అప్రిలియా స్టార్మ్ 125 విడుదల ఖరారు: విడుదల తేదీ మరియు ప్రత్యేకతలు

అప్రిలియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో స్టార్మ్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. అప్రిలియా స్టార్మ్ 125 తో పాటు ఎస్ఆర్ 125 స్కూటర్‌‍ను కూడా ఆవిష్కరించింది, అయితే అప్పట్లో

By Anil Kumar

ఇటలీకి చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ అప్రిలియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో స్టార్మ్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. అప్రిలియా స్టార్మ్ 125 తో పాటు ఎస్ఆర్ 125 స్కూటర్‌‍ను కూడా ఆవిష్కరించింది, అయితే అప్పట్లోనే దీనిని రూ. 65,310 ఎక్స్-షోరూమ్(పూనే) ధరతో లాంచ్ చేసింది.

ఇప్పుడు తాజాగా, ఎస్ఆర్ 125 స్కూటర్ ఆధారంగా రూపొందించిన స్టార్మ్ 125 స్కూటర్ విడుదలకు కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

అప్రిలియా స్టార్మ్ 125

సరికొత్త అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ ఈ ఏడాది చివరిలోపు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, పలు సమస్యల కారణంగా స్టార్మ్ 125 విడుదల ఆలస్యం అవుతుందని, దీనిని విడుదల జనవరి 2019లో ఉంటుందని కొన్ని కథనాలు వస్తున్నాయి.

అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్(CBS) వేరియంట్‌ను మాత్రమే విడుదల చేయనుంది. కంపెనీ తొలుత నాన్-సిబిఎస్ వేరియంట్‌ను విడుదల చేయాలని భావించినప్పటికీ, ఏప్రిల్ 2019 నుండి మార్కెట్లోకి విడుదలయ్యే 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న టూ వీలర్లలో సిబిఎస్ తప్పనిసరి కావడంతో సిబిఎస్ ఆప్షన్‌లో లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది.

అప్రిలియా స్టార్మ్ 125

ఒకవేళ సిబిఎస్ లేకుండా విడుదల చేయాలంటే కేవలం మూడు నెలల్లోపే విడుదల చేయాలి. అప్రిలియా కనుక సిబిఎస్ ఫీచర్ జోడింపుతో విడుదల చేస్తే సాధారణ వేరియంట్ కంటే సిబిఎస్ వేరియంట్ ధర మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా అచ్చం ఎస్ఆర్ 125 స్కూటర్‌నే పోలి ఉంటుంది. అయితే, నూతన పెయింట్ స్కీమ్. బాడీ గ్రాఫిక్స్, పెద్ద పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ మరియు విశాలమైన వెనుక టైరు వంటివి విభిన్నంగా ఉంటాయి.

అప్రిలియా స్టార్మ్ 125

సాంకేతికంగా అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్‌లో 124సీసీ కెపాసిటి గల 3-వాల్వ్ సింగల్ సిలిండర్ సీవీటీ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 9.46బిహెచ్‌పి పవర్ మరియు 8.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టార్మ్ 125 స్పోర్టివ్ స్కూటర్‌లో 6.5-లీటర్ల కెపాసిటి ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, అయితే ఎస్ఆర్ 125 స్కూటర్లో 7 లీటర్ల ట్యాంక్ కలదు.

అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్‌లో ముందువైపున 30ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రిలోడ్ అడ్జెస్టబుల్ సింగల్ షాక్ అబ్జార్వర్ ఉంది. స్టార్మ్ 125 స్కూటర్‌ను ప్రత్యేకించి యువత కోసం డిజైన్ చేశాము మరియు పలు రకాల యాక్ససరీలను కూడా అందుబాటులో ఉంచినట్లు అప్రిలియా పేర్కొంది.

అప్రిలియా స్టార్మ్ 125

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకును అందించారు. పనితీరుకు తగ్గట్లుగానే దీని బాడీ డిజైన్, కలర్ మరియు గ్రాఫిక్స్ మరింత స్పోర్టివ్ తత్వాన్ని కలిగి ఉంటాయి.

అప్రిలియా స్టార్మ్ 125

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్‌ను ఎస్ఆర్ 125 ఆధారంగా ఒకే డిజైన్ ఫిలాసఫీలో డెవలప్ చేశారు. మార్కెట్లో 125సీసీ స్కూటర్లకు డిమాండ్ పెరిగినప్పుడు తమ ప్రీమియం స్టార్మ్ 125‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.

అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ. 62,000 ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది మరియు ఎస్ఆర్ 125 స్కూటర్ క్రింది స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హోండా గ్రాజియా మరియు ఈ జూలై 19, 2018 న విడుదలవుతున్న సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ల నోరు మూయించనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Aprilia Storm 125 India Launch Details Revealed
Story first published: Monday, July 9, 2018, 9:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X