Just In
- just now
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 28 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎస్యూవీ ప్రియుల కోసం భారత్‌కొస్తున్న 8 కొత్త ఎస్‌యూవీలు
దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో ఎస్‌యూవీల విభాగం కీలకపాత్ర పోషిస్తోంది. అన్ని రకాల వయసున్న కస్టమర్లను వారి బడ్జెట్ ఆధారంగా వివిధ ఎస్‌యూవీలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎస్యూవీ వాహనాల సేల్స్ కూడా ప్రతి ఏటా గణనీయంగా నమోదవుతున్నాయి. దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు ఎస్యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించాయి.
అయితే, ఎస్యూవీ విభాగంలో ఉన్న అవకాశాలను చేజిక్కించుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు 8 కొత్త ఎస్‌యూవీలను విడుదలకు సిద్దం చేసాయి. అతి త్వరలో విడుదల కానున్న 8 ఎస్‌యూవీల గురించి పూర్తి వివరాలు...

8. హోండా హెచ్ఆర్-వి
జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ తమ హెచ్ఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది దేశీయంగా విడుదల చేయనుంది. హోండా ఇండియన్ మార్కెట్ కోసం ఆరు కొత్త మోడళ్లను ఖరారు చేశాము, అందులో హోండా హెచ్ఆర్-వి ఒకటని హోండా ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది, దేశీయంగా ఉన్న బిఆర్-వి మరియు సిఆర్-వి ఎస్‌యూవీల మధ్యనున్న దూరాన్ని భర్తీ చేస్తుంది.

హోండా జాజ్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించిన హోండా హెచ్ఆర్-వి ఇండియన్ వెర్షన్ సాంకేతికంగా 1.5-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది.

7. స్కోడా కరోక్
చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా దేశీయ మరియు అంతర్జాతీయ విపణిలో విలాసవంతమైన సెడాన్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకొని ఎస్యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే కొడియాక్ ఎస్‌యూవీని విడుదల చేసిన స్కోడా త్వరలో కరోక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

స్కోడా కరోక్ ఎస్‌యూవీని సాంకేతికంగా 2.0-లీటర్ టిడిఐ డీజల్ మరియు 1.8-లీటర్ టిఎస్ఐ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్లతో పరిచయం చేసే అవకాశం ఉంది.

6. కియా ఎస్పి ఎస్యూవీ
ఇప్పటికే దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన కియా మోటార్స్ 2019 నుండి ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించనుంది. ఇందు కోసం అనంతపురం జిల్లాలోని పెనుకొండ సమీపంలో ప్రొడక్షన్ ప్లాంటు పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఎస్‌యూవీలకు అధికంగా డిమాండ్ ఉన్న దేశీయ విపణిలోకి కియా తమ ఎస్పి ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కియా మోటార్స్ ఎస్పి కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. హ్యుందాయ్ క్రెటా ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన దీనిని జీప్ కంపాస్ మరియు రెనో క్యాప్చర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

5. హ్యుందాయ్ టుసాన్ ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ మోటార్స్ టుసాన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది. దీనిని 2019 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత టుసాన్ మోడల్‌తో పోల్చుకుంటే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

హ్యుందాయ్ టుసాన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో అవే మునుపటి 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ టుర్భో డీజల్ ఇంజన్లు రానున్నాయి. రెండు ఇంజన్ యూనిట్లు యథావిధిగా 6-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి.

4. టయోటా హీహెచ్-ఆర్
దేశీయంగా యువ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు టయోటా మోటార్స్ సరికొత్త సీహెచ్-ఆర్ ఎస్‌యూవీని భారత మార్కెట్ కోసం ఖరారు చేసింది. సీహెచ్-ఆర్ అనగా కూపే హై రైడర్ అని అర్థం. కూపే శైలిలో ఉన్న స్టైలిష్ ఎస్యూవీ ఇప్పటికే అంతర్జాతీయ విపణిలో అమ్మకాల్లో ఉంది.

టయోటా సీహెచ్-ఆర్ నిజానికి కరోలా సెడాన్ కంటే పెద్దది. సాంకేతికంగా ఇది, 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ మరియు 1.8-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లతో రానుంది. టయోటా నిర్మాణ విలువలు, అధునాతన డిజైన్ శైలి మేళవింపులతో కూడిన టయోటా సీహెచ్-ఆర్ యువ కొనుగోలుదారులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

3. ఎమ్‌జి జడ్ఎస్
ఎమ్‌జి జడ్ఎస్ 4.5-మీటర్లు పొడవున్న ఎస్యూవీ, ఇది హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. అంతే కాకుండా పొడవు పరంగా చూసుకుంటే రెండు ఎస్‌యూవీల కంటే ఎమ్‌జి జడ్ఎస్ పెద్దదిగా ఉంటుంది. దీంతో మహీంద్రా ఎక్స్‌యూవీ500 కెటగిరీలోకి కూడా వస్తుంది.

గుజరాత్‌లోని జనరల్ మోటార్స్(షెవర్లే) ప్రొడక్షన్ ప్లాంటును కొనుగోలు చేసిన ఎమ్‌జి మోటార్స్ దేశీయంగా వచ్చే ఏడాది నుండి పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించనుంది. సాంకేతికంగా ఇది, 1.0-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లతో లభించనుంది.

2. నిస్సాన్ కిక్స్
నిస్సాన్ నుండి దేశీయ విపణిలోకి విడుదలయ్యేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్ నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ. 2016లో బ్రెజిల్లో తొలిసారిగా ఆవిష్కరించిన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క బి-జీరో ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. రెనో డస్టర్ ఎస్‌యూవీని కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేశారు.

అత్యాధునిక స్టైలింగ్ అంశాలతో, కూపే తరహా బాడీ డిజైన్ కలిగి ఉన్న నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి సరాసరి పోటీనివ్వనుంది. కిక్స్ ఇండియన్ వెర్షన్లో నిస్సాన్ టెర్రానో నుండి సేకరించిన 1.5-లీటర్ డిసిఐ డీజల్ ఇంజన్ రానుంది.

టాటా హ్యారీయర్
ఇండియన్ ఎస్యూవీ సెగ్మెంట్లో భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైన మేడిన్ ఇండియా ఎస్యూవీ టాటా హ్యారీయర్. అవును, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎల్550 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన టాటా హ్యారీయర్ ఎన్నో అంతర్జాతీయ దిగ్గజాలకు రోజురోజుకూ దడపుట్టిస్తోంది.

ప్రీమియం ఎస్యూవీ విభాగంలోకి టాటా నుండి వస్తోన్న హ్యారియర్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. టాటా వారి ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ఆధారంగా రూపొందించిన హ్యారీయర్‌లో ఫియట్ నుండి సేకరించిన 2.0-లీటర్ ఇంజన్ అందివ్వనుంది.