టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా 7-సీటర్ నిస్సాన్ టెర్రా

జపాన్ దిగ్గజం నిస్సాన్ తమ 7-సీటర్ టెర్రా ఎస్‌యూవీని పలు ఆసియన్ మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. గత మాసంలో 5-సీటర్ టెర్రా ఎస్‌యూవీని చైనాలో విడుదల చేసిన నిస్సాన్ తాజాగ వారం క్రితం ఫిలిప్పీన

By Anil Kumar

జపాన్ దిగ్గజం నిస్సాన్ తమ 7-సీటర్ టెర్రా ఎస్‌యూవీని పలు ఆసియన్ మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. గత మాసంలో 5-సీటర్ టెర్రా ఎస్‌యూవీని చైనాలో విడుదల చేసిన నిస్సాన్ తాజాగ వారం క్రితం ఫిలిప్పీన్స్‌లో 7-సీటర్ టెర్రా ఎస్‌యూవీ అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

ఫిలిప్పీన్స్‌లో జరిగిన నిస్సాన్ టెర్రా అంతర్జాతీయ ఆవిష్కరణలో భవిష్యత్తులో టెర్రా ఎస్‌యూవీని పరిచయం చేసే పలు మార్కెట్లను జాబితాను వివరించింది. థాయిలాండ్, ఇండోనేషియా, మయన్నార్ మరియు వియత్నాంతో పాటు పలు ఆసియన్ దేశాలు ఉన్నాయి.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

నిస్సాన్ ఈ టెర్రా ఎస్‌యూవీని మూడవ తరానికి చెందిన నిస్సాన్ నవారా ఆధారంగా పిపివి ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. మరియు డిజైన్ పరంగా నిస్సాన్ ఇతర మోడళ్లతో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటుంది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

నిస్సాన్ లైనప్‌లో మంచి సక్సెస్ సాధించిన ఎక్స్‌టెర్రా బాడీ ఫ్రేమ్ డిజైన్ చేశారు. ఎక్స్‌టెర్రా నిస్సాన్ పలాడిన్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో బాగా సుపరిచితరం. కొలతలు మరియు బాడీ స్టైల్ పరంగా ఇది 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్ క్రిందకు వస్తుంది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

నిస్సాన్ టెర్రా పొడవు 4.9-మీటర్లు, వెడల్పు 1.9-మీటర్లు మరియు ఎత్తు 1.8 మీటర్లుగా ఉంది. అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ 225ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2.9 మీటర్లు. ఇదే ఎస్‌యూవీ చైనాలో 5-సీటింగ్ లేఔట్లో లభ్యమవుతుండగా, ఫిలిప్పీన్స్ మరియు ఇతర ఆసియన్ మార్కెట్లలో 7-సీటింగ్ లేఔట్లో మూడు వరసల వెర్షన్ టెర్రా లభించనుంది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

చైనీస్ వెర్షన్ నిస్సాన్ టెర్రా 181బిహెచ్‌పి పవర్ మరియు 251ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే క్యూఆర్25 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. కానీ, ఫిలిప్పీన్స్ వెర్షన్ నిస్సాన్ టెర్రాలో 187బిహెచ్‌పి-450ఎన్ఎమ్ ఉత్పత్తి చేసే వైడి25 2.5-లీటర్ డీజల్ ఇంజన్ ఉంది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

ట్రాన్స్‌మిషన్ పరంగా రెండు మోడళ్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తాయి. అంతే కాకుండా, ఆప్షనల్ రియర్ డిఫరెన్షియల్ లాకింగ్ ఫీచర్ గల 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

నిస్సాన్ టెర్రా ఎస్‌యూవీలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, పుష్-బటన్ స్టార్ట్, స్మార్ట్ ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ ఉంది ఎస్‌యూవీ రియర్ కెమెరా వ్యూవ్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్న కెమెరా వ్యూవ్ డిస్ల్పే చేస్తుంది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

జీరో గ్రావిటీ గల ఫ్రంట్ సీట్లు, వన్ టచ్ రిమోట్ ఫోల్డ్ మరియు థంబుల్ సెకండ్ రో సీట్లు, ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ఎన్నో కీలకమైన ఫీచర్లు నిస్సాన్ టెర్రా ఎస్‌యూవీలో ఉన్నాయి.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

ప్రస్తుతం పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న నిస్సాన్ టెర్రా 7-సీటర్ ఇండియా విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, మార్కెట్లో ఉన్న అవకాశాల దృష్ట్యా చూస్తే వచ్చే ఏడాది దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

నిస్సాన్ టెర్రా 7-సీటర్

నిస్సాన్ టెర్రా 7-సీటర్ పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, మిత్సిబిషి పజేరో స్పోర్ట్, ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 7 seat nissan terra rival to toyota fortuner
Story first published: Friday, June 1, 2018, 10:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X