా మధ్య దూరాన్ని భర్తీ చేస్తుంది. దీనిని పూర్తిగా మోనోకోక్యూ ఛాసిస్ మీద నిర్మించారు. ఇందులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ రియర్ ఏ/సి వెంట్స్ ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

మహీంద్రా మరియు శాంగ్‌యాంగ్ సంయుక్తంగా అభివృద్ది చేసిన 1.6-లీటర్ కెపాసిటి గల ఎమ్‌ఫాల్కన్ డీజల్ ఇంజన్ ఇందులో ఉంది. 125బిహెచ్‌పి పవర్ మరియు 305ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా 163బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ నాలగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కూడా రానుంది. రెండింటిని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

విడుదల అంచనా: సెప్టెంబర్ 2018 నాటికి

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

మహీంద్రా ఎస్201

గత రెండు మూడేళ్లలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దేశీయంగా అమ్ముడవుతున్న ప్యాసింజర్ కార్లలో కాంపాక్ట్ ఎస్‌యూవీల వాటా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యధిక సేల్స్ సాధిస్తున్న మారుతి సుజుకి వితారా బ్రిజాకూ సరాసరి పోటీగా అత్యంత సరసమైన ధరలో ఎస్201 అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు మహీంద్రా ప్రయత్నిస్తోంది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

దక్షిణ కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ భాగస్వామ్యంతో తమ టివోల్ ఎస్‌యూవీ ఆధారంగా మహీంద్రా ఇంజనీరింగ్ బృందం ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని నిర్మించింది. తాజాగా, ప్రొడక్షన్ వెర్షన్ ఎస్201కు ఇండియన్ రోడ్ల మీద రహస్య పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టుపడింది. దీని ఇంటీరీయర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా మారుతి బ్రిజాకు గట్టి పోటీనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

మోనోకోక్యూ ఛాసిస్ మీద ని ర్మించిన ఎస్201 ఎస్‌యూవీ సాంకేతికంగా 1.2-లీటర్ టర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. మ్యాన్యువల్ మరియు గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇవి వరుసగా 140బిహెచ్‌పి మరియు 125బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. మహీంద్రా ఎస్201 పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మారుతి వితారా బ్రిజా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు ఇటీవల విడుదలైన హ్యుందాయ్ క్రెటా మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

విడుదల అంచనా: అక్టోబర్/నవంబర్ 2018

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

మారుతి సుజుకి ఎర్టిగా

సుజుకి మోటార్స్ ఇండోనేషియా మార్కెట్లోకి సరికొత్త అప్‌డేటెడ్ ఎర్టిగా ఎమ్‌పీవీని లాంచ్ చేసింది. బహుశా ఇండియన్ మార్కెట్లో కూడా అదే ఎర్టిగా‌ వాహనాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి తోడు కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీవీగా భావిస్తున్న ఓ మోడల్‌ను దేశీయంగా పలుమార్లు రహస్యంగా పరీక్షించింది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

సుజుకి అభివృద్ది చేసిన హార్టెట్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా న్యూ ఎర్టిగా ఎమ్‌పీవీని నిర్మించింది. డిజైర్, స్విఫ్ట్ మరియు బాలెనో కార్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది. దీంతో తేలికపాటి బరువుతో మునుపటి మోడల్ కంటే పెద్దగా ఉంటుంది. అయితే, ఇన్నోవా క్రిస్టా కంటే చిన్నగానే కనిపిస్తుంది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

మారుతి సుజుకి ప్రస్తుతం నూతన 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అభివృద్ది చేస్తోంది. అయితే, కొత్త తరం ఎర్టిగా ఈ రెండు ఇంజన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

విడుదల అంచనా: ఆగష్టు 2018

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

టాటా టిగోర్ జెటిపి

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో టిగోర్ జెటిపి పర్ఫామెన్స్ సెడాన్ కారును ఆవిష్కరించింది. టాటా మోటార్స్ ఈ టిగోర్ జెటిపి పర్పామెన్స్ కారును సాంకేతికంగా జయేం ఆటో అభివృద్ది చేసింది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే భారతదేశపు చీపెస్ట్ పర్ఫామెన్స్ సెడాన్‌గా నిలవనుంది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

టాటా టిగోర్ జెటిపి కారులో లోయర్ సస్పెన్షన్ సిస్టమ్, సరికొత్త ఎయిర్ ఇంటేకర్, బానెట్ మీద ఎయిర్ స్కూప్స్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ మరియు బాడీ కిట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఈ బాడీ కిట్ ద్వారా సైడ్-స్కర్ట్స్ మరియు రియర్ డిఫ్యూసర్ వంటివి ఉన్నాయి.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

సాంకేతికంగా ఇందులో నెక్సాన్ నుండి సేకరించిన 1.2-లీటర్ కెపాసిటి గల టర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. అయితే, ఇందులోని ఇంటేక్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో పలు మార్పులు నిర్వహించారు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 108బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విడుదల అంచనా: ఆగష్టు 2018

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

టాటా టియాగో జెటిపి

2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా టిగోర్‌ జెటిపితో పాటు టియాగో జెటిపి కారును కూడా ఆవిష్కరించారు. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే, భారతదేశపు అత్యంత సరసమైన పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలవనుంది.

ఈ ఏడాదిలో వరుసగా విడుదలకు సిద్దమైన 7 కొత్త కార్లు

టిగోర్ జెటిపి పర్ఫామెన్స్ సెడాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు టియాగో జెటిపిలో యథావిధిగా వచ్చాయి. సాంకేతికంగా కూడా టిగోర్‌లో ఉన్న పర్ఫామెన్స్ ఇంజన్ ఇందులో ఉంది. 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విడుదల అంచనా: ఆగష్టు 2018

Most Read Articles

English summary
Read In Telugu: 7 most AWAITED cars of 2018; From Hyundai Santro to Jeep Compass Trailhawk
Story first published: Tuesday, June 5, 2018, 15:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X